Ingrown ToeNails: గోర్లు పెరగకపోవడం వల్ల కలిగే సమస్యలేంటో తెలుసా? వాటిని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో చూడండి!-want to reduce the problem of ingrown nails get the solution with these home remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ingrown Toenails: గోర్లు పెరగకపోవడం వల్ల కలిగే సమస్యలేంటో తెలుసా? వాటిని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో చూడండి!

Ingrown ToeNails: గోర్లు పెరగకపోవడం వల్ల కలిగే సమస్యలేంటో తెలుసా? వాటిని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో చూడండి!

Ramya Sri Marka HT Telugu

Ingrown ToeNails: పెరగని గోర్లు మీలో నొప్పిని కలిగించొచ్చు. గోరు చుట్టూ ఉన్న ప్రాంతం కందినట్లుగా అవడం, నొప్పికి వాచిపోవడం వంటివి గమనించొచ్చు. అయితే ఇటువంటి సమస్యలకు హోం రెమెడీ ఉందనే విషయం మీకు తెలుసా.

పెరగని గోర్లతో కలిగే ప్రమాదం

గోర్లు సరిగ్గా పెరగకపోవడం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంటుంది. దీనికి పలు కారణాలు ఉండొచ్చు కానీ, కొన్నిసార్లు ఇలా జరగడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైపోతుంది. గోరు పాడైన పరిస్థితి దారుణంగా ఉంటే, అది సర్జరీకి కూడా దారితీయొచ్చు. హోం రెమెడీతో పరిష్కారమయ్యే ఈ సమస్యను నిర్లక్ష్యపెడితే వైద్యుడి సహాయం తప్పనిసరి. ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించాలి, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం రండి.

గోర్లు సరిగ్గా ఎదగకపోతే ఏం జరుగుతుందంటే..

కాలి బొటనవేలు మూలల్లో గోర్లు సరిగా ఎదగకపోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. చుట్టూ ఉన్న చర్మం మీద ఒత్తిడి పెరిగి బొటనవేలికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అలా జరగడం వల్ల..

  • నొప్పి
  • ఎర్రగా మారిపోవడం
  • వాచినట్లుగా కనిపించడం
  • ఇన్ఫెక్షన్ పెరిగి జ్వరం రావడం వంటి సమస్యలు కనిపించొచ్చు.

ఇలా జరగడానికి పలు కారణాలు:

  • కాలి బొటనవేలిపై ఎక్కువగా ఒత్తిడిపడటం
  • సరిపడని బూట్లను ధరించడం అంటే ఎక్కువ లూజ్ లేదా టైట్ ఉన్నవి
  • కాలిబొటనవేలిని బాగా చిన్నగా కత్తిరించడం లేదా ఇతర షేపులలో కత్తిరించుకోవడం.
  • గోళ్ల పరిశుభ్రత పాటించకపోవడం
  • చెమట ఎక్కువగా పట్టడం ( హైపర్ హైడ్రోసిస్)
  • గోళ్లను కాపాడుకునే క్రమంలో వినియోగించే తప్పుడు మెడికేషన్

పెరగకుండా ఉండిపోయిన గోళ్లకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స చేయించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ప్రత్యేకించి డయాబెటిస్, కాలి సమస్యలు ఉన్న వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఓ మాదిరిగా మాత్రమే పెరుగుతూ కొద్దిపాటి ఇబ్బంది కలిగించే గోళ్లకు హోం రెమెడీలతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అవేంటో చూసేద్దామా..

హోం రెమెడీలు

వేడినీళ్లలో నానబెట్టడం

పాదాలను లేదా గోళ్లు ఉండే భాగాలను వేడినీళ్లలో కాసేపటి వరకూ నానబెట్టాలి. ఒక 20 నిమిషాల పాటు రూం టెంపరేచర్ వద్ద ఇలా ఉంచితే, నొప్పి తీవ్రత తగ్గుతుంది.

అదనంగా నీళ్లలో ఎప్సమ్ ఉప్పును కూడా కలుపుకోవచ్చు.

కొన్ని సార్లు గోరు దగ్గరి ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కూడా లాభాలున్నాయని అమెరికన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ చాలా సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది. అందులో సరిగా పెరగని గోర్ల సమస్య కూడా ఒకటి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ-ఇన్ ఫ్లమ్మేటమరీ, నొప్పిని తగ్గించే సామర్థ్యం ఉంటాయని సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. దీని కోసం పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని వేడి నీళ్లలో కాలుని ఉంచండి. ఇలా పదేపదే చేస్తుండటం వల్ల చక్కటి ఫలితాలు పొందొచ్చు.

సమస్య రాకుండా ఉండేందుకు ఏం చేయాలి:

  • బాగా పెద్దవి లేదా వదులైన బూట్లు లేదా సాక్సులు ధరింకండి. వీటి ఫలితంగా బొటనవేలిపై ఎక్కువ భారం పడుతుంది.
  • ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే, షూ వేసుకున్న తర్వాత కాలిబొటనవేలు ఫ్రీగా కదిలేంత గ్యాప్ ఇవ్వాలి.
  • బొటనవేలికి రక్షణగా ఉండే రింగ్స్ ధరించాలి. ఇది బొటనవేలు మొత్తాన్ని కవర్ అయ్యేలా ఉంచితే ఇంకా మంచిది. కొన్నిసార్లు బొటనవేలికి మెడికేటెడ్ జెల్ రాయడం వల్ల ఆ ప్రాంతం సున్నితంగా మారిపోతుంది.

గోళ్ల పెరగకపోతే వైద్యుడ్ని ఏ సమయంలో సంప్రదించాలి:

  • రక్త సరఫరా తక్కువగా ఉందని అనిపించినప్పుడు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
  • మీ గోరు దగ్గర ఉన్న ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కనిపించి, అది ఇతర సమస్యలకు దారితీస్తుంటే వైద్యుడ్ని కలవాల్సిందే.
  • పెరగని గోరు ప్రాంతంలో కలిగిన సమస్య దానంతట అదే తగ్గకపోయినా ఇబ్బందే.
  • నడిచే సమయంలో ఈ బొటనవేలు మరింతగా వేధిస్తుంటే, వైద్యుడ్ని కలవాలని మర్చిపోకండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం