Veg Omelette: గుడ్డు అవసరం లేకుండా ఇలా వెజ్ ఆమ్లెట్ చేసేయండి, రెసిపీ ఈజీ
Veg Omelette: గుడ్డు లేని ఆమ్లెట్… వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్‌లెస్ ఆమ్లెట్ తిన్న తర్వాత మీకు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. మీకు గుడ్డు నచ్చకపోతే ఈ వెజ్ ఆమ్లెట్ రెసిపీ ప్రయత్నించండి.
ఎగ్ ఆమ్లెట్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఆమ్లెట్ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే అందరూ గుడ్డును తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు వెజ్ ఆమ్లెట్ వేసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. ఈ ఎగ్ లెస్ ఆమ్లెట్ ఎవరికైనా నచ్చేస్తుంది. ఈ ఆమ్లెట్ మెత్తగా, ఫ్లఫ్పీగా ఉంటుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వెజ్ ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు
శెనగపిండి - ఒక కప్పు
బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూన్
మైదా - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - సరిపడినంత
నూనె - తగినంత
పచ్చిమిర్చి,- రెండు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - ఒకటి
టమోటాలు - ఒకటి
చాట్ మసాలా - అర స్పూను
వెజ్ ఆమ్లెట్ రెసిపీ
- స్ట్రీట్ స్టైల్ ఎగ్ లెస్ ఆమ్లెట్ తయారు చేయాలంటే ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి.
- అందులో శనగపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం కొంచెం నీరు కలపడం ద్వారా స్పూనుతో బాగా కలపండి. ఇది జారేలా ఉండాలి.
- ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి.
- స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయండి. ఇప్పుడు మంటను మీడియం మీద పెట్టండి.
- ఇప్పుడు ఆ నూనెలో పిండి మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి.
- రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే వెజ్ ఆమ్లెట్ రెడీ అయినట్టే.
- దీనిపై చాట్ మసాలా కూడా చల్లుకుని తింటే రుచి అదిరిపోతుంది.
- ఈ వెజ్ ఆమ్లెట్ ను గ్రీన్ చట్నీ లేదా టొమాటో సాస్ తో తింటే యమ్మీగా ఉంటుంది. వేడి వేడిగా తింటేనే ఆరోగ్యం కూడా.
ఆమ్లెట్ అనగానే అందరికీ కోడిగుడ్డుతో చేసేదే గుర్తుకువస్తుంది. అయితే గుడ్డును అందరూ తినరు. అందుకే ఈ వెజ్ ఆమ్లెట్ ప్రయత్నించండి ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీనికి కేవలం పావుగంటలోనే వండేసుకోవచ్చు. ఒక్కసారి చేసి చూడండి మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా ఉపయోగపడుతుంది.