ముద్దు ముద్దు మాటలు.. క్యూట్ స్మైల్.. సోషల్‌ మీడియాలో అంజలి కూతురి హంగామా-tv actor anjali youtube channel itlu mee anjalipavan get more popularity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ముద్దు ముద్దు మాటలు.. క్యూట్ స్మైల్.. సోషల్‌ మీడియాలో అంజలి కూతురి హంగామా

ముద్దు ముద్దు మాటలు.. క్యూట్ స్మైల్.. సోషల్‌ మీడియాలో అంజలి కూతురి హంగామా

HT Telugu Desk HT Telugu

anjalipavan: సృజనాత్మకత ఉంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోవచ్చు. ఒక్క అవకాశమంటూ ఎదురుచూసే వారు నిర్మాతల ఆఫీస్‌లా చుట్టూ తిరగనవసరం లేకుండా డిజిటల్ వేదికపై తమ టాలెంట్ చూపిస్తూ నిర్మాతలనే వారి చూట్టూ తిప్పుకునేలా చేసుకుంటున్నారు.

anjalipavan

కాస్త ప్రతిభ.. కూసింత కళాపోషణ ఉంటే చాలు డిజిటల్ వేదికపై స్టార్స్‌గా మారిపోవచ్చు. స్ట్మార్ట్ ఫోన్ విప్లవం తర్వాత ప్రధాన స్రవంతి కంటే డిజిటల్ కంటెంట్ అధిక ప్రాధన్యత ఉంటుంది. కాస్త సృజనాత్మకత ఉంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోవచ్చు. ఒక్క అవకాశమంటూ ఎదురుచూసే వారు నిర్మాతల ఆఫీస్‌లా చుట్టూ తిరగనవసరం లేకుండా డిజిటల్ వేదికపై తమ టాలెంట్ చూపిస్తూ నిర్మాతలనే వారి చూట్టూ తిప్పుకునేలా చేసుకుంటున్నారు. కొత్త వారికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ అవకాశాల వారధిగా మారుతుంటే.. ఇక ఆల్రేడి స్టార్స్ అయిన వారు అభిమానులతో నేరుగా టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి.

ప్రస్తుతం చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో అభిమానులకు నేరుగా టచ్‌లో ఉంటున్నారు. అభిమానుల కోరికలు, వారి ఇష్టాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా సెలెబ్రిటీలు రకరకాల కంటెంట్‌లను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ వేదికలో బుల్లితెర తారల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్‌స్ట్రా రిల్స్, యూట్యూబ్ వీడియోలతో మస్తూ హంగామా జేస్తుర్రు. ప్రస్తుతం అలా ట్రెండ్ అవుతున్నా స్టార్‌లలో నటి అంజలి ఒకరు. ఒకప్పుడు మొగలి రేకులు సీరియల్‌తో పాపులారిటి సంపాదించుకున్న అంజలి ఇప్పుడు య్యూటూబ్ వేదికగా అభిమానులను అలరిస్తున్నారు.

నటి అంజలి తన సహ నటుడు పవన్‌ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అంజలి, పవన్ కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ధన్విక అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ చిన్నారి బుడి బుడి అడుగులు, చిలిపి చాలా మందిని సర్‌ఫ్రైజ్ చేస్తున్నాయి. ధన్విక పేరుతో ఇన్‌స్టాలో ఓ ఖాతాను కూడా ఓపెన్ చేశారు. అంజలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాకు 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంజలి కూతురు ధన్వికకు ఇంచు మించుగా లక్ష మంది ఫాలోవర్లున్నారు. తల్లీ కూతుళ్లిద్దరూ సోషల్ మీడియాలో వివిధ కంటెంట్స్‌ను ప్రదర్శిస్తూ తెగ సందడి చేస్తున్నారు.

ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అంజలి సోషల్ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సోషల్ మీడియా ద్వారానే కాకుండా యూట్యూబ్ చానెల్‌తో కూడా అభిమానులను అలరిస్తున్నారు. యూట్యూబ్‌లో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలను చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. వెండితెరపై అంజలి హవా తగ్గిన కూడా సోషల్ మీడియా తన జోరును కొనసాగిస్తుంది. ఇట్లు మీ అంజలి పవన్ (itlu mee anjalipavan) అనే యూట్యూబ్ చానెల్‌తో వ్యూయర్స్ అలరిస్తున్నారు. ఈ ఛానల్‌కు 2 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. తన సహా తోటీ నటీనటులతో కలిసి వీడియోల్లో అంజలి చేసే అల్లరి మామూలుగా ఉండదు.

సంబంధిత కథనం