Valentines Day Recipe: మీ ప్రేమకు స్పైసీ టచ్ ఇవ్వాలనుకుంటే వాలెంటైన్స్ డే రోజున ఇలా రోజ్ మోమోస్ తయారు చేస పెట్టండి!
Valentines Day Recipe: వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. మీ ప్రియమైన వారు లేదా భాగస్వామి ఫుడ్ లవర్స్ అయితే, వారికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడమే మీ లక్ష్యమైతే ఈ రెసిపీ మీ కోసమే. ఆటా బీట్రూట్‌తో టేస్టీ రోజ్ మొమోస్ తయారు చేసి వారిని ఆశ్చర్యపరచండి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
వాలెంటైన్స్ వీక్ మొదలు కావడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ భాగస్వాములను విభిన్న విధానాలతో ఆకట్టుకోవాలని కోరుకుంటారు. ఇందుకోసం వారి వారి ప్రియమైన వారి ఇష్టాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రియుడు, ప్రేయసి లేదా భాగస్వామి మంచి ఫుడ్ లవర్ అయి ఉంటే మాత్రం వాలెంటైన్స్ వీక్ రోజుల్లో లేదా వాలెంటైన్స్ డే రోజున మీరు వారిని కచ్చితంగా మీ చేతివంటతో ఇంప్రెస్ చేయాల్సిందే. మీరే స్వయంగా వారి కోసం ఇష్టమైన పదార్థాన్ని చేసి ఇవ్వడం వారిని చాలా బాగా ఆకట్టుకుంటుంది.

మీ భాగస్వామి స్వీట్ ఇష్టపడే వారైతే మీరు వారికోసం చాక్లెట్, కేక్ రెసినీలకు ఎంచుకోవచ్చు. కానీ వారు స్పైసీ ఫుడ్ ఇష్టపడే వారైతే మాత్రం మీరు ఈ మోమోస్ రెసిపీని ఎంచుకోండి. మోమోస్ ఇష్టపడని స్పైసీ ఫుడ్ లవర్స్ దాదాపు ఉండరు. అయితే ఎప్పటిలాగా మైదాతో మోమోస్ తయారు చేయడం కాకుండా.. బీట్రూట్ తో ఇలా ఆరోగ్యకరమైన, రుచికరమైన మోమెస్ తయారు చేసి వారికి ప్రేమికుల రోజున అందించండి. వీటిని వారు రుచి చూశారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, మళ్లీ మళ్లీ కావాలని అడగకుండా ఉండలేరు. ఇదిగో రెసిపీ నేర్చుకుని చేసేయండి.
బీట్రూట్ రోజ్ మొమోస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
-1 చిన్న బీట్రూట్
-1 కప్పు గోధుమ పిండి
-1/2 కప్పు రవ్వ
-రుచికి తగినంత ఉప్పు
-పెద్ద ముక్క పన్నీర్
- కరివేపాకు తురుముకున్నది
-పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగినది
-4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగినవి
-1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, చిన్నగా తరిగినది
-1 అంగుళం అల్లం ముక్క తురుముకున్నది
-2 పచ్చిమిర్చి, చిన్నగా తరిగినవి
బీట్రూట్ రోజ్ మొమోస్ తయారు చేసే విధానం:
- బీట్రూట్ రోజ్ మొమోస్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో గోధుమ పిండి, రవ్వను వేసి కలపండి.
- తర్వాత ఈ పిండిలో తరుముకున్న బీట్రూట్ నుంచి తీసుకున్న రసాన్ని వేసి కలపండి.
- ఇందులో కాస్త ఉప్పు వేసి పిండి, రవ్వగా కలిసి మెత్తగా తయారయ్యేంత వరకూ కలుపుకుని పక్కకు పెట్టండి.
- ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ పిండిని అలాగే నాననివ్వండి.
- తర్వాత వేరొక గిన్నె తీసుకుని దాంట్లో తురిమి పెట్టుకున్న పన్నీర్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి బాగా కలపండి.
- ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపిదే మోమోస్ లోకి ఫిల్లింగ్ మిశ్రమం రెడీ అయినట్టే.
- ఇప్పడు ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కక్కు పెట్టుకోండి.
- ఇప్పుడు ఉండలను చపాతీల్లా చేసుకని మధ్యలో ఫిల్లింగ్ మిశ్రమాన్ని పెట్టండి.
- తర్వాత చపాతీల్లోని ఫిల్లింగ్ మిశ్రమం యబటకు రాకుండా జాగ్రత్తగా చిన్న చిన్న మడతలుగా తీసుకుంటూ వాటిని గులాబీ పువ్వు ఆకారంలోకి తీసుకురండి.
- ఇలా మిగిలిన పిండితో కూడా మోమోస్ తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నె లేదా ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో నీటి పోసి వేడి చేయండి.
- తర్వాత మోమోస్ ను తీసుకుని ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాల పాటు వాటిని ఉడకించండి.
- అంతే టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ రోజ్ మొమోస్ రెడీ అయినట్టే. వీటిని సాస్ లేదా మోమోస్ చట్నీ కాంబినేషన్ తో మీ ప్రియమైన వారికి తినిపించారంటే మెచ్చుకోకుండా ఉండలేరు. ట్రే చేసి వారిని ఆశ్చర్యపరచండి.
సంబంధిత కథనం