Vivo Y75s 5G । ఆకర్షణీయమైన రంగులు, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన వివో కొత్త ఫోన్‌!-vivo y75s 5g smartphone launched check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vivo Y75s 5g Smartphone Launched, Check Price Details

Vivo Y75s 5G । ఆకర్షణీయమైన రంగులు, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన వివో కొత్త ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Sep 07, 2022 02:51 PM IST

వివో సరికొత్తగా Vivo Y75s 5G స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Vivo Y75s 5G
Vivo Y75s 5G

స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తమ Y-సిరీస్‌ను ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లతో నింపేస్తుంది. తాజాగా మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గతంలో Vivo Y75 పేరుతో 4G మొబైల్ మోడల్ విడుదల చేయగా, ఇప్పుడు ఈ మోడెల్‌లో 5G వెర్షన్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. సరికొత్త Vivo Y75s 5G ఒక ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 64MP ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్, మెరుగైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ మొదలైనవి చెప్పుకోదగ్గ అంశాలు.

ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Vivo Y75s 5G ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్లో గరిష్టంగా 12GB RAM అలాగే 256GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు మైక్రో SD కార్డ్ స్లాట్ అందిస్తున్నారు. ఈ ఫోన్ ఐరిస్ బ్లూ, స్టార్రీ నైట్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Vivo Y75s 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే
  • 8GB/12 RAM, 128GB/ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

కనెక్టివిటీ ఫీచర్లు 5G, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.1, GPS/ GLONASS, USB టైప్-C, 3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అక్కడ Vivo Y75s 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలను పరిశీలిస్తే.. బేస్ మోడల్ 8GB + 256GB ధర, CNY 1,899 (సుమారు రూ. 21,777). హై-ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,199 (సుమారు రూ. 25,200). ఈ ఫోన్ త్వరలో మిగతా మార్కెట్లలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్