Veg Kheema Recipe: వెజ్ కీమా మసాలా కర్రీ, ఇలా చేస్తే చపాతీ రోటీ అన్నంలోకి టేస్టీగా ఉంటుంది-veg kheema recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Veg Kheema Recipe: వెజ్ కీమా మసాలా కర్రీ, ఇలా చేస్తే చపాతీ రోటీ అన్నంలోకి టేస్టీగా ఉంటుంది

Veg Kheema Recipe: వెజ్ కీమా మసాలా కర్రీ, ఇలా చేస్తే చపాతీ రోటీ అన్నంలోకి టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Published Feb 13, 2025 11:30 AM IST

Veg Kheema Recipe: వెజ్ కీమా మసాలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పంజాబీ రెస్టారెంట్లలో దొరికి వంటకం. ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వెజ్ కీమా రెసిపీ
వెజ్ కీమా రెసిపీ

వెజ్ కీమా మసాలా తింటే ఎన్నో పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఎందుకంటే దీనిలో మనం అనేక రకాల కూరగాయలను కలుపుతాము. మాంసాహారులకు మటన్ కీమా, చికెన్ ఖిమా వల్ల ఎన్ని పోషకాలు అందుతాయో... శాఖాహారులకు అంతకన్నా రెట్టింపు పోషకాలు అందుతాయి. పంజాబీ రెస్టారెంట్‌లలో స్పెషల్‌గా తయారు చేస్తూ ఉంటారు. దీన్ని వండడం చాలా సులభం. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

వెజ్ కీమా మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యాప్సికం తరుగు - అరకప్పు

ఉల్లిపాయల తరుగు - అరకప్పు

ఫ్రెంచ్ బీన్స్ తరుగు - అర కప్పు

క్యారెట్ తరుగు - అరకప్పు

బఠానీలు - పావు కప్పు

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

కారం - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - రెండు

టమోటాలు - మూడు

కసూరి మేతి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

వెల్లుల్లి తురుము - రెండు స్పూన్లు

నూనె - తగినంత

నెయ్యి - రెండు స్పూన్లు

నీరు - సరిపడినంత

వెజ్ కీమా మసాలా రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, నెయ్యి వేయాలి.

2. అందులోనే వెల్లుల్లి తురుమును, పచ్చిమిర్చి తురుమును, జీలకర్రను వేసి వేయించుకోవాలి.

3. ఇది వేగుతున్నప్పుడే మంచి వాసన వస్తాయి.

4. ఆ తర్వాత ఉల్లిపాయలను వేసి వేయించాలి.

5. ఉల్లిపాయలు రంగు మారేవరకు బాగా వేయించుకోవాలి.

6. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు క్యాప్సికం తరుగును వేసి బాగా కలపాలి.

8. టమోటాల్లో మిక్సీలో వేసి ఫ్యూరీ లాగా మార్చాలి.

9. దాన్ని కూడా కళాయిలో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.

10. తర్వాత క్యారెట్ తురుము, ఫ్రెంచ్ బీన్స్ తురుము కూడా వేయాలి.

11. పచ్చి బఠానీలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

12. ఈ మొత్తం మిశ్రమం ఉడకడానికి నీళ్లు పోసి బాగా కలపాలి.

13. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

14. ఇందులోనే కసూరి మేతి, కొత్తిమీర తరుగు, ధనియాల పొడి వేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

15. అంతే టేస్టీ వెజ్ కీమా రెడీ అయినట్టే. దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా రోటి, చపాతీలతో తిన్నా టేస్టీగా ఉంటుంది. దీని రుచి అందరికీ నచ్చుతుంది.

ఇందులో మనము ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు ఎన్నో వేసాము. కాబట్టి మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. టమోటోలు, క్యారెట్లు, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికం వంటివన్నీ కూడా పోషకాహారాన్ని అందిస్తాయి. ఒకసారి ఈ వెజ్ కీమా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం