Bad Contraceptive method: గర్భం రాకుండా మీరు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారా? జాగ్రత్తా గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం-using birth control pills beware of risk of heart attack and stroke ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bad Contraceptive Method: గర్భం రాకుండా మీరు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారా? జాగ్రత్తా గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం

Bad Contraceptive method: గర్భం రాకుండా మీరు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారా? జాగ్రత్తా గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం

Haritha Chappa HT Telugu
Published Feb 17, 2025 06:30 PM IST

Bad Contraceptive method: చాలామంది భార్యాభర్తలు పిల్లలు కలగకుండా జనన నియంత్రణ పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. వాటిలో ఒక పద్ధతి తీవ్రమైన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అదే హార్మోన్ల గర్భనిరోధక మాత్ర.

బర్త్ కంట్రోల్ పిల్స్ తో వచ్చే సమస్యలు
బర్త్ కంట్రోల్ పిల్స్ తో వచ్చే సమస్యలు (Pixabay)

పెళ్లయిన భార్యాభర్తలు అప్పుడే పిల్లలను వద్దనుకుంటారు. అలాగే ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డకు కొంతవరకు గ్యాప్ ఉండాలని అనుకుంటారు. ఆ సమయంలోనే గర్భం ధరించకుండా జనన నియంత్రణ పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు.

అలాంటి జనన నియంత్రణ పద్ధతుల్లో హార్మోన్లను ప్రభావితం చేసే గర్భనిరోధక మాత్రలు, ఇంప్లాంట్స్ కూడా భాగమే. ఇలాంటి హార్మోన్లను ప్రభావితం చేసే గర్భనిరోధకాలను వాడడం వల్ల మహిళలకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని కొత్త అధ్యయనం చెబుతుంది.

గర్భనిరోధక మాత్రతో ప్రమాదం

ప్రపంచంలో ఎన్నో జనన నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ భూమిపై ఉన్న మహిళల్లో పాతిక కోట్ల మంది మహిళలు వినియోగిస్తున్న పద్ధతి గర్భనిరోధక మాత్రలు లేదా ఇంప్లాంట్లను వాడడం. వీటిని వాడేవారు భవిష్యత్తులో స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కలిగి ఉంటారని కొత్త అధ్యయనం నిర్ధారించింది.

డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన కొత్త అధ్యయనం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. ఈస్ట్రోజన్ నిండిన యోని రింగ్ లేదా బర్త్ కంట్రోల్ పాచ్ వంటివి కూడా గర్భనిరోధక పద్ధతుల్లో భాగాలే. అవి వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. యోనిలో చిన్న రింగు పెట్టుకోవడం అలాగే చర్మంపై బర్త్ కంట్రోల్ ప్యాచ్‌ను అతికించుకోవడం కూడా గర్భనిరోధక పద్ధలతులే. ఇవి ప్రమాదాలను ఎక్కువగా తెచ్చి పెడతాయని అంటున్నారు అధ్యయనకర్తలు.

హార్మోన్లను ప్రభావితం చేసే గర్భనిరోధక పద్ధతులను అనేక రకాల రూపంలో తీసుకుంటారు. కొందరు మాత్రల రూపంలో తీసుకుంటే మరికొందరు ఇంజక్షన్ చేయించుకుంటారు. ఇవన్నీ కూడా హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

పరిశోధకులు 1996 నుండి 2021 వరకు 15 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల మధ్య గల 20 లక్షల మంది మహిళలపై అధ్యయనం చేశారు. వీరిలో రకరకాల గర్భనిరోధక పద్ధతులను పాటించిన వారు ఉన్నారు. ఎవరైతే హార్మోన్లను ప్రభావితం చేసేలా గర్భనిరోధక మాత్రలను, ఇంజక్షన్లను వాడతారో... అలాగే యోని రింగ్, చర్మంపై ప్యాచెస్ లాగా అంటించుకునే పద్ధతులను పాటిస్తారో... వారిలో అనేక సమస్యలు వచ్చినట్టు గుర్తించారు.

ఈ రోగాలు వస్తాయి

గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం, కొన్ని రకాల క్యాన్సర్లు, పోలిసిస్ట్ ఓవరీ సిండ్రోమ్, మూత్రపిండాల వ్యాధులు, ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు గుర్తించారు.

జనన నియంత్రణ పద్ధతిలో భాగంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ కలిపిన ట్యాబ్లెట్లను అమ్ముతూ ఉంటారు. ఇలాంటి గర్భనిరోధక మాత్రను ఉపయోగించే మహిళల్లో ఇస్కీమిక్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు అయినట్టు గుర్తించారు.

యోని రింగ్, ప్యాచెస్ వంటివి నాన్ ఓరల్ కంబైన్డ్ గర్భనిరోధకాలు. ఇవి వాడడం వల్ల కూడా ప్రమాదాలు అధికంగా కలిగే అవకాశం ఉంది. యోని రింగ్ పెట్టుకునే మహిళల్లో ఇస్కిమిక్ స్ట్రోక్ ప్రమాదం 2.4 రెట్లు పెరుగుతుంది. అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదం 3.8 రేట్లు పెరుగుతుంది. ఇక చర్మానికి ఈస్ట్రోజన్ ప్యాచ్ ను అతికించుకునే మహిళల్లో ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 3.4 రెట్లు పెరుగుతుంది. కాబట్టి హార్మోన్లను ప్రభావితం చేసేలా గర్భనిరోధక మాత్రలు ప్యాచెస్, యోని రింగ్ ఇంజెక్షన్లు వాడకపోవడమే మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో పాతికోట్ల మహిళలు రోజూ గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తూ అనేక దుష్ప్రభావాల బారిన పడుతున్నారు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం