Ugadi Sweet recipe: ఉగాది స్పెషల్ రెసిపీ ఉడిపి స్టైల్ పూరి పాయసం, సాధారణ ఖీర్‌లతో పోలిస్తే ఈ పాయసం అదిరిపోతుంది-ugadi special recipe udupi style puri payasam know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi Sweet Recipe: ఉగాది స్పెషల్ రెసిపీ ఉడిపి స్టైల్ పూరి పాయసం, సాధారణ ఖీర్‌లతో పోలిస్తే ఈ పాయసం అదిరిపోతుంది

Ugadi Sweet recipe: ఉగాది స్పెషల్ రెసిపీ ఉడిపి స్టైల్ పూరి పాయసం, సాధారణ ఖీర్‌లతో పోలిస్తే ఈ పాయసం అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

Ugadi Sweet recipe: ఉగాదికి ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలని ఆలోచిస్తున్నారా? పూరీ పాయసం ప్రయత్నించి చూడండి. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా రుచిగా అనిపిస్తుంది.

పూరీ పాయసం రెసిపీ (Vismai Foods/Youtube)

ఉగాదికి కచ్చితంగా ఒక స్వీట్ రెసిపీ ఉండాల్సిందే. పూజలో స్వీట్ ను పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటి పాయసం చేసే బదులు కాస్త భిన్నంగా పూరి పాయసం చేసి చూడండి. సాధారణ పాయసంతో పోలిస్తే పూరి పాయసం చాలా రుచిగా ఉంటుంది. తినాలన్న కోరిక పెరిగిపోతుంది. దీని నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. కాబట్టి ఇది మీకు ప్రసాదంగా స్నాక్స్ గా కూడా ఉపయోగపడుతుంది.

పూరి పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు

బొంబాయి రవ్వ - ముప్పావు కప్పు

నీళ్లు - అరకప్పు

నెయ్యి - తగినంత

జీడిపప్పులు - అరకప్పు

కిస్ మిస్‌లు - పావు కప్పు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పాలు - రెండున్నర లీటర్లు

పంచదార - ముప్పావు కప్పు

యాలకుల పొడి - అర స్పూను

పూరి పాయసం రెసిపీ

1. పూరి పాయసం చేసేందుకు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండున్నర లీటర్ల పాలు పోసి మరిగించండి.

2. ఈలోపు ఒక ప్లేట్లో బొంబాయి రవ్వ, రెండు స్పూన్ల నెయ్యి, కొంచెం నీళ్లు వేసి దాన్ని పూరీ పిండి లాగా బాగా కలుపుకోండి. ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి.

3. తర్వాత ఆ రవ్వ మిశ్రమం నుంచి చిన్న ముద్దను తీసి చేతితోనే పూరి లాగా వత్తుకొని పక్కన పెట్టుకోండి.

4. అలా ముప్పావు కప్పు రవ్వకు ఐదారు పూరీలు అవుతాయి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.

6. అందులో ఒత్తుకున్న పూరీలను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి.

7. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న పాలు మంట తగ్గించి చిన్న మంట మీద అలా మరిగించండి.

8. రెండున్నర లీటర్ల పాలు ఒకటిన్నర లీటర్ వచ్చేవరకు అలా మరిగిస్తూ ఉండాలి.

9. అందులోనే ముప్పావు కప్పు పంచదారని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. అవి చిక్కగా ఒకటిన్నర లీటర్ వరకు తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

11. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పూరీలను ముక్కలుగా చేసి పాలల్లో వేయాలి.

12. మరొక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నెయ్యిని వేయాలి.

13. ఆ నెయ్యిలో జీడిపప్పులను, కిస్మిస్లను వేయించి వాటిని తీసి పాలల్లో కలుపుకోవాలి.

14. పూరీలు పాలను బాగా పీల్చుకునే వరకు ఉంచాలి. అంతే టేస్టీ పూరి పాయసం రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. సాధారణ పాయసాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది.

ఈ పూరీ పాయసం ఉడిపిలో అధికంగా చేస్తూ ఉంటారు. ఇది అక్కడ సంప్రదాయ పాయసం. ఎప్పుడూ మనం పరమాన్నం, సేమియా పాయసం వంటివి చేస్తూ ఉంటాము. ఒకసారి భిన్నంగా ఈ పూరి పాయసం చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. పైగా ఇందులో మనం ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసాము. కాబట్టి ఆరోగ్యానికి మంచిది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం