Summer Drinks: వేసవిలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ డ్రింక్స్ ప్రయత్నించండి-want to lose weight fast in summer try these summer drinks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Drinks: వేసవిలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ డ్రింక్స్ ప్రయత్నించండి

Summer Drinks: వేసవిలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ డ్రింక్స్ ప్రయత్నించండి

Haritha Chappa HT Telugu
Published Mar 28, 2024 09:00 AM IST

Summer Drinks: వేసవిలో త్వరగా బరువు తగ్గొచ్చు. అందుకే వ్యాయామంతో పాటు కొన్నిరకాల సమ్మర్ డ్రింక్స్ తాగితే బరువును త్వరగా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది.

సమ్మర్ డ్రింక్స్
సమ్మర్ డ్రింక్స్ (Unsplash)

Summer Drinks: వేసవి వచ్చిందంటే మండే వేడిని తట్టుకోవడానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. శరీరం ఎంత హైడ్రేటెడ్ గా ఉంటే ఈ సీజన్లో అంత ఆరోగ్యంగా ఉంటారు. చక్కెర నిండిన పానీయాలు, కూల్ డ్రింకులు వంటివి తాగడం వల్ల శరీరానికి నష్టమే జరుగుతుంది. అంతేకాదు వేసవిలో బరువు తగ్గడం కూడా చాలా సులువు. ఆరోగ్యకరమైన పానీయాలు తాగుతూ బరువును చాలా సులభంగా తగ్గవచ్చు. మీరు బరువు తగ్గడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కొన్ని రకాల పానీయాలు ఉపయోగపడతాయి. వీటిని తాగడం వల్ల వేగంగా మీరు బరువును కరిగించుకోవచ్చు.

సత్తు పిండి

సత్తుపిండినీ కొంతమంది శనగపప్పుతో, మరికొందరు గోధుమలతో, ఇంకొందరు నువ్వులతో ఇలా రకరకాలుగా తయారుచేస్తారు. మీకు నచ్చిన పిండితో సత్తు పిండిని తయారు చేయండి. శనగపప్పుతో చేసుకుంటే మంచిది. దీనిలో అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ సత్తుపిండిని నీటిలో కలుపుకొని చిటికెడు నల్ల ఉప్పును వేసి, వేయించిన జీలకర్ర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే నిమ్మకాయను పిండుకొని, తరిగిన కొత్తిమీరను వేసుకొని తాగితే ఎంతో మంచిది. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది.బదులుగా బరువును కూడా తగ్గిస్తుంది.

ఆమ్ పన్నా

పచ్చి మామిడి కాయలతో చేసే రుచికరమైన పానీయం ఆమ్ పన్నా. ఇది సాంప్రదాయ భారతీయ పానీయంగా గుర్తింపు పొందింది. పచ్చిమామిడి కాయలను మెత్తగా ఉడకబెట్టి పైన పొట్టు తీసి ఆ గుజ్జులో నీరు, పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కాస్త తేనె వేసి ఈ ఆమ్ పన్నాను సిద్ధం చేస్తారు. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. బరువును త్వరగా తగ్గిస్తాయి.

మజ్జిగ

ప్రతి ఒక్కరి ఇంట్లో వేసవి వస్తే చాలు కచ్చితంగా ఉండాల్సింది మజ్జిగ. దీన్ని పెరుగును చిలికి నీటిని కలిపి చేస్తారు. ఈ మజ్జిగలో చిటికెడు ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసుకొని తాగితే ఎంతో మంచిది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియకు చాలా సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పుదీనా నిమ్మరసం

వేసవిలో ప్రతిరోజూ నిమ్మరసం తాగితే ఎంతో ఆరోగ్యం. ఇది మనసును, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. గ్లాసు నీటిలో తాజా నిమ్మరసాన్ని పిండాలి. సన్నగా తరిగిన పుదీనా ఆకులను, నల్ల ఉప్పును, కాస్త తేనెను వేసి కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా దీన్ని తాగడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. బరువు త్వరగా తగ్గుతారు.

జల్జీరా

జల్జీరా అనేది జీలకర్ర పొడితో, పుదీనా, కొత్తిమీర వేసి తయారు చేసే ఒక ఘాటైన పానీయం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకులు, జల్జీరా పొడిని వేసి కలుపుకోవాలి. ఇది వేసవిలో కచ్చితంగా తాగాల్సిన జ్యూసులలో ఒకటి.

బార్లీ వాటర్

వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడే అద్భుతమైన పానీయం బార్లీ నీళ్లు. నీటిలో బార్లీ గింజలను వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి ద్రవాన్ని ఒక గ్లాసులో వేయాలి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు ఏ సీజన్లో తాగినా మంచిదే. ముఖ్యంగా వేసవిలో తాగడం వల్ల ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఇది రీఫ్రెష్ చేస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా దీనిలో కేలరీలు తక్కువ. ఇది తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా చేరుతాయి. వేసవిలో చెమట ద్వారా పోయిన కోల్పోయిన ద్రవాలను ఇది తిరిగి భర్తీ చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Whats_app_banner