విజయానికి రెసిపీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అధ్యయనం ఏం చెబుతోందంటే-want to know the recipe for success what the study says ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  విజయానికి రెసిపీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అధ్యయనం ఏం చెబుతోందంటే

విజయానికి రెసిపీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అధ్యయనం ఏం చెబుతోందంటే

Haritha Chappa HT Telugu

విజయం సాధించాలంటే ఏం కావాలో ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. విజేతగా మారాలనుకున్న వ్యక్తి ఎదుగుదల మనస్తత్వాన్ని కలిగి ఉండాలని అధ్యయనం పేర్కొంది. ఎదుగుదల మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో తెలుసుకోండి.

సక్సెస్ చిట్కాలు (Unsplash)

విజయం పొందాలంటే దగ్గరి దారులు ఉండవు. కష్టపడడం ఒక్కటే దారి. విజేతగా మారేందకు ఒక వ్యక్తికి ఏం కావాలో తెలుసుకునేందుకు అధ్యయనం జరిగింది. నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఇటీవల చేసిన అధ్యయనంలో విజయానికి అంతిమ రెసిపీని కనుగొన్నారు.

వాస్తవానికి, ఎక్కువ సంకల్ప శక్తి ఉన్నవారు విజయాన్ని సాధిస్తారని అధ్యయనం చెబుతోంది. అటువంటి వ్యక్తులకు ఒక సారూప్యత ఉంది. ఇది సానుకూల మనస్తత్వం.

అధ్యయనం ఇలా

13 నుంచి 77 ఏళ్ల మధ్య వయసున్న 1,500 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొనే వారి అభిరుచి, పట్టుదల, మనస్తత్వాన్ని కొలవడానికి ఒక ప్రశ్నావళిని ఇచ్చి సమాధానం ఇవ్వమని కోరారు పరిశోధకులు. ముఖ్యంగా అత్యధిక, అత్యల్ప మైండ్ సెట్ స్కోర్లను కొలిచారు. సానుకూల దృక్పథం ఉన్నవారికి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారిని పరిశోధకులు పేర్కొన్నారు. అడ్డంకులను అధిగమించి అవకాశాలను చూడటం, సమస్య ఎదురైనప్పుడు పరిష్కారాలను కనుగొనడం ఇందులో ఉంటుంది. ఎదుగుదల మనస్తత్వం ఉన్న వ్యక్తి మార్గంలో నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడంలో దానిని అమలు చేయడాన్ని కూడా నమ్ముతారు. స్థిరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు సవాళ్లను నివారించడానికి ప్రయత్నిస్తారు. నిర్మాణాత్మక విమర్శలను ఎదుర్కోలేరు.

సైకాలజీ విభాగంలో ప్రొఫెసర్, సహ రచయిత హెర్ముండూర్ సిగ్మండ్సన్ మాట్లాడుతూ "అత్యంత సానుకూల దృక్పథం ఉన్న 5 శాతం మందిని అత్యంత ప్రతికూలంగా ఉన్న 5 శాతంతో పోల్చినప్పుడు అభిరుచి, సంకల్పంలో పెద్ద తేడాలను కనుగొన్నాము. మన సమాజంలో ఎదుగుదల మనస్తత్వం సర్వతోముఖంగా ఉండాలని వాదించవచ్చు’ అని చెప్పారు.

ఎదుగుదల మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి?

స్వీయ-అవగాహన: అంతర్గతంగా చూడండి. మిమ్మల్ని మీరు మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ లోపాలను తెలుసుకోవడానికి, వాటిని తిప్పే పటాన్ని రూపొందించడానికి మీకు సహాయపడుతుంది.

ఇతరుల నుండి నేర్చుకోండి: ప్రతి ఒక్కరూ వారి సొంత పాఠాలను పంచుకుంటారు. మనం వ్యక్తుల చుట్టూ సానుకూల మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు, మనం వారి నుండి నేర్చుకుంటాము.

మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి: మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీకు తెలిసేలా మీ లక్ష్యాలను రాయండి.

సవాళ్లను స్వీకరించండి: సవాళ్ల నుండి పారిపోయే బదులు, వాటిని స్వీకరించండి. వాటిని నేర్చుకోవడానికి అవకాశాలుగా చూడండి.

ఓపికగా ఉండండి: విజయం సరళంగా రాదు. ఓపికగా ఉండండి. మీ సొంత నైపుణ్యాలు, ధైర్యాన్ని విశ్వసించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.