Walking After Meals: తిన్న వెంటనే నడక మంచిదేనా? ఎంత సేపటి తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు?-walking after meals how long should you walk after eating how to get amazing benefits by walking ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking After Meals: తిన్న వెంటనే నడక మంచిదేనా? ఎంత సేపటి తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు?

Walking After Meals: తిన్న వెంటనే నడక మంచిదేనా? ఎంత సేపటి తర్వాత నడిస్తే అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు?

Ramya Sri Marka HT Telugu

Walking After Meals: భోజనం తర్వాత నడక చాలా మంచిదని నిపుణులు చెబుతారు. కానీ దాని సరైన పద్ధతి మీకు తెలుసా? తెలియకుండా శరీరానికి ఎంత శ్రమ పెట్టినా ఆరోగ్య ప్రయోజనం ఉండదు. కాబట్టి, భోజనం తర్వాత నడిచేందుకు సరైన సమయం తెలుసుకుని అలవాటు చేసుకోండి.

తిన్న తర్వాత ఎంత సేపటికి నడవాలి?

భోజనం తర్వాత వెంటనే పడుకోవడం లేదా సోఫాలో గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, భోజనం తర్వాత కొంతదూరమైనా నడవడం అనేది చాలా ముఖ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. అనేక వ్యాధుల ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కానీ భోజనం తర్వాత నడవడానికి సరైన సమయం మీకు తెలుసా? తెలియకపోతే, భోజనం తర్వాత ఎప్పుడు నడవాలి? ఎంతసేపు నడవాలి? అనేది తెలుసుకుని ప్రయోజనాలను పొందండి.

భోజనం తర్వాత నడవాలనుకుంటే:

ఎంత సేపటి తర్వాత నడవాలి: భోజనం తర్వాత నడవడం అవసరం, కానీ భోజనం, నడక మధ్య కొంత సమయం విరామం ఉండాలి. భోజనం తర్వాత శరీరానికి కనీసం 10-15 నిమిషాల విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత నడిచేందుకు ఉపక్రమించండి. ఈ విరామం మీ కడుపుకు జీర్ణక్రియ ప్రక్రియను ప్రారంభించడంలో సహాయపడుతుంది. నడుస్తున్నప్పుడు కలిగే క్రాంప్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎలా నడవాలి: భోజనం తర్వాత కొంతమంది చాలా వేగంగా నడుస్తారు, కానీ ఇది తప్పు. ఎందుకంటే భోజనం తర్వాత నడక నెమ్మదిగా, స్థిరంగా ఉండాలి. నడక వేగం ఎంతగా ఉండాలంటే, మీరు నడుస్తూ సులభంగా మాట్లాడగలిగేంతగా ఉండాలి. భోజనం తర్వాత వేగంగా నడవడం వల్ల మీ కడుపు నుండి రక్త ప్రవాహాన్ని మళ్ళించి జీర్ణక్రియకు అంతరాయం కలిగించవచ్చు.

భోజనం తర్వాత నడక ప్రయోజనాలు

  • భోజనం తర్వాత నడవడం రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తర్వాత తేలికపాటి నడకను కొనసాగించే వారి రక్తంలో చక్కెర స్థాయిలు, నిలబడి లేదా కూర్చున్న వారితో పోలిస్తే నెమ్మదిగా పెరుగుతుంది. నడవడం వల్ల ఇన్సులిన్ స్థాయి కూడా చాలా స్థిరంగా ఉంటుంది.
  • భోజనం తర్వాత నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
  • ఊబకాయం ఉన్నవారు భోజనం తర్వాత నడక తప్పనిసరిగా చేయాలి. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి నడక చాలా ముఖ్యం.
  • భోజనం తర్వాత నడవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిజానికి, నడవడం వల్ల కార్టిసోల్ వంటి ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని తగ్గించుకోవచ్చు. ఎండార్ఫిన్లు-ఆక్సిటోసిన్ వంటి సానుకూల హార్మోన్లు పెరుగుతాయి. ఈ హార్మోన్లు మిమ్మల్ని బాగుండేలా చేయడమే కాకుండా, మంచి నిద్రను కూడా అందిస్తాయి.
  • రోజూ ఆహారం తీసుకున్న తర్వాత నడిచే అలవాటు ఉన్న వారు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ఆహారంలో తీసుకున్న ప్రొటీన్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉత్పత్తులను మళ్లీ శోషించుకుని జీర్ణక్రియకు సహాయపడుతుంది.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం, భోజనం తర్వాత నడక అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయట. శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లెవల్స్ ను అదుపులో ఉంచుతాయి. ఫలితంగా టైప్ 2 మధుమేహం వంటి వ్యాధులను కలగకుండా నివారించవచ్చు.

ఆహారం తిన్న వెంటనే పాటించే మరికొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు:

  • నీరు మితంగా తాగడం
  • కొద్దిసేపటి వరకూ విశ్రాంతి
  • మితమైన ఆహారం తీసుకోవడం
  • సిగరెట్లు, మద్యపానం వంటి వ్యసనాలు తగ్గించుకోవడం
  • సులభమైన వ్యాయామాలు చేయడం

సంబంధిత కథనం