ఎల్లప్పుడూ ఫిట్‌గా కనిపించే క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అభిమానులు ఆయన క్రికెట్‌తో పాటు ఫిట్‌నెస్, ఎనర్జీని కూడా ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు. ఇలా ఉండటానికి కోహ్లీ ఏం చేస్తాడు, ఏం తింటాడు తెలుసుకోవాలని ఆశ పడతారు. తాజాగా టెస్ట్ మ్యాచ్‌ల నుండి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత విరాట్ ఫిట్‌నెస్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఫుడ్ లవర్‌గా పేరున్న విరాట్, డిసిప్లిన్ కారణంగానే ఫిట్‌గా ఉంటాడట. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాడట. కోహ్లీ లాంటి ఫిట్‌నెస్‌ని మీరు కూడా కోరుకుంటే ఈ 6 విషయాలను పాటించడం చాలా ముఖ్యం. వీటి గురించి కోహ్లీ స్వయంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో తెలిపారు.
విరాట్ కోహ్లీ తన శరీరాన్ని అత్యంత సమర్థవంతంగా పనిచేసే యంత్రంగా భావిస్తాడు. కాబట్టి అతని ఆహారం దానికి సరైన ఇంధనంలా ఉండాలి. అందుకే అతను తన డైట్‌లో చాలా కఠినమైన నియమాలు పాటిస్తాడు. ముఖ్యంగా, కోహ్లీ చక్కెర (వైట్ షుగర్) జోలికి కూడా పోడు. , స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలు వంటి వాటిని కూడా తీసుకోడు.
అంతేకాదు విరాట్ కోహ్లీ ఏ రకమైన డైరీ ఉత్పత్తులను కూడా తన ఆహారంలో చేర్చుకోడు. పాలు, పెరుగు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులన్నింటినీ అతను దూరంగా ఉంటాడు. బహుశా వాటిలో ఉండే కొవ్వు లేదా లాక్టోజ్ అతనికి సరిపడకపోవడమే దీనికి కారణం కావచ్చు.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు సంబంధించి మరో ముఖ్యమైన సీక్రెట్ ఏంటంటే.. అతను నాన్‌వెజ్, గుడ్లు వంటి వాటికి దూరంగా ఉంటాడు. జంతువుల ప్రోటీన్ లేకుండా కండరాల పెరుగుదల, బలాన్ని పొందలేమని చెప్పేవారికి విరాట్ కోహ్లీ ఒక ఉదాహరణ. ఆయన ఎల్లప్పుడూ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌తోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. స్టీమ్, గ్రిల్డ్ ఫుడ్ ఆయనకు ఇష్టం. ఎనిమల్ ప్రోటీన్‌లో అమైనో ఆమ్లాల పూర్తి మోతాదు ఉంటుంది. అయితే ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌తో ఈ మోతాదును ఎలా పూర్తి చేయాలి? దానికి సమాధానం వైవిధ్యం. విరాట్ వివిధ రకాల ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌లను తీసుకుంటాడు. వీటిలో పప్పులు, గింజలు, విత్తనాలు, ధాన్యాలు, కూరగాయలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ ఒకే ఆహారాన్ని ఆరు నెలల పాటు రోజుకు మూడు సార్లు తిన్నాడని చెప్పాడు. ఇది కేలరీలను సమతుల్యం చేయడంలో, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గట్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ వ్యాయామం హృదయంపై ఒత్తిడి పడకుండా సమతుల్యంగా ఉండాలి. ఫిట్‌గా ఉండటానికి కోహ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్‌తో పాటు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్‌ను కలుపుతాడు. దీనివల్ల హృదయ స్పందన రేటు సరిగ్గా ఉంటుంది, జీవక్రియ కూడా చురుకుగా ఉంటుంది. బర్పీస్, బాడీ వెయిట్ స్క్వాట్స్, పుష్‌అప్స్, ప్లాంక్స్, ఇంటర్వల్‌తో రన్నింగ్ వంటి వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి.
విరాట్ కోహ్లీ త్వరగా నిద్రిపోతాడు. పూర్తిగా 8 గంటల నిద్ర మనసుతో పాటు శరీరాన్ని కూడా ఉత్సాహంగా ఉంచుతుంది. అధ్యయనాల ప్రకారం ఒక వారం పాటు నిర్ణీత సమయం, కంటే తక్కువ నిద్రపోతే ఆ వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అతను ప్రీ డయాబెటిక్ వర్గంలోకి వస్తాడు.
పనితో పాటు వ్యక్తిగత జీవితంలో సమతుల్యత కూడా చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ ఎల్లప్పుడూ సరిహద్దులను నిర్దేశించుకుంటాడు. అందుకే 36 ఏళ్ల వయసులోనే రిటైర్ అయ్యాడు. వ్యక్తిగత జీవితాన్ని పనితో సమతుల్యంగా ఉంచుకోవడం ఒత్తిడి, ఆందోళనల నుండి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.