Romantic Places: వాలెంటైన్స్ డేకు ఈ రొమాంటిక్ ప్రదేశాలను సందర్శించండి, ఈ ప్రేమ యాత్రలు గుర్తుండిపోతాయి
Romantic Places: ఫిబ్రవరి నెలను ప్రేమ మాసం అంటారు. ఈ మాసంలో చాలా మంది తమ భాగస్వామితో గడపడానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఈ నెలలో మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, ఇక్కడ మేము కొన్ని రొమాంటిక్ ప్రదేశాలు ఇచ్చాము.
ఫిబ్రవరి నెలను ప్రేమ మాసం అంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డే ఈ నెలలో వస్తుంది. ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ వీక్ నిర్వహించుకుంటారు. వారం రోజుల పాటూ ప్రేమ పక్షులు పండగ చేసుకుంటారు. ఈ మాసం ప్రేమ పక్షులకు ఇష్టమైనది. అందుకే చాలా మంది జంటలు ఈ నెలలో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఫిబ్రవరిలో మీ భాగస్వామితో హాలిడేస్ కు వెళ్లాలనుకుంట, రొమాంటిక్ ప్లేస్ కోసం చూస్తున్నట్లయితే, కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎంతో మనోహరంగా, ఆహ్లాదంగా ఉంటాయి. మీ భాగస్వామితో పాటూ మీరు మనదేశంలోనే ఏఏ ప్రదేశాల్లో ఎంజాయ్ చేయవచ్చో తెలుసుకోండి.

1) డార్జిలింగ్
ఫిబ్రవరిలో సందర్శించడానికి అత్యంత అందమైన ప్రదేశం డార్జిలింగ్. ఎక్కువమంది జంటలు ఇష్టపడే హనీమూన్ గమ్యస్థానాలలో డార్జిలింగ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఈ ప్రదేశం తేయాకు తోటలతో నిండి ఉంటుంది. ఇక్కడ టైగర్ హిల్ లో ఒక బొమ్మ రైలు నడుస్తుంది, దీనిలో మీరు ఈ ప్రదేశంలోని అందమైన కొండలను చూస్తారు. ఫిబ్రవరిలో మీ భాగస్వామితో రొమాంటిక్ హాలిడేస్ గడపడానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి వెళ్లారంటే ఆ పచ్చదనానికి దాసోహమైపోతారు.
2) మహాబలేశ్వర్
ఫిబ్రవరిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో మహాబలేశ్వర్ ఒకటి. ఈ ప్రదేశం చుట్టూ పర్వతాలతో పాటు పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జలపాతాలు, సరస్సులతో నిండిన అద్భుతమైన లోయలు చూడదగినవి. ముంబైకి సమీపంలోని ఈ ప్రదేశంలో వారాంతాల్లో వెళ్లడానికి ప్రజలు ఇష్టపడతారు. ఇది చరిత్రలో కూడా ముడిపడి ఉంటుంది. ఎన్నో రాతి కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
3) గోవా
ఫిబ్రవరిలో భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో గోవా ఒకటి. ఈ ప్రదేశం బీచులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సాంస్కృతిక వంటకాలతో మనోహరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తిరగడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. గోవాలోని బీచ్ లో మీ భాగస్వామితో ఎన్నో అందమైన క్షణాలను గడపవచ్చు.
4) హంపి
హంపి అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చెప్పుకునే ఈ ప్రదేశం హనీమూన్బలకు కూడా మంచి గమ్యస్థానం. ఇక్కడ అరటి తోటలు నిండుగా ఉంటాయి. ఈ ప్రదేశం అంతా అందంగా తీర్చిదిద్దినట్టు ఉండే కొండలు హంపి నగరంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇక్కడ తిరగడానికి కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి. కనీసం నాలుగైదు రోజులు మీరు అక్కడ ప్లాన్ చేస్తే అన్ని ప్రదేశాలకు వెళ్లి తిరిగి రావచ్చు.