Travel 2025: కొత్త ఏడాదిలో విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చు అయ్యే దేశాలు ఇవిగో
Travel 2025: ఎంతో మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. విదేశాలకు వెళ్లాలన్న కోరిక కూడా ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఖర్చుకు వెనుకాడతారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. మీకు తక్కువ బడ్జెట్లో పర్యటన చేయగలిగే దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఎంత ఖర్చువుతుందో తెలుసుకోండి.
జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లిరావాలన్న కోరిక ఉంటుంది. అలా కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లాలని ఎంతో మంది ఆకాంక్ష. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఖర్చు గురించి భయపడతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే ఇంకా భయం. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందనే అనుమానంతో అలాంటి ప్రయత్నాలు కూడా చేయరు. అయితే ఇక్కడ మేము కొన్ని చవక దేశాల గురించి ఇచ్చాము. అంటే మీరు చవకగానే, తక్కువ ఖర్చుతో ఈ దేశాలకు విదేశీ పర్యటను వెళ్లి రావచ్చు. మీరు కొత్త సంవత్సరం 2025లో విదేశాలకు వెళ్లాలనుకుంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాల గురించి ఇక్కడ ఇచ్చాము. మీరు కుటుంబంతో మీరు అనుకున్న తక్కువ బడ్జెట్లోనే ఈ దేశాలకు వెళ్లి రావచ్చు.
1) వియత్నాం
వియత్నాం చాలా అందమైన దేశం. సందడిగా ఉండే నగరాన్ని, ప్రశాంతమైన సముద్ర తీరాన్ని చూస్తే మనసుకు కొత్త ఉల్లాసం వస్తుంది. ఇక్కడి స్థానిక స్ట్రీట్ ఫుడ్ ఎంతో రుచికరంగా ఉంటుంది, పైగా చాలా చవక కూడా. ఈ దేశానికి వెళ్లాంటే ఒక వ్యక్తికి విమాన టిక్కెట్ ధర 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది కాకుండా, అక్కడ మీకు వసతి, ఆహారం చాలా చవకగానే ఉంటాయి. ఒక్కరూ వెళ్లాలనుకుంటే లక్ష రూపాయలతో వియత్నం హ్యాపీగా వెళ్లి రావచ్చు.
2) శ్రీలంక
అందమైన బీచ్ లు, తేయాకు తోటలు, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన శ్రీలంక భారతదేశానికి అతి సమీపంలో ఉంది. అదే సమయంలో బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే విమాన టిక్కెట్ ఖరీదు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఉంటుంది. బడ్జెట్ కు తగ్గట్టుగానే వసతి, స్థానిక రవాణా ఇక్కడ చాలా చవకగా ఉంటాయి. రోజుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతుంది.
3) నేపాల్
నేపాల్ కూడా ఒక అందమైన దేశం. ట్రెక్కింగ్, ఆధ్యాత్మిక మఠాలు, అద్భుతమైన మంచు పర్వత దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన నేపాల్ కు రోడ్డు లేదా విమాన మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నేపాల్ కు వెళ్లాలంటే విమానం టిక్కెట్ ధర 7,000 రూపాయలను నుంచి 10,000 రూపాయలు మధ్య ఉంటుంది. ఈ ప్రదేశంలో బస, ఆహారంతో పాటు రోజువారీ ఖర్చులు 4,000 రూపాయల నుండి 6,500 రూపాయల వరకు ఉంటాయి.
4) థాయ్ లాండ్
థాయ్ లాండ్ ఎన్నిసార్లూ చూసిన తనివితీరదు. ఇక్కడి సంస్కృతి, స్ట్రీట్ ఫుడ్, ద్వీపాలు ఏడాది పొడవునా భారతీయ యాత్రికులను ఆకర్షిస్తాయి. బ్యాంకాక్, ఫుకెట్, చియాంగ్ మాయి వంటి ప్రదేశాలు ప్రసిద్ధంగా చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడ టికెట్ ధర రూ.12,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుంది. హాస్టళ్లు, భోజనాల రోజువారీ ఖర్చు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఉంటుంది.
5) ఇండోనేషియా
ఈ ప్రదేశం బీచ్‌లు, దేవాలయాలు, నైట్ లైఫ్ కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బాలి హనీమూన్‌కు చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడికి చేరుకోవాలంటే విమాన టిక్కెట్ ధర రూ.20,000 నుంచి రూ.25,000 వరకు ఉంటాయి. అందుబాటు ధరల్లో వసతి, ఆహారం కోసం ఇక్కడ రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.