రూ. 15 వేల బడ్జెట్ ధరలో Vivo Y21G స్మార్ట్‌ఫోన్ విడుదల-vivo y21g budget smartphone launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vivo Y21g Budget Smartphone Launched

రూ. 15 వేల బడ్జెట్ ధరలో Vivo Y21G స్మార్ట్‌ఫోన్ విడుదల

HT Telugu Desk HT Telugu
Apr 10, 2022 12:40 PM IST

మొబైల్ తయారీదారు వివో తమ బ్రాండ్ నుంచి Y-సిరీస్‌లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y21Gను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 15 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Vivo Y21G Smartphone
Vivo Y21G Smartphone

మొబైల్ తయారీదారు వివో తమ బ్రాండ్ నుంచి Y-సిరీస్‌లో మరిన్ని సరికొత్త మార్పులు చేస్తూ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y21Gను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో వచ్చిన Y21 కంటే భిన్నంగా ఉంటుంది. మరింత శక్తివంతమైన చిప్‌సెట్, ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు ధరకూడా అందుబాటులోనే ఉంటుంది. 

Vivo Y21G ఆండ్రాయిడ్ 11-ఆధారిత FuntouchOS 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి,  ఇందులో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగవచ్చు.

ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం. జాగ్రత్తగా గమనించండి.

Vivo Y21G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD డిస్‌ప్లే

4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం (మైక్రో ఎస్డీ కార్డుతో 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు)

మీడియాటెక్ Helio G70 ప్రాసెసర్

వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

ధర రూ. 14,999/- 

కనెక్టివిటీ పరంగా చూస్తే Vivo Y21Gలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.0, GPS, GLONASS/ Beidou, GALILEO, USB Type-C ఇంకా 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.

ఇది మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. కొనుగోలుదారులు ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా Vivo Y21Gని కొనుగోలు చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్