Queen of roads: ఒక రోడ్డును వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో, అదెక్కడుంది? ప్రత్యేకత ఏంటి?
Queen of roads: ప్రారంభ రోమన్ రాష్ట్ర రాజధానిని, ఆగ్నేయ పట్టణం బ్రిండిసితో కలిపే ఆపియన్ వేకు యునేస్కో గుర్తింపు లభించింది. దీని వివరాలు తెల్సుకోండి.
యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా రోమ్ నగరంలోని ఒక రోడ్డును గుర్తించింది. ఇది రోమ్ నగరంలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణ అని చెప్పవచ్చు. దీన్ని ఆపియన్ వే అంటారు. ఇది పురాతన రోమన్లు నిర్మించిన మొట్ట మొదటి రహదారి మార్గమట. అందుకే దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
రెజీనా వియరమ్ లేదా క్వీన్ ఆఫ్ రోడ్స్ గా పిలువబడే ఈ మార్గం.. పురాతన రోమన్ రాజధానిని, ఆగ్నేయ పట్టణమైన బ్రిండిసితో అనుసంధానిస్తుంది. ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు పొందిన 60వ ఇటాలియన్ సైట్ ఇది. శనివారం సామాజిక వేదిక ఎక్స్ లో తన నిర్ణయాన్ని యునెస్కో ప్రకటించింది.
ఆపియన్ క్లాడియస్ కేకస్ అనే వ్యక్తి పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. క్రీస్తుపూర్వం 312 లో దక్షిణ మిలిటరీ రోడ్డుగా మొదటి విభాగాన్ని ప్రారంభించి పూర్తి చేసిన రోమన్ సెన్సార్ ఆయనే.
ఆపియన్ రోడ్డును వారసత్వ సంపదగా గుర్తించినందుకు ఇటలీ కల్చరల్ మినిస్టర్ గెన్నారో సాంగిలియానో స్పందించారు. మధ్యధరా, తూర్పు దేశాలతో వాణిజ్య, సామాజిక, సాంస్కృతిక మార్పిడికి శతాబ్దాలుగా అవసరమైన అసాధారణ ఇంజనీరింగ్ పనితనానికి ఇచ్చిన విలువను ఈ నిర్ణయం గుర్తించిందని అన్నారు.
రోడ్డు చూడ్డానికి ఎలా ఉంటుంది?
ముందుగా కేవలం మట్టిని చదునుగా చేసి రోడ్డులా మార్చారు. తర్వాత దానిమీద చిన్న రాళ్లు, సిమెంటు, ఇసుక మిశ్రమం పోసి చదునుగా మార్చారు. కాస్త పెద్ద సైజు రాళ్లు దాని మీద పోసి వాటిమీద ఇంటర్ లాకింగ్ అయ్యేలా స్టోన్స్ పేర్చారు. అంటే ఒకరాయి మరో రాయితో కలిసి పోతుంది. కానీ మామూలుగా చూస్తే అంతా ఒకే రాయితో చేసినట్లు ఉంటుందట. అంత పర్ఫెక్ట్ గా ఆ రాళ్లను ఇంటర్ లాకింగ్ చేశారు. రెండు పక్కలా రోడ్డును కాపాడుతూ రిటెనియింగ్ వాల్స్ కూడా ఉంటాయి. ఆ కాలంలో కట్టిన రోడ్డు ఇలా ఉందంటే గొప్ప విషయమే కదా.
టాపిక్