Tuesday Motivation : ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని.. అర్థమయ్యాక బదులివ్వండి..-tuesday motivation on you have two ears and one mouth follow that ratio listen more talk less ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation On You Have Two Ears And One Mouth Follow That Ratio Listen More Talk Less

Tuesday Motivation : ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని.. అర్థమయ్యాక బదులివ్వండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 12, 2022 08:16 AM IST

Tuesday Motivation : మనస్పర్థలు ఎక్కువగా ఎలా వస్తాయంటే ఎదుటివారు చెప్పింది పూర్తిగా విననప్పుడు.. లేదా విన్నది అర్థం చేసుకోలేకపోయినప్పుడు. అందుకే ఎప్పుడైనా ఎదుటివారు చెప్పేది వినడం నేర్చుకోండి. ఆ సమయంలో దానిని అర్థం చేసుకుని.. బదులు ఇవ్వండి. ఇది మీకే కాదు.. మీతో మాట్లాడేవారికి కూడా చాలా మంచిది.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ప్రపంచంలో జరిగే చాలా సంఘర్షణలు అపార్థాల కారణంగానే మొదలవుతాయి. ఎందుకుంటే మనం వినడంలో అంత శ్రద్ధ వహించము కాబట్టి. దేనిగురించైనా ఎవరైనా చెప్తున్నప్పుడు అది మనం పూర్తిగా వినకపోవడం ఒక సమస్య అయితే. విన్నది సరిగ్గా అర్థం చేసుకోవడం మరో తప్పు. లేదంటే మనం వినాలనుకున్నది ఇది కాదని మీకు అనిపించినప్పుడు ఈ అపార్థాలనేవి మొదలవుతాయి. ఈ మూడింటిలో ఏది జరిగినా.. మనం మనవైపు వాదించుకుంటూ.. ఎదుటివారు చెప్పేది పెడచెవిన పెట్టేస్తాం. ఈ క్రమంలో వారు చెప్పాలనుకున్నది చెప్పలేరు. వారికి మనసులో దీని గురించి ఓ అభిప్రాయం ఏర్పడి.. ఇరువురి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి.

అందుకే ఎదుటివారు చెప్పేది మనం వినాలి. సింపుల్​గా చెప్పాలంటే.. దేవుడు వినడానికి రెండు చెవులను, మాట్లాడటానికి ఒకటే నోరు ఇచ్చాడు. దీని అర్థం ఎక్కువ విని.. తక్కువ మాట్లాడాలని. చాలా సింపుల్ లాజిక్. ఎక్కువ విన్నప్పుడు ఆ టాపిక్​లో సమస్యలుంటే అర్థమవుతాయి. దానిని ఇంకెలా బెటర్ చేయాలో తెలుస్తుంది. అవతలి వ్యక్తి ఏమి ఫీల్​ అవుతున్నాడో తెలుస్తుంది. అంతేకానీ సగం విని.. అవతలి వ్యక్తి మనోభావాలు లెక్కచేయకుండా.. మీకు నచ్చింది చెప్పేస్తే.. దానిలో ఇంక మంచి ఏముంది.

అందుకే తెలివైన వారు ఎప్పుడూ తక్కువ మాట్లాడతారు. అడిగినదానికే బదులు చెప్పేలా ఉంటారు. అందుకే మనం ఏ విషయాన్నైనా సరిగ్గా వినాలి. దాని గురించి ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అపార్థాలు చోటుచేసుకోకుండా.. వారికి దానిగురించి వివరించాలి. ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా మనం ఎక్కువగా వినేందుకు ప్రయత్నించాలి. ఇతరులు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది తెలుసుకోవడం అవసరం. వారి అభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తపరిచిన తర్వాతనే.. మనం మాట్లాడాలి.

ఇతరులు మన నుంచి ఏమి కోరుకుంటున్నారో.. వారి మాటల్లో మనకు అర్థం అవుతుంది. అర్థం కాలేదా మరోసారి దాని గురించి అడిగి తెలుసుకోండి. అంతే కానీ సగం వినేసి.. పూర్తిగా అర్థమైపోయినట్లు మీరు బదులు ఇస్తే.. అది ఇరువురికి మంచిది కాదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్