Cancer: ‘పసుపు, తులసి, వేపాకులు’: క్యాన్సర్ చికిత్స సమయంలో తన భార్య పాటించిన డైట్‍ను వెల్లడించిన మాజీ స్టార్ క్రికెటర్
Cancer: తన భార్య స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు సహకరించిన డైట్ గురించి మాజీ క్రికెటర్ నవ్‍జోత్ సింద్ సిద్ధు వెల్లడించారు. వైద్యంతో పాటు ఆమె పాటించిన డైట్ గురించి తెలిపారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
తన భార్య నవ్‍జోత్ కౌర్ సిద్ధు క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని మాజీ స్టార్ క్రికెటర్, మాజీ మంత్రి నవ్‍జోత్ సింగ్ సిద్ధు వెల్లడించారు. సుమారు సంవత్సర కాలం ఆమె క్యాన్సర్‌తో పోరాడారు. బతికేందుకు 3 శాతమే అవకాశం ఉన్న స్టేజ్ 4కు క్యాన్సర్ తీవ్రమైనా ఆమె కోలుకున్నారని ఓ మీడియా సమావేశంలో సిద్ధు వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స తీసుకునే సమయంలో తన భార్య కౌర్ కఠినమైన డైట్ కూడా పాటించారని వెల్లడించారు. ఇది కూడా ఆమె కోలుకునేందుకు సహకరించిందని చెప్పారు.
నిమ్మరసం, పసుపు తినడం సహా..
క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో సమయంలో తన భార్య తీసుకున్న డైట్ గురించి మీడియా సమావేశంలో వివరించారు సిద్ధు. నిమ్మరసం నీరు, పచ్చి పసుపు తినేవారని వెల్లడించారు. అరగంట తర్వాత 10 నుంచి 12 వేప ఆకులు, తులసి ఆకులు తినేవారని చెప్పారు. గుమ్మడి, దానిమ్మ, క్యారెట్, ఉసిరి, బీట్‍రూట్‍తో చేసే జ్యూస్‍లు తాగారని, వాల్‍నట్స్ తినే వారని చెప్పారు. క్యాన్సర్‌కు బెర్రీలు కూడా మంచి మెడిసిన్ అని అన్నారు.
హెల్బల్ టీలు, క్వినోవా
కౌర్ సాయంత్రం తీసుకునే ఆహారంలో కూడా రోటీలు కూడా ఉండేవి కాదని, క్వినోవా మాత్రమే ఇచ్చే వారమని సిద్దు వెల్లడించారు. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, బెల్లం, యాలకులు లాంటి మసాలా దినుసులతో చేసిన టీలను ఉదయాన్నే కౌర్ తీసుకునే వారని సిద్ధు చెప్పారు. యాంటీ ఇన్‍ఫ్లమేటరీ,యాంటీ క్యాన్సర్ ఆహారాలను ఆమె తినేవారు. కొబ్బరినూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనె, బాదం నూనెతో వండిన ఆహారాలనే కౌర్ తీసుకునే వారని సిద్ధు వెల్లడించారు. హీపెచ్ లెవెల్ 7 నీటిని మాత్రమే కౌర్ తాగేవారని, ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంలో ఇది కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపారు.
అలా క్యాన్సర్‌ను ఓడించారు
తన భార్య కౌర్ క్రమశిక్షణగా ఉంటూ.. కఠినమైన అలవాట్లు పాటించి క్యాన్సర్‌ను ఓడించారని సిద్ధు చెప్పారు. పాటియాలాలోని రాజేంద్ర మెడకల్ కళాశాల సహా ఆమెకు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించానని అన్నారు. కౌర్ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చు కొన్ని లక్షలే అయిందని చెప్పారు. బతకడంపై డాక్టర్లు తక్కువ ఆశే ఇచ్చినా..అంకితభావం, పట్టుదలతో పోరాడి క్యాన్సర్‌ను కౌర్ ఎదుర్కొన్నారని వెల్లడించారు. క్యాన్సర్ కారణంగా జీవితంపై అనుమానంతో తన కుమారుడి పెళ్లి కోసం కౌర్ పట్టుబట్టారని సిద్ధు వెల్లడించారు. అయితే, ఎప్పుడూ ఆమె ధైర్యం కోల్పోకుండా.. క్యాన్సర్‌తో పోరాడి జయించారని వెల్లడించారు.
టాపిక్