Quick Egg Breakfast: ఎగ్‌తో కొత్త రకమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా.. హైదరబాదీ స్పెషల్ ఖగీనా రెసిపీని ట్రై చేయండి
Quick Egg Breakfast: ఎగ్‌తో మీరిప్పటి వరకూ ట్రై చేసిన బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్ గురించి మర్చిపోండి. ఒక్కసారి హైదరాబాదీ స్పెషల్ వంటకమైన ఖగీనాను ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తినాలనిపించే ఈ వంటకాన్ని క్షణాల్లో తయారుచేసుకోండి.
ఎగ్‌తో కొత్త రకమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా.. (shutterstock)
క్షణాల్లో కూర తయారు కావాలన్నా, ఏదైనా టిఫిన్ చేసుకోవాలన్నా మనకు గుర్తొచ్చేది గుడ్డు. టైం సరిపోవడం లేదని ప్రతిరోజూ ఆమ్లెట్లతోనే టిఫిన్ ఫినిష్ చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే, కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. బాలీవుడ్ వరకూ వెళ్లి తెలుగోళ్ల సత్తా చాటిన అదితి హైదరీకి కూడా ఈ హైదరాబాదీ ఎగ్ డిష్ ఖగీనా అంటే చాలా ఇష్టమట. వాస్తవానికి రుచికి అద్భుతంగా అనిపించే ఈ వంట తింటే మీరు కూడా అదే మాట అంటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కాబట్టి హైదరాబాదీ వంటకం ఖగీనా రెసిపీని త్వరగా చూసేద్దాం రండి.
హైదరాబాదీ డిష్ ఖగీనా
కావాల్సిన పదార్థాలు:
- 5 గుడ్లు
- 2 ఉల్లిపాయలు, మెత్తగా తరిగినవి
- 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి
- ½ స్పూన్ జీలకర్ర గింజలు
- 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ స్పూన్ పసుపు పొడి
- ½ స్పూన్ ఎర్ర మిరప పొడి
- ½ టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడి
- ½ స్పూన్ గరం మసాలా పొడి
- ఉప్పు రుచికి తగినంత
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు, సన్నగా తరిగినవి
- 1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు, సన్నగా తరిగినవి
ఖగీనా తయారీకి కావలసినవి
- ముందు లోతుగా ఉండే కడాయిని తీసుకుని అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
- ఆ తర్వాత అల్లం, వెల్లుల్లితో చేసుకున్న మెత్తని పేస్ట్ ను వేసి వేయించాలి.
- కొద్దిగా వేగిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను, అలాగే పచ్చిమిర్చిని వేయాలి.
- ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకూ వేయించుకుంటూ ఉండాలి.
- ఇప్పుడు నేరుగా గుడ్లను పగులగొట్టి గిన్నెలో వేయాలి. గుడ్డు పచ్చసొనను కదిలించకుండా మూత పెట్టి తక్కువ మంట మీద ఉంచాలి.
- గుడ్డు ఉడుకుతున్న సమయంలో, వేరే గిన్నెలో 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయల చిన్న చిన్న ముక్కలను, అది వద్దనుకుంటే మిరపకాయల పొడి (కారం)ని కూడా కలుపుకోవచ్చు. అందులో రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా చట్నీలా చేసుకోవాలి. ఇదంతా చూడటానికి సాస్ లా కనిపిస్తుంది.
- అలా తయారుచేసిన సాస్‌ను ఉడుకుతున్న గుడ్డుపై వేసి చెంచా సహాయంతో పేస్ట్ లాగా రుద్దండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూతపెట్టి గుడ్లు పూర్తిగా ఉడికేంత వరకూ చూడండి.
- అంతే, మీకెంతగానో నచ్చే, అదితిరావు మెచ్చే ఎగ్ ఖగీనా వంటకం రెడీ అయిపోయినట్లే! దీనిని మీరు అన్నంలో లేదా వేడివేడి పరాఠాలతో కలిపి తినొచ్చు.
- గుడ్డును ఎప్పుడూ ఒకే రకంగా తినడానికి ఇష్టపడని వాళ్లకు ఈ వంటకం బాగా నచ్చుతుంది.
సంబంధిత కథనం