Diet Foods: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కడుపును ఆకలితో బాధపెట్టకుండానే ఈ ఏడు రోజుల్లో షాకింగ్ రిజల్ట్ పొందండి
Diet Foods: డైటింగ్ కోసం ప్రయత్నించి పొట్ట భాగంలో ఎటువంటి మార్పు రాలేదని విసిగిపోయారా..? ఆకలి మంటలు తట్టుకోలేక డైటింగ్‌కు బైబై చెప్పేశారా? ఇది తెలుసుకోండి. ఏడు రోజుల పాటు సింపుల్ ఫుడ్ ఫాలో అయి షాకింగ్ రిజల్ట్స్ పొందండి. ఇంకెందుకు లేటు!
ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం, మనం తీసుకున్న ఆహారంలో జీర్ణమైనంత వరకూ పోషణ కోసం ఉపయోగపడుతుంది. శరీరం జీర్ణించుకోలేనిది విషంగా మారుతుంది. అటువంటి వ్యర్థాల రూపంలో మారిపోవడం వల్ల విషంగా మారిన ఆహారం శరీరంలో పేరుకుపోతుంది. ఇవి క్రమంగా శరీరానికి వ్యాధులను కలిగిస్తుంటాయి. ఫలితంగా సుదీర్ఘ కాలంలో కాలేయం, కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. చివరికి వాటిని తొలగించాల్సిన అవసరం రావొచ్చు.
ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే, మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకూడదు. మన శరీరానికి సరిపడ లేదా ఉత్తమమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మరి ఉత్తమమైన ఆహారమేంటి. వారం రోజుల పాటు ఇలా తినడం వల్ల ఎనర్జిటిక్‌గా ఫీల్ అయ్యి కడుపును డిటాక్సిఫై చేసుకోవడమెలాగో తెలుసుకుందాం.
ప్రముఖ ఆయుర్వేద చికిత్స పంచకర్మ:
దీర్ఘాయుష్షుతో జీవించాలంటే ప్రతిఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా ఆయుర్వేదంలో ప్రముఖ చికిత్సా విధానమైన పంచకర్మ చేయించుకోవాలట. ఇలా పంచకర్మ చేయించుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ కేవలం ఒక నిపుణుడి సహాయంతో మాత్రమే చేయాలి. పంచకర్మలో శరీరాన్ని నిర్విషీకరణ చేసి, శరీరాన్ని ఉత్తేజితం చేస్తారు. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఉండి మీ జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వాలనుకుంటే వారం రోజుల పాటు కిచిడీ మాత్రమే తినాలని వైద్యులు చెప్తున్నారు.
కిచిడీ ప్రాముఖ్యత:
కిచిడీలో పప్పు ద్వారా ప్రోటీన్, బియ్యం నుంచి కార్బోహైడ్రేట్, నెయ్యి నుంచి ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తాయని ఆయన చెప్పారు. నెయ్యి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కిచిడీ సులభంగా జీర్ణం అవుతుంది. పప్పు తినడం వల్ల శరీరానికి మిగిలిన పోషకాలు అందుతాయి. కిచిడీ తింటే ఆహారం జీర్ణం కావడానికి శరీర శక్తి తక్కువగా ఖర్చవుతుందని, శరీరాన్ని రిపేర్ చేయడానికి శక్తి మిగులుతుందన్ని నిపుణుల అభిప్రాయం. ఇదే పద్ధతిలో వారం రోజుల పాటు కేవలం కిచిడీ మాత్రమే తినడం వల్ల శరీరం చాలా తేలికగా అనిపించి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది.
ఉపవాసం లేదా కిచిడీ తీసుకోవడం:
అంతేకాకుండా ఉపవాసం పాటించినా కూడా శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఒక మార్గంగా అభివర్ణిస్తున్నారు. కేవలం నీళ్లు తాగి మాత్రమే ఉపవాసం ఆచరించలేని వారు కిచిడీ తినవచ్చు. ఇలా కిచిడీ తినడంతో పాటు కొన్ని పండ్లు లేదా సూప్ వంటివి కూడా తీసుకోండి. కానీ పచ్చి ఆహారం, వండిన ఆహారాన్ని కలిపి తినకూడదు. కానీ, ఒక వారం పాటు కిచిడీ మాత్రమే తినడం వల్ల మీ ఆరోగ్య వ్యవస్థ అనేది పునరుత్తేజం అవుతుంది. ఇలా వారం రోజుల పాటు చేసిన తర్వాత తిరిగి మీరు తీసుకునే రోజువారీ ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.
ఫైబర్ లేదా డిటాక్సిఫికేషన్:
మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, కూరగాయలు, పండ్లు, జీడిపప్పు, మంచి పోషక విలువలున్న ఆహారాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దీనితో పాటు, శరీరాన్ని జీర్ణం చేసుకునేందుకు తగిన మొత్తంలో ద్రవాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి, వేడి నీళ్లు శరీరానికి సహజమైన డిటాక్సిఫికేషన్ చేసేలా పనిచేస్తాయి.
సంబంధిత కథనం