Dandruff: చలికాలంలో చుండ్రును వదిలించుకోవాలంటే ఈ స్పెషల్ ఆయిల్ వాడండి
Dandruff: తలలో చుండ్రు పేరుకుపోతే దురదతో చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య పెరిగిపోతుంది. చుండ్రు తగ్గడానికి ఆవనూనె అద్భుతంగా పనిచేస్తుంది.
చలికాలం ప్రారంభం కాగానే చాలా మందిలో తలలో చుండ్రు సమస్య పెరుగుతుంది. చుండ్రు వల్ల దురద కూడా పెరిగిపోతుంది. చుండ్రు తెల్లగా పొడిలా మారి దుస్తులపై పడుతుంది. ఇది ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారికి చికాకుగా ఉంటుంది. చుండ్రు రావడానికిి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య పెరుగుతుంది.
చుండ్రును పొగొట్టడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదు. కాబట్టి చలికాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు ఈ ప్రత్యేక ఆయిల్ అప్లై చేయాలి. ఇది మీ జుట్టు దురద, చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వేడి నీటితో తలస్నానం
చలికాలంలో చుండ్రు పెరగడానికి ముఖ్య కారణం వేడినీటితో తలస్నానం చేయడమే. వేడినీటితో తలస్నానం చేయడం వల్ల తలపై ఉండే సహజ నూనె పోయి తల పూర్తిగా పొడిబారుతుంది. దీని వల్ల కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో కాలుష్యం వల్ల నెత్తిమీద దుమ్ము ధూళి చేరిపోతుంది. అవి మాడుకు అతుక్కుని దురద మొదలవుతుంది. తరువాత చుండ్రుగా మారిపోతుంది.
చుండ్రును వదిలించే నూనె
చుండ్రును వదిలించుకోవడానికి ప్రభావవంతంగా పనిచేసే నూనె గురించి ఇక్కడ చెప్పాము. ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల ఆవ నూనె, జాంబా నూనె (అరుగుల ఆకు నూనె), పటిక పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలలోని మాడుకు పట్టేలా రాసుకోవాలి. జాంబా ఆయిల్ ఆన్ లైన్లో అందుబాటులో దొరుకుతుంది. ఈ నూనె మిశ్రమాన్ని తలకు పట్టించి ఒకటి నుంచి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
ఈ మూడింటి మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా పోతుంది. ఈ నూనెల మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉండటం వల్ల అవి ప్రభావవంతంగా జుట్టుపై పనిచేస్తుంది.
టీ ట్రీ ఆయిల్ వాడడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. దీనిలో యాంటా మైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.టీ ట్రీ ఆయిల్ నేరుగా కలపకుండా... అందులో కొబ్బరి నూనె కూడా కలిపి రాస్తే మంచిది.
కలబంద గుజ్జును తీసి తలకు పట్టించేందుకు ప్రయత్నించండి. కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది మాడుకు సాంత్వనను ఇస్తుంది.
వేప నూనె లేదా వేప ఆకుల నుంచి తీసిన రసాన్ని ముఖానికి పట్టించాలి. దీనిలో కూడా యాంటీ బాక్టిరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు రాకుండా ఉంుటంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్