Tulasi seeds: తులసి గింజలను ఏరి ఇలా వాడండి, అధిక బరువు నుంచి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు తగ్గుతాయి
Tulasi seeds: తులసి ఆకుల మాదిరిగానే, దాని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అధిక బరువు తగ్గడం, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. తులసి విత్తనాలు ఎలా వాడాలో తెలుసుకోండి.
తులసి మొక్కను హిందూమతంలో దేవలతా పూజిస్తారు. తులసి మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు ఆయుర్వేదపరంగా కూడా ప్రాధాన్యత ఉంది. తులసి ఆకుల్లోనే ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. తులసి ఆకుల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. కానీ తులసి ఆకుల మాదిరిగా, దాని విత్తనాలు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
తులసి విత్తనాలను ఫలూదా విత్తనాలు, తుక్మరి విత్తనాలు అని కూడా పిలుస్తారు. తులసి గింజల్లో ఉండే ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాయి. దీని వల్ల ఒక వ్యక్తి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది. తులసి గింజలను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు తగ్గించే తులసి విత్తనాలు
తులసి గింజలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇందుకోసం తులసి విత్తనాలను సేకరించి వాటిని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి వేడి వేడిగా తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీవక్రియను పెంచడం ద్వారా కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తులసి విత్తనాలలో కనిపిస్తాయి. ఈ రెండు లక్షణాలు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
బలమైన రోగనిరోధక శక్తి
బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల మీకు త్వరగా వ్యాధులు దాడి చేస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తులసి విత్తనాలు ఉపయోగపడతాయి. ఈ విత్తనాలలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. అంతే కాదు ఈ విత్తనాల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తులసి గింజలను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తయారుచేసి తాగాలి.
మలబద్ధకం
మలబద్ధకం సమస్యను అధిగమించడానికి తులసి విత్తనాలు కూడా సహాయపడతాయి. మీరు చాలా కాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే తులసి గింజలను నీటిలో నానబెట్టి ప్రతిరోజూ ఉదయం త్రాగాలి. ఈ పానీయం రుచి నచ్చకపోతే మీరు ఒక టీస్పూన్ తేనెను కూడా కలపాలి. ఈ డ్రింక్‌ను రోజూ తాగడం వల్ల శరీరంలో పీచు లోపం తగ్గుతుంది. పేగు కదలికలు సులభతరం కావడంతో పాటు మలబద్దకం తొలగిపోతుంది.
జలుబు నుంచి ఉపశమనం పొందేందుకు తులసి గింజలు బాగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో ఉండే యాంటీబయాటిక్, యాంటీవైరస్ గుణాలు మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జలుబు, ఫ్లూ, దగ్గు, కఫం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం తులసి గింజల కషాయాన్ని తయారుచేసి రోజుకు రెండుసార్లు తాగాలి. కావాలనుకుంటే ఈ కషాయంలో బెల్లం, నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు.
డయాబెటిస్ తగ్గేలా చేస్తుంది
తులసి విత్తనాలలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, తులసి విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఒక గ్లాసు పాలలో ఈ గింజలను కలుపుకుని తాగితే ఇన్సులిన్ లెవల్స్ మెరుగవుతాయి.
టాపిక్