Cornflour Powder: కార్న్‌ఫ్లోర్ ఇంట్లో వాడుతున్నారా? ఒక్కనిమిషం ఆగి ఇది చదవండి, వాడాలో వద్దో నిర్ణయించుకోండి-using cornflour at home take a minute to read this and decide whether to use it or not ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cornflour Powder: కార్న్‌ఫ్లోర్ ఇంట్లో వాడుతున్నారా? ఒక్కనిమిషం ఆగి ఇది చదవండి, వాడాలో వద్దో నిర్ణయించుకోండి

Cornflour Powder: కార్న్‌ఫ్లోర్ ఇంట్లో వాడుతున్నారా? ఒక్కనిమిషం ఆగి ఇది చదవండి, వాడాలో వద్దో నిర్ణయించుకోండి

Haritha Chappa HT Telugu
Jul 01, 2024 05:00 PM IST

Cornflour Powder: సూప్ లేదా గ్రేవీ చిక్కగా ఉండటానికి ఆహారంలో మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్)ని ఉపయోగిస్తూ ఉంటారు. మొక్కజొన్న పిండిని తరచూ వాడడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

కార్న్ ఫ్లోర్ తినడం ప్రమాదమా?
కార్న్ ఫ్లోర్ తినడం ప్రమాదమా? (shutterstock)

కార్న్ ఫ్లోర్ వాడకం మన రాష్ట్రాల్లో అధికంగానే ఉంది. సూప్ చిక్కగా చేయడానికి, కూరల్లో గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చేందుకు మొక్కజొన్న పిండి వాడతారు. ఎన్నో స్నాక్స్ తయారీలో కూడా కార్న్ ఫ్లోర్ తరచుగా వాడతారు. ఈ పొడి తరచుగా వాడడం మంచిది కాదు. ఇది హానికరమైన ఉత్పత్తిగానే చెబుతారు ఆరోగ్య నిపుణులు. మీరు ఆహారంలో కార్న్ ఫ్లోర్ తరచూ ఉపయోగిస్తుంటే ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. అది ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసుకోండి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు తినకూడదని పదార్థం కార్న్ ఫ్లోర్. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మొక్కజొన్న పిండి వల్ల ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

కార్న్ ఫ్లోర్ ఎలా తయారుచేస్తారు?

మొక్కజొన్న పిండిని తయారు చేయడానికి మొక్కజొన్న గింజలను ఉపయోగిస్తారు. కానీ చాలా ప్రాసెస్ చేసి తయారుచేస్తారు. దీని వల్ల ఇందులో కేలరీలు, పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు మొక్కజొన్న పిండిలో సుమారు 490 కేలరీలు, 120 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. అలాగే విటమిన్లు, ప్రొటీన్ల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొక్కజొన్న పిండి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

మొక్కజొన్నపిండిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది హానికర ఉత్పత్తి. మొక్కజొన్న పిండిని నిరంతరం తినడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

కార్న్ ఫ్లోర్ అనేది మొక్కజొన్న గింజల నుంచే తయారవుతుంది కానీ ప్రాసెసింగ్ కారణంగా, దానిలోని పోషకాలను కోల్పోతుంది. కాబట్టి ఇది శుద్ధి చేసిన పదార్థం జాబితాలోకి వస్తుంది. అధ్యయనం ప్రకారం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు గుండెకు హానికరం. గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనికి కారణం… ప్రాసెస్ చేసిన ఆహారం వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఇది చాలా ప్రమాదకరం.

బరువు పెరగుతారు

మొక్కజొన్న పిండిని ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సూప్ తాగుతున్నప్పుడు అందులో మొక్కజొన్న పిండి వేసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, క్యాలరీల వల్ల వేగంగా బరువు పెరిగే ఛాన్సులు ఉంటాయి.

మొక్కజొన్న పిండిని చాలా తక్కువగా తినాలి. ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలో ట్రైగ్లిజరైడ్ పెరుగుతుంది. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది.

ఆహారంలో ఒకటి నుండి రెండు టీస్పూన్ల మొక్కజొన్న పిండిని మాత్రమే కలుపుకోండి. అది కూడా అప్పుడప్పుడు మాత్రం తినాలి. తరచూ తినడం మాత్రం మంచిది కాదు. ఆహారంలో ప్రతి రోజూ తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని తినేటప్పుడు జాగ్రత్త అవసరం. అవసరం అయితే మాత్రమే కార్న్ ఫ్లోర్ తినడం అలవాటు చేసుకోండి.

WhatsApp channel

టాపిక్