హిందూ మతంలో రావి చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు మీరు రావి చెట్టును, దాని ఆకులను కేవలం మతపరంగానే చూసుంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఎన్నో ఔషధ గుణాలతో నిండిన ఈ చెట్టు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలను కలిగిస్తుంది. ఆయుర్వేదంలో రావి చెట్టు ఆకులను, బెరడును, పండ్లను కూడా వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ముఖ్యంగా రావి ఆకులను నీటిలో మరిగించి(రావి ఆకు కషాయం) తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. రావి ఆకుల నీరు తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, వీటిని ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసుకుందాం రండి.
రావి ఆకుల నీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుడుడుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు గుండె చప్పుడు, గుండె బలహీనత సమస్యలను తగ్గిస్తాయి. రాత్రిపూట నానబెట్టిన ఆకుల నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది.
రావి ఆకులలో రేచక (లేక్సేటివ్) గుణాలు ఉంటాయి. ఇవి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పద్ధతిని అనుసరించడానికి, ఉదయం ఖాళీ కడుపుతో రావి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు చురుకుగా పనిచేస్తాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రావి ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది, గ్లూకోజ్‌ను శక్తిగా త్వరగా మారుస్తుంది.
రావి ఆకుల కషాయం ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఊపిరితిత్తులను శుద్ధి చేసి వాపును తగ్గిస్తుంది. దీనివల్ల రోగికి సులభంగా ఊపిరాడటానికి సహాయపడుతుంది.
రావి ఆకులలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సమస్యలను అంటే ఉదాహరణకు ఎగ్జిమా, దురద వంటి వాటిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుసేలా తయారు చేస్తాయి.
రావి ఆకుల కషాయం కాలేయాన్ని శుద్ధి చేసి జాండిస్ వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 3-4 ఆకులను చక్కెరతో కలిపి నీటిలో కరిగించి తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
రావి ఆకులలో ఉన్న ఫ్లేవనాయిడ్లు, టానిక్ ఆమ్లం వంటి ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.
ఉదయాన్నే పరగడుపున అంటే ఖాళీ కడుపుతో ఈ రావి ఆకుల నీటిని తాగడం చాలా మంచిది. ఈ నీరు తాగే ముందు ముఖ్యంగా మీకు ఇప్పటికే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే, ఆయుర్వేద వైద్యుడు లేదా వైద్యుడిని సంప్రదించండి.