Valentines Day 2025: వాలెంటైన్స్ డే ముందు మీ క్రష్‌ని ఇంప్రెస్ చేయడానికి ఈ సైకాలజికల్ టిప్స్‌ని ఉపయోగించండి!
Valentines Day: వాలెంటైన్ వీక్‌లో ఒంటరిగా ఉండకూడదని అనుకుంటున్నారా? మీకు ఎవరైనా నచ్చితే, లేట్ చేయకండి. ఈ చిట్కాల సహాయంతో మీ క్రష్‌ని ఇంప్రెస్ చేయండి. వాలెంటైన్స్ డే ముందు మీకు ఒక తోడును కన్ఫమ్ చేసుకోండి. రండి. మరి అవేంటో చూద్దాం.

లవ్ స్టోరీ ఎక్కడైనా స్టార్ట్ కావొచ్చు. స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్ క్రష్ ఎక్కడైనా సరే, మీలో ప్రేమ చిగురించవచ్చు. కానీ, మీలో ఫీలింగ్స్ ను సరైన సమయానికి అవతలి వ్యక్తికి తెలియజేయకపోతే అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోతుంది. అందుకే మీరు ప్రేమను బయటకు చెప్పడం కనీసం వారికి అర్థమయ్యేందుకు కొన్ని ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. మీ క్రష్ దృష్టిని మీ వైపుకు తిప్పుకోవాలంటే కాష్త కష్టపడాల్సిందే. ఇటువంటి సమయంలో చాలా మంది ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అనే ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రక్రియలో వేగంతో పాటు కచ్చితంగా ఫెయిల్ అవకూడదనే తపన కూడా ఉంటుంది కదా మరి.
ముందుగా మీరు మీ ప్రేమలో సక్సెస్ కావాలంటే, పూర్తి కృషి కనబరచడం చాలా అవసరం. అందుకే, ఈ వాలెంటైన్స్ డే రోజున మీ క్రష్ అటెన్షన్ పొందాలనుకుంటే, ఆమెను ఆకర్షించడానికి కొన్ని సైకాలజికల్ ట్రిక్స్ సహాయం తీసుకోవచ్చు.
ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరం
ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం, కానీ అదే సమయంలో మీలో ఆత్మవిశ్వాసం అనేది హద్దు దాటకుండా చూసుకోండి. హద్దులు దాటి మాట్లాడటం లేదా వారిని అదుపులో పెడుతున్నట్లుగా ప్రవర్తించడం వంటివి చేస్తే మొత్తానికే సమస్యగా మారుతుంది. ఆమె ముందు లేదా అతని ముందుకు మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, పూర్తి ఆత్మవిశ్వాసంతో హద్దుల్లో ఉండి మాత్రమే మాట్లాడండి. అమ్మాయిలు ధైర్యంగా మాట్లాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు కానీ, భయపెట్టే వాళ్లని కాదని మర్చిపోకండి.
ఆసక్తి కనబరచడం చాలా ముఖ్యం
మీ క్రష్‌ని ఇంప్రెస్ చేయాలనుకుంటే, ఆమె లేదా అతని పట్ల మీకున్న ఆసక్తిని కనబరచండి. మాటలను శ్రద్ధగా వినండి, ప్రతిస్పందించండి. ఈ రకమైన ప్రవర్తన ద్వారా మీరు అవతలి వ్యక్తి గురించి ఎంత తెలుసుకున్నారో, ఆమె లేదా అతని భావోద్వేగాలకు, ఆలోచనలకు మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో వారికి తెలుస్తుంది. చాలా మంది వ్యక్తులు తమ భావోద్వేగాలు, ఆలోచనలను అర్థం చేసుకునే వారే తమ జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇది బాగా ఇష్టపడతారు.
శరీర భాష విషయంలో జాగ్రత్త
ఎదుటి వ్యక్తి శరీర భాషను గమనించి వ్యవహరించండి. దానికి ముందు మీ శరీర భాషను చక్కగా వ్యక్తీకరించండి. ఇది ఒక రకమైన ప్రతిబింబ చర్యగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి తాను చూపిస్తున్న గౌరవాన్ని స్పష్టంగా తెలియజేయగలిగితేనే వారు కూడా మన పట్ల అదే భావనను తెచ్చుకుంటారు. కాబట్టి క్రష్‌తో సంభాషించే సమయంలో, ఆమె లేదా అతని శరీర భాషను బట్టి మీ హావభావాలను ప్రదర్శించండి.
జ్యోవియల్‌గా ఉండండి
మాటలను తేలికగా చెప్పడం లేదా జోకులు చెప్పడం అమ్మాయిలు ఇష్టపడతారు. మీ చుట్టుపక్కల వాతావరణాన్ని తేలికగా ఉంచుకోండి. సీరియస్ పరిస్థితులను దాదాపు అవాయిడ్ చేయడమే మంచిది. కాస్త జోవియల్‌గా మాట్లాడుతూ, మీ భావాలను పంచుకోండి. మీరు వేసే జోకులకు మీ క్రష్ నవ్వుతుంటే, అది మీపై మరింత పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది.
పాజిటివ్ ఎనర్జీ చాలా ముఖ్యం
జీవితంలోని ప్రతి పనిలాగే, ఇక్కడ కూడా మీలో ఉన్న సానుకూల శక్తి మాత్రమే ఎవరినైనా ఆకర్షిస్తుంది. అది మీ క్రష్ అయినా సరే. ఎల్లప్పుడూ సంతోషంగా, సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తిని అందరూ గమనిస్తారు, ఇష్టపడతారు. అలాంటి వారితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటారు. కాబట్టిమీ క్రష్ మీ మాటలను వింటున్న సమయంలో లేదా మీతో మాట్లాడుతున్న సమయంలో ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం, నెగిటివ్ గా మాట్లాడటం వంటివి చేయకండి. దీనివల్ల అవతలి వ్యక్తికి మీ మీద ఖచ్చితంగా పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. మీపై మనసు మల్లుతుంది.
నటించడం మానేయండి
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీ క్రష్ మనసు గెలుచుకోవడానికి నటించడం మానేయండి. మీ ఒరిజినాలిటీని మీరు కోల్పోకండి. ఎందుకంటే తర్వాత తర్వాత ఇది ఇద్దరినీ ఇబ్బంది పెట్టే ప్రమాదముందు. నటించిన సమయంలో మిమ్మల్ని ఇష్టపడ్డవారు మీ నిజస్వభావం తెలిసిన తర్వాత మీకు దూరమయ్యే అవకాశాలుంటాయి. కనుక మీరు మీలానే ఉండండి. మిమ్మల్ని మీరుగానే ఇష్టపడే వారినే భాగస్వామిగా ఎంచుకోండి.