Boob Tape Uses: బ్రా కు బదులు ఈ బూబ్ టేప్స్ వాడండి, ఎంతో అందం పైగా సౌకర్యవంతం
Boob Tape Uses: బ్యాక్ లెస్, లో నెక్ లైన్ వంటి స్టైలిష్ దుస్తులను ధరించడం మీకు ఇష్టమైతే మీరు బ్రాలను వేసుకోవడం వల్ల అందంగా రాదు. బ్రాకు బదులు బూబ్ టేప్ లేదా బాడీ టేప్‌ను వాడి చూడండి. వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఇచ్చాము.
మహిళలు కచ్చితంగా వాడాల్సిన వాటిలో బ్రాలు ఒకటి. ఇవి రొమ్ములకు మద్దతునిచ్చి వాటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఇప్పుడు బ్రాలకు బదులు బూబ్ టేప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషనబుల్ దుస్తులు వేసుకునే మహిళలకు బ్రా కన్నా ఇలా టేప్స్ వాడడం మంచి పద్ధతి. కొన్ని డ్రెస్సుల్లో బ్రా వేసుకుంటే వాటి స్ట్రాప్స్ బయటికి కనిపించే అవకాశం ఉంది. బ్యాక్ లెస్ డ్రెస్సులు వేసుకునేవారికి బ్రా కన్నా బూబ్ టేప్స్ అందాన్నిస్తాయి. అంతేకాదు ఏ మోడ్రన్ డ్రెస్సులోనైనా రొమ్ముల భాగం అందంగా కనిపించేందుకు ఈ టేప్స్ ఉపయోగపడతాయి.
ఈ టేప్స్ అలవాటు అయితే బ్రాలు, పట్టీలు ధరించవలసిన అవసరం ఉండదు. అదే సమయంలో వారి వక్షోజాలు కూడా అందంగా ఫిక్స్ అవుతాయి. బూబ్ టేప్ అనేది బ్రాకు బదులు మహిళలు ధరించే రొమ్ము టేప్. చాలా సార్లు బ్రా బయటికి కనిపిస్తుందేమో అని అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. అదే ఈ టేప్స్ అయితే శరీరానికి అతుక్కుని ఉంటాయి కాబట్టి పక్కకి జరిగే అవకాశమే ఉండదు. బూబ్ టేప్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
బూబ్ టేప్ అంటే ఏమిటి?
బూబ్ టేప్ అనేది రొమ్ములకు వాడే కవర్ టేప్. ఇది సాధారణంగా కాటన్, స్పెండెక్స్ అని పిలిచే ఫ్యాబ్రిక్ తో తయారవుతుంది. అదే సమయంలో, దానికి అతికించే జిగురు హైపో ఆలెర్జెనిక్. ఇది మృదువుగా ఉంటుంది. ఇది చర్మానికి సులభంగా అంటుకుంటుంది. దాన్ని తొలగించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఈ రొమ్ముల టేప్‌ను వాడడం వల్ల శరీరం అందంగా కనిపిస్తుంది. వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది రొమ్ములకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మీరు బ్యాక్ లెస్ దుస్తులు ధరిస్తున్నట్లయితే, ముందు భాగంలో ఉన్న టేప్ ను దిగువ నుండి పై వరకు లాగండి. రెండు వక్షోజాలపై టేప్ ను బిగించి మెడకు దగ్గర వరకు అతికించుకోవాలి. బ్యాక్ లెస్ లేదా లో నెక్ లైన్ ఉన్న దుస్తులు, బ్లౌజ్‌లను సౌకర్యవంతంగా ధరించండి. టీ షర్టులో అందమైన లుక్ పొందడానికి బూబ్ టేప్‌ను కూడా ఉపయోగించవచ్చు.
మీరు మొదటిసారి బూబ్ టేప్ ఉపయోగిస్తుంటే, ఖచ్చితంగా చనుమొనలు కూడా కవర్ చేయండి. ఇది మీకు సులభంగా వక్షోజాలకు మంచి రూపాన్ని అందిస్తుంది.
బూబ్ టేప్‌ను ఎలా తొలగించాలి?
బూబ్ టేప్ వేసుకోవడమే సులువే. కానీ వాటిని తొలగించడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని తొలగించేటప్పుడు మొదట నీటితో తడపాలి. అప్పుడది కాస్త తేమగా అవుతుంది. అప్పుడు ఈ టేప్ ను మెల్లగా లాగేయాలి. నిజానికి ఈ టేప్ వాటర్ ప్రూఫ్, చెమట ప్రూఫ్ కూడా. కాబట్టి మీరు దానికి నీరు జోడించిన వెంటనే, అది మరింత తేమగా, జిగటగా మారుతుంది. బూబ్ టేప్ తొలగించడానికి కొద్దిగా నూనె కూడా అవసరం. నూనె రాయడం వల్ల కూడా ఈ టేప్ ఈజీగా బయటకు వస్తుంది.
చాలా కంపెనీలు ప్రస్తుతం ఈ బూబ్ టేప్ ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించాయి. కాబట్టి దీన్ని వాడేందుకు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ ప్రయత్నించండి. ఆ జిగట మీకు పడుతుందో లేదో తెలుసుకోవడం చాలా మంచిది. అన్నింటికన్నా ముక్యంగా మంచి నాణ్యమైన బూబ్ టేప్ కొనండి. దీన్ని చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
టాపిక్