Chanakya Niti On Women : భార్యకు ఈ లక్షణాలుంటే భర్త జీవితం సంతోషం-untitled story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti On Women : భార్యకు ఈ లక్షణాలుంటే భర్త జీవితం సంతోషం

Chanakya Niti On Women : భార్యకు ఈ లక్షణాలుంటే భర్త జీవితం సంతోషం

Anand Sai HT Telugu
Mar 13, 2024 08:00 AM IST

Chanakya Niti On Wife : ఆచార్య చాణక్యుడు వివాహం జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఉత్తమ భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్య నీతిలో పేర్కొన్నాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

మీకు ఉత్తమ భార్య ఉంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు అలాంటి భార్యను కలిగి ఉండటం వలన మీ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఉత్తమ భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చాడు. సంతోషకరమైన జీవితానికి ఉత్తమ జీవిత భాగస్వామిని కలిగి ఉండటం చాలా ముఖ్యం అనడంలో సందేహం లేదు. వివాహానికి ముందు వ్యక్తి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. కానీ చాలా వరకు పెళ్లిళ్లు అబ్బాయి డబ్బు, అమ్మాయి అందం మీదే నిర్ణయమైపోతాయి. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

స్త్రీ తన గుణాలతో ఏ ఇంటినైనా స్వర్గమో, నరకమో చేయగలదని అంటారు. లోతుగా ఆలోచిస్తే అందులో చాలా నిజం ఉంది. చాణక్యుడి నీతి పురుషుని విధిని మేల్కొలిపే స్త్రీ కొన్ని లక్షణాలను ప్రస్తావించింది. ఆచార్య చాణక్యుడు చెప్పినట్టుగా మంచి భార్య యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రశాంతంగా ఉండే స్త్రీ

మనసు ప్రశాంతంగా ఉండే స్త్రీ మీ జీవితాన్ని అందంగా ఉండేలా చేస్తుంది. స్త్రీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం ఎక్కువగా ఉండకూడదని చాణక్య నీతి వివరిస్తుంది. అలా ఉంటే కుటుంబం మెుత్తం ప్రభావితమవుతుంది. స్థలం, సమయం, పరిస్థితుల ప్రకారం ఆలోచనాత్మకంగా ప్రవర్తించేవారు మీ జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటారు. అలాంటి స్త్రీ తన భర్త జీవితాన్ని హ్యాపీగా ఉంచుతుంది.

తొందరపాటు నిర్ణయాలు

తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారితో మీ జీవితం నాశనం అవుతుంది. ఓపికతో పనిచేసే వ్యక్తి గడ్డు పరిస్థితుల్లోనూ అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ఓపిక గల స్త్రీని వివాహం చేసుకోమని చాణక్యుడు సలహా ఇస్తాడు. ఎందుకంటే మనిషి కుటుంబాన్ని నడిపించే ప్రధాన బాధ్యత భార్యదే. అందుకే ఓపిక ఉంటే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి.

గౌరవించే స్త్రీ

ప్రతి ఒక్కరినీ గౌరవించే స్త్రీ మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. స్త్రీకి సరైన విలువలు ఉంటే, ఆమె ఎప్పుడూ ఇంట్లో గొడవలను అనుమతించదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల వరకు అందరినీ ఎలా సంతోషంగా ఉంచాలో వారికి తెలుసు. అంతేకాదు కోపంలో కూడా ఎవరినీ అగౌరవపరచదు. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుడి జీవితం మెరుగుపడుతుందని చెబుతారు.

కుటుంబం కోసం పూజలు

ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండే స్త్రీ మీ జీవితాన్ని ఆనందం చేస్తుంది. స్త్రీకి తన భర్త జీవితాన్ని మార్చగల శక్తి ఉంది. ఆమె ఎల్లప్పుడూ తన కుటుంబాన్ని చెడు నుండి రక్షిస్తుంది. కుటుంబ బాగుండాలని పూజించే స్త్రీ మీకు భార్యగా వస్తే మీరు అదృష్ట వంతులు. దీని కారణంగా దేవుని దయ ఎల్లప్పుడూ ఇంటి ప్రజలపై ఉంటుంది. చాణక్యుడు ఎప్పుడూ దేవుణ్ణి నమ్మి ధర్మాన్ని అనుసరించే స్త్రీని వివాహం చేసుకోమని సలహా ఇస్తాడు.

నిర్ణయాలు తీసుకునే ధైర్యం

ఒక కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితి నుంచైనా బయటపడేసే శక్తి స్త్రీకి ఉంది. స్త్రీ చాలా గొప్పది. ఆమె తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని సమస్యలు రాకుండా చేయగలవు. సరైన నిర్ణయాలు తీసుకునే స్త్రీ మీ భార్యగా వస్తే మీరు చాలా అదృష్ట వంతులు.

Whats_app_banner