Aloo Tuk Recipe: కారంగా ఏదైనా తినాలనుందా? రుచికరమైన సింధీ ఆలూ తుక్ రెసిపీని ట్రై చేయండి, కరీనా కపూర్ కూడా ఇష్టపడే డిష్!
Aloo Tuk Recipe: సింధీ వంటకాల్లో ఫేమస్ అయిన ఆలూ తుక్ రెసిపీని మీరు ఎప్పుడైనా తిన్నారా? సెలబ్రెటీలు కూడా ఇష్టపడి తినే వంటకం ఇది. కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ డిష్‌ని కచ్చితంగా ట్రై చేయండి.

ఆలూ తుక్ రెసిపీ తయారీ విధానం
కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడూ రొటీన్ గా తిన్నవే తిని బోర్ కొట్టేస్తుందా.. ఇదిగోండి మీ కోసం బంగాళదుంపలతో చేసే సింధ్ ఆలూ తుక్ వంటకం రెడీగా ఉంది. వాస్తవానికి, వెజిటేరియన్ స్నాక్స్ తినాలనుకునే వారికి బంగాళదుంప ఒక బెస్ట్ ఆప్షన్. ఎన్ని రకాలుగా చేసినా సూపర్బ్ అనిపించడంలో ఆలూకి మంచి స్పెషాలిటీ ఉంటుంది. బంగాళదుంపలకు అంతమంది ఫ్యాన్స్ ఉంటారు మరి. కరీనా కపూర్ సైతం ఆలూతో చేసే ఈ స్నాక్‌కు ఫ్యాన్ అంట.
ఆలూలను వేయించి కొన్ని మసాలాలతో తయారు చేసే ఆలూ తుక్ మీకూ తినాలనిపిస్తే ఈసారి ట్రై చేయండి. ఆలూ తుక్ చేసే విధానం ప్రతి ఒక్కరికీ వేరుగా ఉండవచ్చు, కానీ, ఇక్కడ ఇచ్చిన విధానం ప్రకారం మీరు కొద్ది నిమిషాల్లోనే ఈ రుచికరమైన డిష్ ని తయారు చేసుకోవచ్చు.
ఆలూ తుక్ తయారు చేయడానికి కావలసినవి
- 7-8 పెద్ద ఆలూలు (12-15 చిన్న ఆలూలు)
- 1 - చెంచా ఉప్పు
- 1.5 చెంచాలు - కొత్తిమీర పౌడర్
- 1.5 చెంచాలు - ఎర్ర మిరపకాయ పౌడర్
- 1 చెంచా - చాట్ మసాలా
- 1/2 చెంచా - ఆమ్ చూర్ పౌడర్
- 2-3 - పచ్చి మిరపకాయలు (ఐచ్ఛికం)
- 1/2 - నిమ్మకాయ
- చిటికెడు - పసుపు
- తాజా కొత్తిమీర
- వేయించడానికి సరిపడా నూనె
ఆలూ తుక్ తయారీ విధానం
- వంట కోసం పెద్ద ఆలూలను తీసుకున్నట్లయితే, వాటిని శుభ్రం చేసి, తొక్క తీసి, మందపాటి గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఆలూలు చిన్నవి అయితే, వాటిని బాగా శుభ్రం చేసి ఉడికించండి. అవి 90 శాతం ఉడికిన తర్వాత వాటిని చిన్నగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు వేయించడానికి నూనెను స్టవ్ మీద పెట్టుకుని వేడి చేయండి. వేయించేటప్పుడు స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి. నూనె అధికంగా వేడెక్కకుండా ఉంటే బెటర్.
- ఆ తర్వాత ఆలూ ముక్కలను వేసి 5-7 నిమిషాలు వేగనివ్వండి. అవి లోపల కూడా వేగాయని కన్ఫమ్ చేసుకుని, నూనె నుండి తీసి ఒక ప్లేటులో ఉంచండి.
- ఆలూలను క్రిస్పీగా అనిపించడానికి, డబుల్ ఫ్రైయింగ్ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు.
- మీరు పెద్ద ఆలూలను వాడుతున్నట్లయితే వాటిని చిన్నగా చేసుకోండి. వీటిని క్రిస్పీగా చేసుకోవడానికి రెండోసారి వేయించుకోవాల్సి ఉంటుంది.
- ఆలూలు బంగారు రంగులోకి మారేంత వరకూ వేయించుకున్న తర్వాత, వాటిని నూనె నుండి తీయండి.
- ఇప్పుడు ఈ ఆలూలలో అన్ని చాట్ మసాలా, ఆమ్ చూర్ పౌడర్ వేసి బాగా కలపండి. కాస్త ఘాటుదనంతో పాటు, పుల్లదనం కోసం మిరపకాయలు, నిమ్మరసం వేసి బాగా కలపండి.
- ఇప్పుడు తాజా కొత్తిమీరతో అలంకరించి ఆలూ తుక్ రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం