Amrit foods: ఆయుర్వేదంలో వీటిని “అమృతం” అంటారు.. ఈ 5 రోజూ వంటల్లో వాడితే దీర్ఘాయుష్షు, ఆరోగ్యం
Amrit foods: ఆయుర్వేదంలో ప్రతి వ్యాధిని చికిత్స ఉంటుంది. ఆయుర్వేదంలో అమృత తుల్యమైన 5 పదార్థాలు ఈ రోజు మీరూ తెల్సుకోండి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రోగాలు శరీరానికి దూరంగా ఉంటాయి.
ఆయుర్వేదంలో వ్యాధి వచ్చాక చికిత్స కన్నా, వ్యాధి రాకముందే మంచి ఆహారానికి, జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయుర్వేదం ప్రకారం, మన ఆహారం ఔషధంలా ఉండాలి. దాంతో మనకు ఏ రోగమూ అంటుకోదు. ఆయుర్వేద గ్రంథాలలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, దీర్ఘాయుష్షును పొందడానికి క్రమం తప్పకుండా తినే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను 'అమృతం'గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఇవన్నీ మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా మారడంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది. ప్రత్యేక పదార్థాలు గురించి తెలుసుకుందాం.
1) పసుపు:
భారతీయుల వంటగదిలో చాలా ముఖ్యమైన పసుపుకు ఆయుర్వేదంలో అమృతతుల్యమైన హోదా ఇవ్వబడింది. ఆయుర్వేదం ప్రకారం, ఇది మన శరీరంలోని మూడు దోషాలను సమతుల్యం చేయడానికి పనిచేస్తుంది. అలాగే, దాని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆధునిక శాస్త్రంలో కూడా పసుపు లక్షణాలపై అనేక పరిశోధనలు జరిగాయి. అనేక ప్రయోజనాలు తెలిశాయి. ఆయుర్వేదం ప్రకారం, రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
2) ఉసిరి:
ఉసిరి గుణాల గురించి తెలియని వారుండరు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోజూ ఉసిరి జ్యూస్ తాగడం లేదా ఉసిరికాయను సలాడ్ గా తీసుకోవడం వల్ల అతి పెద్ద వ్యాధుల్ని కూడా రాకుండా దూరం చేస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం వల్ల షుగర్, బీపీ, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
3) తులసి:
ప్రతి ఇంట్లో పూజించే తులసి మొక్క ఆయుర్వేదం ప్రకారం అమృతానికి ఏ మాత్రం తీసిపోదు. ఆందోళన, ఒత్తిడి వంటి విషయాలు నేటి జీవనశైలిలో సర్వసాధారణమైపోయాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ సమస్య నుండి బయటపడటానికి తులసి తీసుకోవడం ఉత్తమ మార్గం. ఇవే కాకుండా తులసి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా లేదా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచాలా. తులసి తినడానికి ఉత్తమ మార్గం ప్రతిరోజూ ఒక కప్పు తులసి ఆకుల టీ తాగడం.
4) తిప్పతీగ:
ఇంట్లో పెద్దలు ఇప్పటికీ అనేక ఆరోగ్య సమస్యల కోసం తిప్పతీగను వాడుతున్నారు. ఇది మన మొత్తం శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. దీనితో పాటు, ఇది కాలేయం, జీర్ణ సమస్యలు, శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో దీని ఆకులు, వేర్ల కషాయం తాగాలనే ప్రస్తావన ఉంది. ఈ కషాయాన్ని రోజూ తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
5) ఆవు నెయ్యి:
ఆయుర్వేదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అమృతంగా భావిస్తారు. రోజూ ఒక చెంచా స్వచ్ఛమైన నెయ్యి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన మెదడుకు, జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి, మొత్తం శరీర ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంగా మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో దీని ఉపయోగం అనేక విధాలుగా వివరించబడింది. ఇది పొడి మరియు నిర్జీవ చర్మానికి మంచి మాయిశ్చరైజర్. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగించవచ్చు.