Viral Video: సెక్యూరిటీ గార్డ్‌పై మహిళ దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు!
నోయిడాలోని హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. అలాగే వారికి చలాన్ విధించారు. వీరి దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ఆ మహిళ గార్డుపై అసభ్యంగా ప్రవర్తించడం దుర్భాషలాడడం చూడవచ్చు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు ఈ ఘటన సిగ్గుచేటు అంటున్నారు.