Kitchen Tips: ఇంట్లోనూ, ఇంటి చుట్టుపక్కలకు ఎలుకలు రాకుండా ఉండాలంటే లవంగాలను ఇలా వాడండి
Kitchen Tips: ఎలుకల బెడదతో ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను ఒకసారి ప్రయత్నించండి. దీని కోసం మీరు చేయాల్సిందల్లా లవంగాలను వాడడమే. లవంగాలను వాడడం వల్ల ఎలుకలు దూరంగా ఉంటాయి.
ఎలుకలు ఇంట్లో చేరితే ఎంతో సమస్యగా మారిపోతుంది. ఇంటి చుట్టు పక్కల కూడా ఎలుకలు చేరితే ఇళ్లు పాడవుతుంది. ఎలుకలు మనుషుల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం కూడా. ఇంట్లో ఎలుకలు చేరితే అవి పిల్లలు పెట్టి ప్రతి వస్తువులను కొరికి పాడుచేస్తాయి. ఇంట్లో ఉంచిన ఆహార పదార్థాల నుంచి బట్టలు, ముఖ్యమైన డాక్యుమెంట్ల వరకు అన్నింటినీ కొరికి పడేస్తాయి. ఎలుకలను పట్టేందుకు ఎక్కువమంది ఎలుక బోనులు వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల తిరిగి ఇంట్లో ఇతర ఎలుకలు చేరకుండా అడ్డుకోలేము. అప్పుడు మీరు లవంగాల చిట్కాలను పాటించండి. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కూడా లవంగాలు… ఎలుకలను ఇంటి నుంచి వదిలించుకోవచ్చు.
లవంగాల వాసన నచ్చక
లవంగాలు బలమైన, ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. ఈ వాసన ఎలుకలకు ఏమాత్రం నచ్చదు. అటువంటి పరిస్థితిలో, మీరు వాటిని తరిమికొట్టడానికి లవంగాల సహాయం తీసుకోవచ్చు. దీని కోసం, లవంగాలను వంటగది క్యాబినెట్, డ్రాయర్, షెల్ఫ్ వంటి ఇతర ప్రదేశాలలో చల్లాలి. వీటి వాసన వస్తే చాలు ఎలుకలు దూరంగా పారిపోతాయి. మీరు లవంగాలను ఏ ప్రదేశంలో ఉంచితే ఆ ప్రాంతానికి ఎలుకలు రావు. కాబట్టి ఇంట్లో ఎక్కడ ఎలుకలు ఉంటాయో మీకు తెలుస్తుంది, ఆ ప్రదేశంలో లవంగాలు చల్లితే మంచిది.
ఎలుకలు ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి ఇంట్లోనే స్ప్రే తయారుచేయవచ్చు. ఇందుకోసం స్ప్రే బాటిల్ లో కొద్దిగా లవంగాల నూనె, నీళ్లు అధికంగా వేసి మిక్సీలో వేసుకోవాలి. మీకు లవంగం నూనె లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోండి. కొన్ని లవంగాలను నీటిలో వేసి కొద్దిసేపు ఉడకబెట్టాలి. నీరు సగానికి వచ్చే వరకు ఉడికించి ఆ నీటిని చల్లార్చి స్ప్రే బాటిల్ లో నింపాలి. ఇప్పుడు దీన్ని ఇంట్లోని ప్రతి మూలలో, ముఖ్యంగా ఎలుకలు ప్రవేశించే తలుపులు, కిటికీల దగ్గర చల్లండి. ఇలా చేస్తే ప్రతి మూల దాక్కున్న ఎలుకలు బయటికి వచ్చి పారిపోతాయి.
లవంగాలను ఇతర మార్గాల్లో
ఒక సన్నని వస్త్రంలో కొన్ని లవంగాలు నింపి మూటలా కట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఈ మూటను తలుపులు, కిటికీలు లేదా ఎలుకలు అధికంగా ఉండేచోట పెట్టాలి. ఇది కాకుండా, ఒక కాటన్ ముక్కను తీసుకొని దానికి లవంగం నూనెను పూసి ఆ వస్త్రాన్ని ఇంట్లో మూలల్లో ఉంచినా మంచిదే. ఇలా చేయడం వల్ల మీ ఇంటి చుట్టుపక్కల ఎలుకలు పెద్దగా కనిపించవు.