Watermelon Seeds : పుచ్చకాయ గింజలతో పురుషులకు అద్భుతాలు.. ఇక విసిరేయకండి-watermelon seeds increase sperm count and male fertility know magical benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Watermelon Seeds : పుచ్చకాయ గింజలతో పురుషులకు అద్భుతాలు.. ఇక విసిరేయకండి

Watermelon Seeds : పుచ్చకాయ గింజలతో పురుషులకు అద్భుతాలు.. ఇక విసిరేయకండి

Anand Sai HT Telugu

Male Fertility In Telugu : వేసవిలో పుచ్చకాయ తినడం చాలా మందికి అలవాటు. కానీ దాని గింజలను విసిరేస్తారు. వీటితో పురుషలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పుచ్చకాయ గింజల ప్రయోజనాలు (Unsplash)

వేసవిలో లభించే పుచ్చకాయతో మనిషికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తింటే శరీరంలో నీటి శాతం పెరుగతుంది. అంతేకాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. పుచ్చకాయ తిని.. దాని గింజలను ఉమ్మేస్తారు. కానీ అలా చేయకూడదు. ఈ గింజలతో పురుషులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని కచ్చితంగా అందరూ తినాలి.

పెళ్లి తర్వాత ప్రతి మగాడు తన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకు తమ శరీరంలో ఎలాంటి బలహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. సాధారణంగా పురుషుడు తండ్రి కావాలంటే అతని స్పెర్మ్ కౌంట్ కచ్చితంగా ఉండాలి. లేకుంటే సంతానోత్పత్తి బలహీనంగా మారి వైవాహిక జీవితం చేదుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో పుచ్చకాయ పండు విత్తనాలు తప్పనిసరిగా స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మీకు సహాయం చేస్తాయి.

సాధారణంగా వేసవి కాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో దీన్ని తింటే శరీరంలో నీరు తగ్గదు. ఈ జ్యూసి ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. అయితే ఈ విత్తనాల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు కూడా తెలుసుకోవాలి. పెళ్లయిన ప్రతి ఒక్కరు పుచ్చకాయ గింజలను తప్పనిసరిగా తినాలి. దీని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూడండి.

పురుషులకు పుచ్చకాయ గింజల ప్రయోజనాలు

పుచ్చకాయ గింజలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం ఇది స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది పురుషుల సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది.

ఇందులో ఉండే సిట్రులిన్ పురుషుల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ గింజల్లో ఉండే జింక్ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. తండ్రులు కావడానికి ఎటువంటి అడ్డంకి లేకుండా చేస్తుంది.

పుచ్చకాయ గింజల్లో ఉండే గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ పురుషులలో లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.

పురుషులు పుచ్చకాయ గింజలను తింటే, అది వారి సంతానోత్పత్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్పెర్మ్ సమస్య ఉన్నవారు ఈ పండు గింజలను తినాలి.

పుచ్చకాయ గింజల్లో పోషకాలు

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది కాకుండా, ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది.

పుచ్చకాయ గింజలు ఎలా తినాలి?

పుచ్చకాయ గింజలను అలాగే తినడం ఒక ఎంపిక. వాటిని ఎండలో బాగా ఎండబెట్టడం, వాటిని తినడం మరొక విధానం. మీకు నచ్చితే వాటిని కూడా వేయించుకోవచ్చు. కానీ పుచ్చకాయ గింజలు ఎలా తిన్నకూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో పుచ్చకాయలు తింటే.. వాటి గింజలను అస్సలు తీసివేయకండి. తిని ప్రయోజనాలు పొందండి.