Success Tips: విజయానికి దగ్గర దారి కావాలా? తాజా అధ్యయనం ఆ దారిని కనిపెట్టేసింది-want a shortcut to success a recent study has found that way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Success Tips: విజయానికి దగ్గర దారి కావాలా? తాజా అధ్యయనం ఆ దారిని కనిపెట్టేసింది

Success Tips: విజయానికి దగ్గర దారి కావాలా? తాజా అధ్యయనం ఆ దారిని కనిపెట్టేసింది

Haritha Chappa HT Telugu
Jan 10, 2025 05:30 AM IST

Success Tips: విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అందరూ సక్సెస్ కాలేరు. విజయం సాధించేందుకు ముఖ్యంగా కావాల్సినదేంటో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. ఆ పరిశోధనలో విజయానికి దగ్గర దారి తెలిసిపోయింది.

విజయం సాధించడానికి కావాల్సిన లక్షణాలు
విజయం సాధించడానికి కావాల్సిన లక్షణాలు (Pixabay)

జీవితంలో అనుకున్నది సాధించడమే విజయం. కొందరు ఉద్యోగపరంగా, మరికొందరు వ్యాపారపరంగా సక్సెస్ అవ్వాలనుకుంటారు. మరికొందరు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవడం వంటివి కూడా లక్ష్యాలుగా పెట్టుకుంటారు. ఒక్కో మనిషికి విజయ లక్ష్యం ఒక్కోలా ఉంటుంది. అయితే ఆ విజయాన్ని అందుకోవడానికి మాత్రం వారు ఒకేలా కష్టపడాలి. విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వాటిలో కొన్ని అందరికీ ఉపయోగపడే అంశాలు బయటపడ్డాయి.

yearly horoscope entry point

నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్టీఎన్యూ)కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఇటీవల చేసిన అధ్యయనంలో విజయానికి కావాల్సిన లక్షణాలను కనుగొన్నామని చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం అధిక సంకల్ప శక్తి ఉన్నవారు విజయం వైపు నడుస్తారు. ముఖ్యంగా ఇది సానుకూల మనస్తత్వం అంటే పాజిటివ్ మైండ్ సెట్.

అధ్యయనం సాగిందిలా

ఈ అధ్యయనంలో భాగంగా 13 నుంచి 77 ఏళ్ల మధ్య వయసున్న 1,500 మందిపై ఈ పరిశోశన నిర్వహించారు. పాల్గొనేవారి అభిరుచి, పట్టుదల, మనస్తత్వాన్ని కొలవడానికి ఒక ప్రశ్నావళి తయారు చేశారు. వాటికి సమాధానం ఇవ్వమని వారిని కోరారు. పరిశోధకులు ముఖ్యంగా అత్యధిక, అత్యల్ప మైండ్ సెట్ స్కోర్లను సాధించిన వారిపై శ్రద్ధ పెట్టారు. మైండ్ సెట్ బట్టే విజయం దక్కే అవాకాశాలు ఉంటాయని గుర్తించారు. అడ్డంకులను అధిగమించి అవకాశాలను చూడటం, సమస్య ఎదురైనప్పుడు పరిష్కారాలను కనుగొనడం అనే లక్షణాలు కలిగి ఉన్నవారికే విజయం దక్కుతోంది. ఎదుగుదల మనస్తత్వం ఉన్న వ్యక్తి మార్గంలో నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడంలో దానిని అమలు చేయడాన్ని కూడా నమ్ముతారు.

అత్యంత సానుకూల దృక్పథం ఉన్న 5 శాతం మందిని, అత్యంత ప్రతికూలంగా ఉన్న 5 శాతం మందితో పోల్చినప్పుడు అభిరుచి, సంకల్పంలో తేడాలను పరిశోధకులు గుర్తించారు. అందుకే ప్రతిఒక్కరూ ఎదుగుదల మనస్తత్వాన్ని పెంచుకోవాలి.

ఎదుగుదల మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి?

స్వీయ అవగాహన: అంతర్గతంగా చూడండి. మిమ్మల్ని మీరు మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ లోపాలను తెలుసుకోవడానికి, వాటిని అధిగమించేందుకు సహాయపడుతుంది.

ఇతరుల నుండి నేర్చుకోండి: ప్రతి ఒక్కరూ వారి సొంత పాఠాలను పంచుకుంటారు. మన చుట్టూ సానుకూల మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు మనం వారి నుండి నేర్చుకుంటాము.

మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి: మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీకు తెలిసేలా మీ లక్ష్యాలను ఒకచోట రాసుకోండి. వాటిని ప్రతిరోజూ ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి.

సవాళ్లను స్వీకరించండి: సవాళ్ల నుండి పారిపోయే బదులు, వాటిని స్వీకరించండి. వాటికి ఎదురీది జీవించడం నేర్చుకోండి.

ఓపికగా ఉండండి: విజయం అంత సులువుగా దొరకదు. ఓపికగా ఉండాలి. మీ నైపుణ్యాలు, ధైర్యాన్ని నమ్మండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం