Eating On Bed : మంచం మీద భోజనం చేస్తే తెలియకుండానే ఈ సమస్యలు-unknowingly brings this difficult disease if you eating on bed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating On Bed : మంచం మీద భోజనం చేస్తే తెలియకుండానే ఈ సమస్యలు

Eating On Bed : మంచం మీద భోజనం చేస్తే తెలియకుండానే ఈ సమస్యలు

Anand Sai HT Telugu
Feb 24, 2024 06:30 PM IST

Eating On Bed Problems : చాలా మందికి పడుకునే మంచం మీదనే తినే అలవాటు ఉంటుంది. వందలో తొంభై మంది ఇదే పనిచేస్తారు. కానీ ఇలాంటి అలవాటు చెడ్డది. చాలా సమస్యలను తీసుకొస్తుంది.

మంచంపై తింటే కలిగే సమస్యలు
మంచంపై తింటే కలిగే సమస్యలు (Unsplash)

చాలా ఇళ్లలో స్థలం లేకపోవడంతో మంచంపై కూర్చొని భోజనం చేయాల్సి వస్తోంది. వారు కచ్చితంగా నేలపై కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. మంచ మీద కూర్చొని భోజనం చేస్తే.. శరీరాన్ని దెబ్బతీస్తుంది, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

చాలా మంది భోజనం చేసిన తర్వాత వెళ్లి పడుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. అస్సలు మంచం దగ్గరకు ఫుడ్ తీసుకు వెళ్లే అలవాటే చెడ్డది. మంచం మీద పేపర్ లేదా ప్లాస్టిక్ పెట్టుకుని.. అన్నం, బిర్యానీ తింటుంటారు. మనం హాయిగా నిద్రపోవడానికి మంచం ఉపయోగించాలి. కానీ మంచం మీద తినడం చాలా చెడ్డ అలవాటు. చాలా ఇళ్లలో స్థలం లేకపోవడంతో మంచంపై కూర్చొని భోజనం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేలపై కూర్చోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు.

మంచం మీద తినడం మరింత అజీర్ణం కలిగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. మంచం మీద తినడం సోమరితనం అనిపిస్తుంది. నిటారుగా కూర్చొని తినలేం. వంగుతూ తింటాం. కొందరైతే పడుకుని మరీ తింటారు. ఇది జీర్ణక్రియకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎప్పుడూ కుర్చీలో నిటారుగా కూర్చుని తినండి. ఇది పేగులకు మంచిది.

చాలా మందికి బెడ్‌పై భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్‌పైనే కళ్లు ఉంటాయి. ఇది మనస్సును చెదరగొడుతుంది. ఫలితంగా కొందరు ఎక్కువ ఆహారం తీసుకుంటారు.. మరి కొందరు తక్కువ తింటారు. మీరు చాలా కాలం అలాంటి అలవాటు కలిగి ఉంటే అది శరీరంపై ప్రభావం చూపుతుంది. ఊబకాయం ప్రమాదం పెరుగుతుంది.

మంచం మీద తినడం వల్ల ఆహారం చుట్టూ పడిపోతుంది. అది చాలా చెడ్డ అలవాటు. బెడ్ మీద బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. చాలా సార్లు ఆహారంలోని చిన్న చిన్న రేణువులు కింద పడి అక్కడే ఉండిపోతాయి. మనం పడుకోవడానికి మాత్రమే మంచం వాడాలి. మీరు ఆహారం పడిన మంచం మీద పడుకోకూడదు. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలను కలిగిస్తుంది

పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మంచి నిద్ర వస్తుంది. బెడ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అనారోగ్యకరమైన వాతావరణంలో అలెర్జీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణం ఆహారాన్ని కలుషితం చేస్తుంది.

మంచ మీద కూర్చొని తింటే మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. మీలో ఒత్తిడి ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. బెడ్ మీద తింటే ఎక్కువగా తింటారు. అతిగా తినడం మీ నిద్రపై కూడా ప్రభావం చూపిస్తుంది.

మంచంపై తింటుంటే.. అతిగా తినేస్తున్నారని భావిస్తే దానిపై తినకండి. ఆహారంపై దృష్టిపెట్టి తినండి. నెమ్మదిగా నములుకుంటూ ఆహారం తినండి. చిరుతిళ్లను తగ్గించండి, ఆరోగ్యకరమైన ఆహరం తినండి, ఆరోగ్యంగా ఉండండి. నేలపై కూర్చొని తింటేనే మీ జీర్ణవ్యవస్థ సరిగా ఉంటుంది. ఆహారం చక్కగా కడుపులోకి వెళ్తుంది. వెన్నెముక నిటారుగా పెట్టి తినాలి. అటు ఇటు వంగి తినకూడదు. పడుకుని అస్సలే తినకూడదు.

Whats_app_banner