సూర్యుడే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. సూర్యుడే లేకపోతే మనిషి జీవించడం పూర్తిగా అసాధ్యంగా మారుతుంది. వివిధ సంస్కృతుల్లో సూర్యుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన శక్తి, సానుకూలతను సూచిస్తాడు. కాంతి, వెచ్చదనం ఇస్తాడు. తమ పిల్లలకు సూర్యుడు పేరు వచ్చేలా పెట్టాలని ఎంతోమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. హిందూ పురాణాలలో కూడా సూర్యుడిని దైవంగా భావిస్తారు. ఎన్నో పండగలు సూర్యుడికి అంకితం చేశారు. ఇక్కడ మేము సూర్యుని అర్థం వచ్చే పేర్లను ఇచ్చాము. మీ పిల్లవాడికి లేదా పాపకు ఈ పేర్లు పెట్టుకోవచ్చు.
ఆదిత్య - సూర్యుడి అందమైన పేరు ఇది.
అహాన్ - ఈ పేరుకు అర్థం పగలు అని వస్తుంది. ఆకాశంలో సూర్యుడి ప్రయాణాన్ని కూడా చూపిస్తుంది.
ఆరుష్ - ఈ పేరుకు కూడా సూర్యుడు అనే అర్థం.
ఆదిదేవ్ - దేవతలకు మూలం అని కూడా చెప్పుకుంటారు. సర్వోన్నతమైన దేవుడుharitha అని అర్థం. సూర్యుణ్ణి ఆదిదేవుడు అని పిలుచుకుంటారు.
అన్షుల్ - ఈ పేరుకు అర్థం ప్రకాశవంతమైన, కాంతివంతమైన సూర్యుడు అని.
ఆదిరాజ్ - ఈ పేరుకు సూర్య మహారాజు అని అర్థం.
అయాన్ - సూర్యుడు ప్రయాణించే గమనాన్ని అయాన్ అని పిలుచుకుంటారు.
దీప్తాంశు - మండుతున్న ప్రకాశంవంతమైన సూర్యుడు అని అర్థం.
దివ్యాంశు - సూర్యుడి ప్రకాశవంతమైన కిరణాలను దివ్యాంషు అంటారు.
హరిత్ - ఈ పేరుకు అర్థం సూర్యుడి వేగవంతమైన గుర్రం అని.
ఇషాన్ - శివుని రూపంలో ఉన్న సూర్యుడిని ఇషాన్ అని పిలుచుకుంటారు.
మిహిర్ - ఈ పేరుకు సూర్యుడు, చంద్రుడు, మేఘాలు ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎక్కువగా సూర్యుడినే భావిస్తారు.
రవితేజస్ - రవి అంటే సూర్యుడు. తేజస్ అంటే తేజస్సు. సూర్యుని నుంచి వచ్చే తేజస్సుని రవితేజస్ అని అంటారు.
తేజస్ - సూర్యుడు శక్తిని తేజస్సును చెప్పే పేరు ఇది.
విభాకర్ - ఈ పేరుకు సూర్యుడు అని అర్థం. అలాగే అగ్ని అని అర్థం కూడా వస్తుంది.
విహాన్ - సూర్యోదయాన్ని సూచించే అందమైన పేరు ఇది.
………………………………………………………………………
అహనా - సూర్యుడి ప్రయాణాన్ని చూపించే పేరు ఇది. అలాగే పగలు, ఆకాశం అనే అర్థాలు కూడా ఉన్నాయి.
అన్షుల - సూర్యుడిలాగా ప్రకాశవంతమైన వ్యక్తి అని అర్థం.
అన్షు - సూర్యుడి కిరణాన్ని అన్షు అని పిలుచుకుంటారు.
ఆరుషి - తెల్లవారుజామును లేదా సూర్యోదయాన్ని ఆరుషి అంటారు.
మహీర - సూర్యుడి మరొక పేరు ఇది. అలాగే నిపుణులు అని అర్థం కూడా వస్తుంది.
మిహిర - మిహిరా అనేది ఒక అందమైన పేరు. దీనికి సూర్యుడు, చంద్రుడు, మేఘాలు అనే అర్థం ఉన్నాయి.
సీయోనా - కాంతి కిరణాన్ని సీయోనా అని పిలుచుకుంటారు. అందమైన అని అర్థం కూడా ఉంది.
ఉదిత - ఈ సింపుల్ పేరుకి అర్థం సూర్యోదయం అని.
విభాతి - సూర్యోదయాన్ని ఈ పేరుతో పిలుచుకుంటారు. అమ్మాయిలకు ఇది అందమైన పేరు.
కిరణ్మాల - ఈ భిన్నమైన పేరుకు సూర్యకిరణాల దండ అని అర్థం. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.
జియా - ఈ పేరుకు అర్థం ప్రకాశవంతమైన సూర్యకాంతి అని.
భనవి - ఇది కూడా అరుదైన పేరు. చాలా ప్రపంచంలో తక్కువ మందికి ఈ పేరు ఉంది. 12 సూర్యులను కలిపితే ఎంత శక్తి వస్తుందో ఆ శక్తిని భనవి అని పిలుస్తారు.
అరణి - దీనికర్థం సూర్యుడు అని. అలాగే అగ్ని అని కూడా అర్థం ఉంది.
పైన చెప్పిన పేర్లలో మీ పాపకు లేదా బాబుకు అందమైన పేరును వెతికి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్రకాశమంతమైన సూర్యుడిని సూచించే పేర్లు. పైగా ఈ కాలం పిల్లలకు నప్పేవిలా ఉంటాయి.
సంబంధిత కథనం