Tuesday Motivation: ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? ఇలాంటి పాజిటివ్ ఆలోచనలను పెంచుకోండి
Tuesday Motivation: ఎక్కువ కాలం జీవించాలనుకుంటే మీ మెదడులో పాజిటివ్ ఆలోచనలను నింపుకోవాలి. పాజిటివ్ ఆలోచనలను ఎంతగా ఉంటే మీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది.

Tuesday Motivation: మనం పోటీ ప్రపంచంలో జీవిస్తున్నాం. అందరికన్నా ముందు పరుగెట్టాలన్న కాంక్షతో ఉంటారు ప్రతి ఒక్కరూ. ఈ అనారోగ్యకర వాతావరణం వల్ల ఆందోళనలు, ఒత్తిడి పెరిగిపోతాయి. దీని వల్ల ప్రతికూల ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయో అప్పుడు ఆయుష్షుపై ప్రభావం పెరుగుతుంది. ఈ ప్రతికూలత మన దైనందిన జీవితంపై చాలా ప్రభావం పడుతుంది. మెరుగ్గా ఆలోచించడానికి మిమ్మల్ని మీరు పాజిటివ్ గా మార్చుకోవాలి.
గ్రాటిట్యూడ్ చూపించండి
సానుకూలంగా ఆలోచించడానికి శక్తివంతమైన మార్గం గ్రాటిట్యూడ్ గా ఉండడం. కృతజ్ఞతగా ఉండడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీ రోజు ముగిసే సమయంలో ఆరోజు మీకు సాయం చేసిన వ్యక్తులకు గ్రాటిట్యూడ్ చూపించండి. ఒక డైరీలో రాసుకోండి. మీరు సంతోషంగా ఉన్నవి రాసేటప్పుడు మీకు మరింత సానుకూల వాతావరణం అనిపిస్తుంది.
మంచి కంపెనీతో ఉండేలా చూసుకోండి
మంచి కంపెనీ అంటే మనతో ఉండే వ్యక్తులు. వారు ఎంతో పాజిటివ్ గా ఉండే వారిని ఎంపిక చేసుకుంటే మంచిది. మంచిని పెంచే పాజిటివ్ వ్యక్తుల మధ్య ఉండడం వల్ల మీకు కూడా సానుకూలత పెరుగుతుంది. కుటుంబం, సంబంధాలు, స్నేహాల నుంచి ఉత్పన్నమయ్యే సానుకూలత సాటిలేనిది. అసూయ పడే, నిరాశావాద వ్యక్తుల మధ్య ఉంటే మీకు కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది.
ప్రకృతితో కనెక్ట్ అవ్వండి
ప్రకృతి ఎంతో అందమైనది. ప్రకృతిలో ఉంటే మానసిక ఆనందం, సంతోషం దక్కుతుంది. ఇది శక్తివంతమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. వీలైనంత వరకు ప్రకృతితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. సాయంత్రం వాకింగ్ చేయడం, ట్రెక్కింగ్, యోగా వంటి ప్రకృతిలో చేయాలి. ప్రకృతిలో వ్యాయామం చేయడం వల్ల మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. ఇది మొత్తం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
రేపటి గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. సానుకూల మనస్తత్వాన్ని ఉంచడానికి మరొక గొప్ప మార్గం ఈ రోజు గురించే ఆలోచించాలి. ఈరోజు గురించి ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే తరచూ శ్వాస వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించండి. శ్వాసపై దృష్టి పెట్టేందుకు ట్రై చేయండి.
మీలో సానుకూల ఆలోచనలు పెరగాలంటే మాకు ఇతరులకు సాయం చేయడం నేర్చుకోండి. ఇందుకోసం మీరు ధనవంతులు కావాల్సిన అవసరం లేదు... మీరు తినే రెండు ముద్దల్లో ఒక ముద్ద సాయం చేయండి చాలు. సాయం చేయడం వల్ల పాజిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని ఎంచుకోవడమే కాదు, ఆలోచనా తీరు కూడా హెల్తీగా ఉండేలా చూసుకోవాలి.