ప్రేమ వల్ల మనస్సుకే కాదు శరీరానికి కూడా బోలెడు లాభాలట, అన్‌కండీషనల్ లవ్‌తో అన్‌లిమిటెడ్ హెల్త్ మీ సొంతం!-unconditional love offers numerous benefits healthy mind healthy body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రేమ వల్ల మనస్సుకే కాదు శరీరానికి కూడా బోలెడు లాభాలట, అన్‌కండీషనల్ లవ్‌తో అన్‌లిమిటెడ్ హెల్త్ మీ సొంతం!

ప్రేమ వల్ల మనస్సుకే కాదు శరీరానికి కూడా బోలెడు లాభాలట, అన్‌కండీషనల్ లవ్‌తో అన్‌లిమిటెడ్ హెల్త్ మీ సొంతం!

Ramya Sri Marka HT Telugu

ప్రేమ వల్ల మనస్సుకు సంతోషం మాత్రమే కాదట, పూర్తి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ప్రేమ, రొమాన్స్‌కు ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి మానసిక ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ప్రేమ వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుందామా!

ప్రేమ వల్ల ఆరోగ్యం మెరుగవుతుందా?

"ఒరేయ్ బాబూ.. ఒకరికొకరు ప్రేమించుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? జీవితం ఎలా గడిచేది" అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఒకరిపై ఒకరు స్వచ్ఛమైన ప్రేమ చూపించుకుంటేనే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటామట. మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా, సంపాదించేది, జీవితాన్ని నడిపించుకోగలిగేది. మీ ప్రేమ నిజమై, మీ భాగస్వామితో రొమాన్స్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంటే, మీరు ఇతరులకన్నా ఆరోగ్యంగా, మెరుగైన జీవితం గడుపుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది సైంటిఫికల్ ప్రూవ్ అయింది కూడా. మంచి అనుబంధంతో రొమాంటిక్ లైఫ్ గడుపుతున్న దంపతులు ఆరోగ్యంగా ఉండి, నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తేలింది.

దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ పరిశోధనలను కలిపి చేసిన నివేదిక ఆధారంగా ప్రేమ, సంబంధాలు, యువత, మధ్య వయస్సు వారి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో, వారికి ఆరోగ్యకరమైన, దీర్ఘాయువును ఎలా ఇస్తాయో తెలియజేసింది. అసలు ఆ రీసెర్చ్ ఏం చెబుతుంది? ప్రేమ ఆరోగ్యానికి ఎలా కారణమవుతుంది?

ప్రేమ వల్ల మెదడుపై ప్రభావం

మనం ప్రేమించే వ్యక్తి గురించి, లేదా వారితో సంబంధించిన ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నామంటే, మన మెదడులో డోపమైన్ హార్మోన్ విడుదలను ప్రారంభిస్తుంది. ఇది ఒక హ్యాపీ హార్మోన్, ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆ వ్యక్తిని కలవడం, వారితో సమయం గడపడం, సంగీతం వినడం వంటి వాటి ద్వారా ఈ డోపమైన్ మరింతగా ఉత్పత్తి అవుతుంది. సంతోషానికి అవధులు ఉండవు. అంతేకాదు, భాగస్వామితో రొమాన్స్ చేయడం, వారికి దగ్గరగా ఉండటం లేదా వారు మనకు మంచి అనుభూతిని కలిగించడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా వేగంగా విడుదల అవుతుంది. ఇది మీ భాగస్వామితో సురక్షితంగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. వారిపై నమ్మకాన్ని ఏర్పరుస్తుంది.

గుండె కొట్టుకోవడంలో మార్పు

మెదడు నుండి వచ్చే ఈ సంతోష హార్మోన్లు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. అందుకే, మీకు ఇష్టమైన వ్యక్తి చుట్టూ ఉన్నప్పుడు గుండె బలంగా కొట్టుకుంటుంది. ఇందులో డోపమైన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే, దీని వల్ల గుండె మెరుగైన విధంగా పనిచేస్తుంది. ఆక్సిటోసిన్ విషయానికి వస్తే, దీనికి గుండె ఆరోగ్యంపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. కానీ, ఒత్తిడి లేని, మంచి సంబంధం ఉన్నప్పుడు, ఆక్సిటోసిన్ వాపు సమస్యను తగ్గించి, ధమనుల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని పంప్ చేసేటప్పుడు గుండెను సంకోచించి, విశ్రాంతి తీసుకునే కండరాలైన కార్డియోమయోసైట్‌లను రక్షిస్తుంది.

ఒత్తిడి దూరంగా ఉంచుతుంది

ప్రేమ, రొమాన్స్‌కు మానసిక స్థితితో నేరుగా సంబంధం ఉంది. ఆరోగ్యకరంగా ఉంటే, ఒత్తిడి మీకు దూరంగా ఉంటుంది. జీవితంలో సమస్యలు రావు అని కాదు, కానీ ఈ సంబంధం ఒత్తిడి సమస్యను మీకు సులభతరం చేస్తుంది. ప్రేమ లేదా రొమాన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇతర విషయాలపై మీరు తక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు. సమస్య నుండి బయటపడే మార్గాన్ని ఇతరులకన్నా త్వరగా కనుగొంటారు. ఎందుకంటే హ్యాపీ హార్మోన్‌కు మానసిక స్థితిపై సానుకూల ప్రభావం ఉంటుంది. దీని వల్ల కార్టిసోల్ హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడి హార్మోన్ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒంటరి వ్యక్తులలో కార్టిసోల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. వారు నిరాశకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

జీవితానికి వరం రొమాన్స్

జీవిత చక్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రతి, కామం అత్యంత అవసరం. రొమాన్స్ జీవిత చక్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే పరిమితం కాదు. కానీ, మీ సంబంధం మీ భాగస్వామితో మంచిగా ఉంటే, మీ జీవితం కూడా దీర్ఘకాలం ఉంటుంది. 2011లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం, మంచి సంబంధంలో ఉన్నవారి జీవితం దీర్ఘకాలం పాటు హెల్తీగా ఉంటుందని, ఒంటరిగా జీవిస్తున్న లేదా జీవిత భాగస్వామితో అసంతృప్తిగా ఉన్నవారిలో ముందే మరణించే సందర్భాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇవి దాదాపు 24 శాతం ఉన్నాయి. రొమాన్స్ మనకు దీర్ఘాయువును ఎందుకు ఇస్తుందంటే, దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రేమను చూపించడం వల్ల మార్పు ఎలా వస్తుంది:

రోజూ కొంత సమయాన్ని భాగస్వామికి కేటాయించడం, వారితో క్వాలిటీ సమయం గడపడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాదు, మీ వ్యక్తిత్వంలో కూడా మెరుగుదల వస్తుంది. అదెలాగో తెలుసుకోండి:

ఆశావాదిగా మారడం: భాగస్వామితో సంబంధం సానుకూలంగా ఉంటే, మిగతా ప్రపంచం కూడా సానుకూలంగా కనిపిస్తుంది. అలాంటి జంటలు ఇతరులలో, పరిస్థితులలో లోపాలను వెతకరు. కానీ సానుకూలత వైపు దృష్టిని మళ్లిస్తారు. జీవితం పట్ల వారి వైఖరి కూడా సానుకూలంగా ఉంటుంది.

ఆత్మవిశ్వాసం పెరగడం: మంచి రొమాంటిక్ సంబంధం కేవలం కొంత సమయం గడపడానికి మాత్రమే పరిమితం కాదు. ఒకరినొకరు గౌరవించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మీతో అలా ఉంటే, మీ ఆత్మవిశ్వాసం ఇతరులకన్నా మెరుగవుతుంది. మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవడం కూడా తెలుసుకుంటారు.

జీవితంలో సమతుల్యత: మంచి సంబంధంలో పరస్పర అవగాహన కూడా మంచిగా ఉంటుంది. దీని వల్ల జీవితంలోని ఒడిదుడుకులను కలిసి అధిగమించడం సులభం అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఆదుకుంటూ జీవితంలో సమతుల్యతను సాధించడం నేర్చుకుంటారు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం