Valentines Week Recipe: వాలెంటైన్స్ డేకి ముందు మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి చాకొలెట్ రెసిపీలను నేర్చుకోండి!
Valentines Week Recipes: వాలెంటైన్స్ వీక్ వచ్చేస్తోంది. ప్రేమికులు వారం రోజు పాటు జరుపుకునే ఈ పండుగలో తమ భాగస్వామిని లేదా ప్రియమైన వ్యక్తిని ఇంప్రెస్ చేయడమే పని. మీరు కూడా మీ భాగస్వామిని ఆకట్టుకోవాలనుకుంటే ఈ చాకొలెట్ రెసిపీలు మీ కోసమే. మీరే తయారు చేసి తినిపించారంటే ఇంప్రెస్ అవాల్సిందే!
ఫిబ్రవరి 7 నుండి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమై ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేతో ముగియనుంది. ఈ ప్రేమ వారానికి మధ్యలో రోజ్ డే, టెడ్డీ డే, చాకొలెట్ అంటే రకరకాల ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఈ వారం రోజుల పాటు ప్రేమికులు, భార్యభర్తలు తమ భాగస్వాములను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు కూడా మీ ప్రియుడు లేదా ప్రియురాలినిలేదా భాగస్వామిని ఇంప్రెస్ చేయాలనుకుంటే, వారు మంచి చాకొలెట్ లవర్ అయి ఉంటే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
మీ వాలెంటైన్ ను ఇంప్రెస్ చేసేందుకు మీకు సహాయపడే కొన్ని చాకొలెట్ రెసిపీలను మీ కోసం మేము తీసుకొచ్చాం. వాలెంటైన్ వీక్ రాబోతుంది కనుక ముందుగానే చాకొలెట్ లేకుండా ఈ వారం ప్రత్యేకంగా అనిపించదు. కూడా అందుకే ఇక్కడ ఉన్న కొన్ని చాకొలెట్ రెసిపీలను నేర్చుకుని స్వయంగా మీరే తయారు చేసి సర్‌ప్రైజ్ చేశారంటే వారు చాలా సంతోషిస్తారు. మీ ప్రియమైన వారి కోసం మీరు సులభంగా తయారు చేయగల చాకొలెట్ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి. నేర్చుకుని వారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయండి.
చాక్లెట్ రెసిపీ:
కావాల్సిన పదార్థాలు:
- ఒక కప్పు చక్కెర పొడి
- అరకప్పు కోకో పౌడర్
- అర టీస్పూన్ కాఫీ పౌడర్
- పావు కప్పు మిల్క్ పౌడర్
- అరకప్పు వెన్న లేదా కొబ్బరి నూనె
- ఒక టీస్పూన్ వెనీలా ఎస్సెన్స్
- మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్
- రెండు టీ స్పూన్లు నెయ్యి
తయారీ విధానం:
- ముందుగా ఒక బౌల్ తీసుకుని దాని మీద పిండ జల్లెడను పెట్టి దాంట్లో చెక్కర పొడిని వేయండి.
- తరువాత దీంట్లోకి కోకో పౌడర్, కాఫీ పొడిని వేయండి. తరువాత దీంట్లో పావు కప్పు వరకూ మిల్క్ పౌడర్ ను వేయండి.
- వీటన్నిటినీ జల్లెడతో జల్లించిన తర్వాత అన్ని పొడిలు కలిసిపోయేలాగా బాగా కలపుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పడు ఒక గిన్నె తీసుకుని సగం వరకూ నీటిని పోసి స్టవ్ ఆన్ చేయండి.
- నీరు మరుగుతున్న సమయంలో దాని మీద వెడల్పాటి గాజు గిన్నెను పెట్టుకోండి.
- ఇప్పుడు ఈ గాజు గిన్నెలో వెన్న లేదా కొబ్బరి నూనె వేసి వేడి చేయండి.
- ఇది కాస్త వేడిక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పక్కకు పెట్టుకున్న చాకొలెట్ పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
- చిన్న మంట మీద పెట్టి పిండిని గడ్డలు కట్టకుండా ఉండేలా బాగా కలుపుతూ ఉండాలి.
- ఇలా దాదాపు 20 నుంచి 30నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తర్వాత చెక్కర పూర్తిగా కరిగి అన్ని పొడులు చక్కగా కలిసిపోయి చాకొలెట్ సిరప్ తయారవుతుంది.
- ఇప్పుుడ స్టవ్ చేసి దాంట్లో వెనీలా ఎస్సెన్స్ వేసి కలపండి.
- తరువాత ఈ చాకోలెట్ సిరప్‌ను మీకు నచ్చిన షేపుల్లోని చాకొలెట్ మౌల్డ్స్ లో వేయండి. ఇందులో నెయ్యిలో చక్కగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు.
- ఇప్పుడు ఈ చాకొలెట్ మౌల్డ్స్ ను ఫ్రిజ్ లో పెట్టి రెండు గంటల పాటు ఉంచండి.
- అంతే టేస్టీ అండ్ డెలీషియస్ చాకొలెట్స్ రెడీ అయినట్టే.
మినీ చాకొలెట్ కేక్స్
కావాల్సిన పదార్థాలు:
- ఒక కప్పు గోధుమ పిండి
- అర కప్పు చక్కెర పొడి
- ఒక టేబుల్ స్పూన్ పాల పొడి
- రెండు టేబుల్ స్పూన్ల కొకో పౌడర్
- ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్
- అర టీస్పూన్ బేకింగ్ సోడా
- చిటికెడే ఉప్పు
- ముప్పావు కప్పు పాలు
- పావు కప్పు నూనె
- ఒక టీస్పూన్ వెనీలా ఎసెన్స్
- పావు కప్పు పెరుగు
- అరటీస్పూన్ వెనిగర్
- డ్రై ఫ్రూట్స్
మినీ చాకోలెట్ కేక్స్ తయారీ విధానం:
- ముందుగా ఒక బౌల్ తీసుకుని దాని మీద పిండ జల్లెడను పెట్టండి.
- జల్లెడలో గోధుమపిండి, చక్కెర పొడి, పాల పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించండి.
- తర్వాత అన్ని పొడిలు బాగా కలిసిపోయేలా కలిపి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దాంట్లో పాటు, నూనె, వెనీలా ఎసెన్స్, పెరుగు వేసి బాగా కలపండి.
- నూనె, పాలు, పెరుగు కలిసిసోయేంత వరకూ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పొడిపిండిలో వేసి బాగా కలపండి.
- పొడి మిశ్రమం, పాల మిశ్రమం అన్నీ కలిసిపోయి చిక్కటి పేస్టులా తయారువుతుంది. ఈ సమయంలో దీంట్లో వెనిగర్ వేసి కలిపితే చాకొలెట్ బ్యాటర్ రెడీ అవుతుంది.
- ఇప్పడు గుంట పొంగనాలు వేసుకనే పెనం తీసుకుని అన్ని గుంటల్లోకి నూనె వేసి చక్కగా పూయండి.
- తరువాత దీంట్లో చాకొలెట్ బ్యాటర్ వేసి దాని మీద నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను మధ్యలో వేసి పెట్టుకోండి.
- ఇప్పడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల ప్యాన్ పెట్టి దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించండి.
- లోపల పచ్చిగా లేకుండా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మూత తీసి దాంట్లో టూత్ పిక్ పెట్టి చెక్ చెయ్యచ్చు.
- పుల్లకి జిడ్డుగా ఏమీ అంటలేదంటే మినీ చాకొలెట్ కేక్ రెడీ అయినట్టే. అంటిందంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి.
- తరువాత స్టవ్ చేసుకుంటే మినీ చాకొలెట్ కేక్ రెడీ అయినట్టే.
వాలెంటైన్స్ వీక్ రోజునో, ప్రేమికుల రోజులో ఈ రెసిపీలను మీరే స్వయంగా తయారు చేసి ప్రేమగా మీ భాగస్వామికి తినిపించారంటే వారు ఇంప్రెస్ అవాల్సిందే. ట్రై చేసి చూడండి.