Neem oil for Hair: జుట్టు రాలకుండా ఉండాలంటే ఇంట్లోనే వేపనూనెను ఇలా చేసుకుని వాడండి
Neem oil for Hair: ఆయుర్వేదంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేప నూనెను ఉపయోగించాలని సిఫారసు చేస్తారు. అలాంటప్పుడు వేపనూనెను జుట్టుకు రాసుకుంటే ఎన్నో జుట్టు సమస్యలు తగ్గుతాయి.
Neem Oil Benefits for Hair: వాతావరణం మారడం వల్ల ఆ ప్రభావం మొదట జుట్టుపైనే కనిపిస్తుంది. మారుతున్న సీజన్లో మంచి హెయిర్ కేర్ తీసుకోకపోతే జుట్టు రాలడం, చుండ్రు పట్టడం, వెంట్రుకలు చిట్లిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. వర్షాకాలం ప్రారంభమైపోయింది. కాబట్టి మీ జుట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జుట్టు రాలకుండా ఆరోగ్యాంగా పెరగాలంటే వేప నూనెను ఉపయోగించడం ప్రారంభించండి. వేప నూనెలో ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తల మీద కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తామర, సోరియాసిస్ వంటి సమస్యల నుంచి వేప నూనె ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేప నూనెను ఉపయోగించాలని ఆయుర్వేదం కూడా చెబుతోంది. వేపనూనెను జుట్టుకు ఎలా అప్లై చేయాలో, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. వేపనూనెతో ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
చుండ్రును వదిలించుకోండి -
వేప నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలకు రాసుకోవడం వల్ల నెత్తి మీద ఫంగస్ పేరుకుపోవడం వల్ల కలిగే చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది. వేప నూనె జుట్టు రంధ్రాలను బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల మూలాలకు పోషణనిచ్చి వాటిని దృఢంగా మారుస్తాయి.
నూనె జుట్టు మూలాలకు పోషణ ఇవ్వడం ద్వారా తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. వేపనూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా మారుతుంది.
దురదలు తగ్గిస్తాయి
వర్షాకాలంలో, ఎక్కువమందికి తలపై దురదలు వస్తుంటాయి. ఇలా రాకుండా అడ్డుకోవాలంటే వేపనూనెను అప్లై చేసుకోవాలి. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలున్నాయి. ఇది నెత్తిమీద ఫంగస్‌ను అడ్డుకుంటాయి. వేప నూనె రాస్తే దురదను తొలగించడానికి సహాయపడుతుంది. వేపనూనెను తేలికగా వేడి చేసి అందులో కర్పూరం మిక్స్ చేసి తలకు పట్టించి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది నెత్తిమీద దురద, ఇతర సమస్యలను తొలగిస్తుంది. వేప నూనెలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టును తెల్లబడకుండా రక్షిస్తాయి.
వేప నూనెను ఎలా తయారు చేయాలి?
వేపనూనె తయారు చేయాలంటే ముందుగా వేప ఆకులను బాగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను కొబ్బరినూనెలో వేసి స్టవ్ మీద మరిగించాలి. ఆ నూనెను చల్లార్చి ఒక బాటిల్ లో వేసుకోవాలి.
వేప నూనెను గోరువెచ్చగా మారాక దాన్ని నెత్తి మీద అప్లై చేసి చేతి వేళ్ల సహాయంతో అరగంట పాటూ మసాజ్ చేయాలి. ఆ తర్వాత వేపనూనెను తలకు పట్టించి గంట సేపు ఉంచాలి. ఆ గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.