Beauty tips: నిమ్మ తొక్కలు పడేయకుండా వాటిని ఇలా వాడండి, పాదాలు పగుళ్లు రాకుండా మెరిసిపోతాయి-use lemon peels for pedicures without shedding them to make your feet shine ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: నిమ్మ తొక్కలు పడేయకుండా వాటిని ఇలా వాడండి, పాదాలు పగుళ్లు రాకుండా మెరిసిపోతాయి

Beauty tips: నిమ్మ తొక్కలు పడేయకుండా వాటిని ఇలా వాడండి, పాదాలు పగుళ్లు రాకుండా మెరిసిపోతాయి

Haritha Chappa HT Telugu
Sep 09, 2024 09:30 AM IST

Beauty tips: పాదాలు నల్లగా, మురికిగా, పొడిగా మారిపోతే వెంటనే మహిళలు పెడిక్యూర్ చేయించుకుంటారు. పెడిక్యూర్ కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లే వారు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిజానికి చాలా సింపుల్ గా ఇంట్లోనే నిమ్మ తొక్కలతోనే పెడిక్యూర్ చేయించకోవచ్చు.

నిమ్మతొక్కలతో పెడిక్యూర్
నిమ్మతొక్కలతో పెడిక్యూర్ (shutterstock)

మన శరీరంలో త్వరగా మురికిపట్టే భాగం పాదాలు. పాదాలను కూడా ముఖం, చేతుల మాదిరిగానే జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాల పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. పాదాలు మురికి పట్టడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచూ పాదాలకు పెడిక్యూర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నిమ్మతొక్కలతో పెడిక్యూర్ చేసుకోవచ్చు.

పెడిక్యూర్ అంటే ఏమిటి?

పెడిక్యూర్ అంటే పాదాలు, గోళ్లను శుభ్రపరచుకోవడం. మెనిక్యూర్ అంటే చేతులు, చేతిగోళ్లును శుభ్రపరచుకోవడం. లాటిన్ పదం నుంచి పెడిక్యూర్ అనే పదం పుట్టింది. పాదాలపై దుమ్మూ, ధూళీ, మృతకణాలు పట్టేస్తాయి. వాటిని తొలగించుకోవడమే పెడిక్యూర్.

నిమ్మతొక్కతో పెడిక్యూర్

ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతోనే చేసుకునే పెడిక్యూర్. నిమ్మతొక్కలతోనే పాదాల మురికిని వదిలించి మెరిపించవచ్చు.

రెండు, మూడు నిమ్మ తొక్కలు, షాంపూ, ఆముదం, బేబీ ఆయిల్, బేకింగ్ సోడా ఒక చోట పెట్టుకోవాలి. అన్నింటికంటే ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో గ్లాసు నీటిని తీసుకోవాలి. అందులో రెండు మూడు నిమ్మకాయల తొక్క వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ వేడి నీటిని ఒక పెద్ద పాత్రలో వేసి ఎక్కువ నీరు కలపండి. ఆ నీటిలో పాదాలను పెట్టాలి. ఇప్పుడు అందులోని నిమ్మ తొక్కలతో స్క్రబ్ రాసి దానితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. మడమలు, గోరు మూలలను నిమ్మ తొక్కతో రుద్దాలి. తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయండి

ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టీస్పూన్ బేబీ ఆయిల్, షాంపూ, ఒక టీస్పూన్ ఆముదం, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల చర్మం మృదువుగా మారుతుంది. చీలమండలో గరుకుదనం కూడా మొదలవుతుంది.

పాదాల చర్మం ముతకగా, పగుళ్లు ప్రారంభమైతే రోజూ నానబెట్టిన వాల్ నట్స్, బాదం పప్పులు తింటే మృదువుగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల చర్మంలో కనిపించే పొడిబారడం తొలగిపోయి పాదాల చర్మం మృదువుగా తయారవుతుంది.

నిమ్మతొక్కలనే కాదు అరటి తొక్కలను కూడా పెడిక్యూర్ కోసం ఉపయోగించవచ్చు. అరటి తొక్కలను సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసి తేనె కూడా వేసి చేతులతోనే మెత్తగా మెదుపుకోవాలి. ఈ పేస్టుతో పాదాలకు మసాజ్ చేయాలి. ఒక అరగంట పాటూ వదిలేయాలి. సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటూ మీ పాదాల చర్మం పగుళ్లు లేకుండా మృదువుగా మారిపోతుంది.

పాదాలను కాపాడుకోవడానికి ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రోజూ స్నానం చేసేటప్పుడు ఫ్యూమిస్ రాయితో పాదాలను రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే ఎప్పటికప్పుడు మురికిపోతుంది. రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకున్నా మంచిదే. లేదా బాదం నూనెతో మసాజ్ చేసినా చర్మంపై పగుళ్లు రాకుండా ఉంటాయి.

టాపిక్