Kishmish For Weight Loss: వేలాడే పొట్ట మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తుందా? ఎండు ద్రాక్ష మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది!
Kishmish For Weight Loss: వేలాడే పొట్ట కారణంగా నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతున్నారా? బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడం కోసం తాపత్రయ పడుతున్నారా? ఎండు ద్రాక్ష మీకు కచ్చితంగా సహాయపడుతుంది. పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గించుకునేందుకు ఎండుద్రాక్షను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
వేలాడే పొట్ట మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తుందా? ఎండు ద్రాక్ష మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది!
ఆహార అలవాట్లలో క్రమశిక్షణ లోపించడంతో ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయానికి గురవుతున్నారు. దాదాపు 70శాతం మంది కొవ్వు పెరిగి వేలాడుతున్న పొట్టతో కనిపిస్తున్నారు. దీనికి కారణం ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం, శరీరానికి సరిపడా వ్యాయామం లేకపోవడం, ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయట. ఇటువంటి స్థితి నుంచి శరీరాన్ని తిరిగి మామూలు స్థితికి తెచ్చుకోవడానికి చాలానే కష్టపడాలి మరి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. ఈ బరువు తగ్గించే ప్రక్రియల్లో ఒకటైన ఆహారపు అలవాట్లలో ఎండు ద్రాక్ష తీసుకోవడం అనేది కీలకంగా వ్యవహరిస్తుందట. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదేంటి, బరువు తగ్గడానికి, ఎండుద్రాక్షకు మధ్య సంబంధమేంటి అనుకుంటున్నారా.. రండి తెలుసుకుందాం.
ద్రాక్ష బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
- విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఇతర పోషకాలతో నిండిన ఎండుద్రాక్ష బరువు తగ్గడానికి మంచి ఛాయీస్.
- ఎండుద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇది మంచి స్నాక్స్ ఆప్షన్ గా కూడా ఉంటుంది.
- ఎండుద్రాక్షలో సహజ పండ్లలో దొరికే గ్లూకోజ్, లెప్టిన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉంచి చాలా సేపటి వరకూ ఆకలి కాకుండా చేస్తాయి.
- లెప్టిన్ కొవ్వు కణాలను వేగంగా కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
- ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎండుద్రాక్ష జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి ఎండుద్రాక్షను ఎలా తినాలి?
- ఎండుద్రాక్షను తినడానికి ఆరోగ్యకరమైన అలవాటు ఏంటంటే, రాత్రిపూట నానబెట్టి తినడం. బరువు తగ్గడానికి కూడా ఇదే ఉత్తమమైన మార్గం.
- మీరు ఈ పద్దతిని పాటించాలంటే, రాత్రి 10 నుండి 15 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టుకోవాలి.
- ఉదయాన్నే పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల అనవసరమైన ఖనిజాలు, విటమిన్లు నీటిలో కరిగిపోతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు మాత్రమే లభిస్తాయి, వీటి శోషణ వేగవంతం అవుతుంది.
- నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది పోషకాల శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు త్రాగండి
- ఎండుద్రాక్షలను నమిలి తినడానికి బదులు ఎండుద్రాక్ష నీరు కూడా తీసుకోవచ్చు.
- దీనిని తయారు చేయడానికి, రెండు కప్పుల నీటిలో 150 గ్రాముల ఎండుద్రాక్ష వేసుకోండి. ఎండుద్రాక్షల్లోని సారం నీటిలో కలిసేంత వరకూ మరిగించండి.
- నీరు ఒక కప్పు అయ్యేంత వరకూ మరిగించి, స్టవ్ ఆపేయండి.
- ఇప్పుడు ఈ నీటిని వడకట్టి గ్లాసులో పోసుకోండి. ఎక్కువగా చల్లారబెట్టకుండా కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే త్రాగేయండి. ఇలా రోజూ చేస్తుంటే, కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం మీ బరువుపై కనిపిస్తుంది.
- శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి, బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీరు త్రాగడం చాలా ప్రయోజనకరం.
- ఇది తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, బరువు తగ్గడానికి ఇది ఉత్తమ పానీయంగా ఉంటుంది.
సంబంధిత కథనం