Parenting Tips: పిల్లల్లో విలువలు పెంపొందించాలి అనుకుంటున్నారా.. అయితే ఈ ఐదు విషయాలు నేర్పించండి చాలు
Parenting Tips: మీ పిల్లలలో మంచి ఆలోచనలతో పాటు విలువలను కూడా పెంపొందిచాలి అనుకుంటున్నారా..? ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా చిన్నప్పటి నుంచే కొన్ని విషయాలను నేర్పించడం. ఈ ఐదు విషయాలు వారికి చిన్నతనంలోనే నేర్పించారంటే విలువలు, విజయంతో కూడిన భవిష్యత్తు వారి సొంతం అవుతుంది.
తల్లిదండ్రులందరూ తమ పిల్లలలో మంచి ఆలోచనలు, ఉన్నతమైన విలువలు పెంపొందించాలని కలలు కంటారు. కానీ చాలాసార్లు తెలిసో తెలియకో అంటే చెడు సహవాసం లేదా చుట్టు పక్కల ఉండే చెడు వాతావరణం వారిని చెడగొడుతుంది. దీని వల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, గౌరవం ఇవ్వరు. చెడు మార్గాలకు, చెడు అలవాట్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఇది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వారి వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. విజయానికి వారిని దూరం చేస్తుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లలలో విలువలు పెంపొందిచాలంటే చిన్నతనంలోనే మీరు పునాది వేయాల్సి ఉంటుంది. విలువలతో కూడిన భవిష్యత్తునూ విజయాన్ని వారికి అందించాలంటే చిన్ననాటి నుంచే వారికి కొన్ని విషయాలను జాగ్రత్తగా నేర్పించాల్సి ఉంటుంది. బాల్యంలో ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు నేర్పించాల్సిన ఆ ఐదు ముఖ్యమైన విషయాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
1. కృతజ్ఞతతో ఉండటం:
చిన్నా పెద్దా తేడా లేకుండా సాయం చేసే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇతరులకు కృతజ్ఞత వ్యక్తం చేసే గుణం పిల్లల మనస్సులో సానుకూల భావోద్వేగాలను నింపడానికి పనిచేస్తుంది. ఇది వారు మంచి వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది.
2. క్షమించే గుణం:
క్షమించడం చాలా గొప్ప గుణం. ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. కానీ నిజంగా ఇలా చేయగలిగిన వారికి జీవితంలో విజయం ఎప్పుడూ తోడుంటుంది. కనుక తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్షమించే గుణాన్ని అలవాటు చేయాలి. ఇలా చేయడం ద్వారా వారి ధోరణులు హింసాత్మక లేదా ప్రతీకారపూరితంగా ఉండకుండా ఆపగలుగుతారు.
3. దైవ భక్తి:
ఏ మతమూ ఒక వ్యక్తిని హింసించమనీ లేదా తప్పు చేయమని బోధించదు. కనుక మీరు ఏ మతానికి చెందినవారైనా, తదనుగుణంగా ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించడం వారికి నేర్పించండి. దైవం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడం పిల్లలకు నేర్పించండి. అలాగే, మీ బిడ్డకు ఆధ్యాత్మిక కథలు చెప్పండి. ఇలా చేయడం వల్ల పిల్లల మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు, వారి మానసిక ఆలోచనలో పెద్ద మార్పు వస్తుంది. వారు ఎలాంటి తప్పు చేయకుండా ఇంటికి తిరిగి వస్తారు.
4. తప్పులను అంగీకరించడం:
తప్పులు చేయడం మనిషి స్వభావం. ఒక వ్యక్తి చిన్నవాడైనా, పెద్దవాడైనా సరే తప్పు చేయకుండా ఉండరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ తప్పులను పిల్లల దగ్గర దాచకూడదు. అయితే ఏంటని దబాయించకూడదు. తమ తప్పును పిల్లల ముందు నిస్సందేహంగా అంగీకరించాలి. ఇలా చేయడం వల్ల వారి దృష్టిలో మీ గౌరవం పెరుగుతుంది. వారికి కూడా అదే అలవాటుగా మారి విలువలను పెంచుతుంది.
5. నియమాలను అనుసరించడం:
మీరు చేసిన నియమాలను మీ బిడ్డ పూర్తి నిజాయితీతో అనుసరించాలనుకుంటే మొదట మీరు వాటిని ఖచ్చితంగా పాటించాలి. పిల్లలు ఎప్పుడూ ఇంట్లో జరిగే విషయాలను అంటే తమ తల్లిదండ్రులు చేసే పనులనే పునరావృతం చేస్తారు. వాస్తవానికి, చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం నియమాలను రూపొందిస్తారు కాని ఆ నియమాలను పాటించడంలో విఫలమవుతారు. ఇది పిల్లల మృదువైన మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు మీ మాట వినాలంటే ముందు మీరు కూడా నిజాయితీగా ఆ నియమాలను పాటించాలి. ఇది పిల్లలకు ఆదర్శంగా మారుతుంది. వారి దృష్టిలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత పెరుగుతుంది.
సంబంధిత కథనం