Tuesday Motivation : సెన్సిటివ్‌గా ఉండటం అనేది చెడు విషయమేమి కాదు.. అర్థం చేసుకోవాలి అంతే..
Tuesday Motivation : ప్రపంచంలో చాలామంది సెన్సిటివ్ పీపుల్ ఉన్నారు. వీళ్లకి ఎదుటివాళ్లను అర్థం చేసుకోవాలన్నా.. చుట్టూ ఉన్నా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా.. చాలా సమయం పడుతుంది. త్వరగా పరిస్థితులను అర్థం చేసుకోలేరు. కాబట్టి అందరికీ.. అన్ని విషయాలు త్వరగా అర్థమైపోవాలని చూడకండి. కొంచెం టైం ఇవ్వండి.
Tuesday Motivation : వినే సామర్థ్యం, ఆలోచించే విధానం, సహనం, అవగాహన (ఉండడం, లేకపోవడం), సానుభూతి వంటివి.. ఓ వ్యక్తిని సున్నితమైన, సెన్సిటివ్ వ్యక్తిగా మార్చేస్తాయి. కాబట్టి వారు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి, చుట్టూ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి వాళ్లు కనెక్ట్ అయ్యారంటే.. వారికన్నా మిమ్మల్ని ఎవరూ బాగా అర్థం చేసుకోరు. కానీ అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇది వారి ప్రశాంతత, ఆనందం, విజయం, ఆరోగ్యం, మానసిక ఆరోగం వంటివాటిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి వీటిని పొందాలంటే వాళ్లు చాలా స్ట్రగుల్ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్లు వివిధరకమైన ఆలోచనలతో.. సతమతమవుతూ ఉంటారు.
చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడిపోవడం. అలాగే అంతే చిన్న చిన్న వాటికి బాధపడిపోవడం కూడా వారికి కామన్. వాళ్ల మూడ్ స్వింగ్స్ తరచూ మారిపోతూ ఉంటాయి. వాళ్లకి ఏమికావాలో కూడా త్వరగా తేల్చుకోలేరు. ఇలా ఎందుకు జరిగింది. అలా ఎందుకు జరుగుతుంది అని వివిధ ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు. కొన్ని ప్రతికూల ఆలోచనలను వదిలేయడం వారికి చాలా కష్టంగా ఉంటుంది. అంత సులువుగా వారు వారి ఆలోచనలను వదలలేరు. ఇది వారికి తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన, స్ట్రెస్, బాధ, కోపం మొదలైనవాటికి దారితీస్తుంది.
మీ జీవితంలో ఇలాంటి సెన్సిటివ్ పీపుల్ ఉంటే అర్థం చేసుకోండి. వారికి కాస్త సమయం ఇవ్వండి. అర్థమయ్యేలా వారికి పరిస్థితుల గురించి వివరించండి. ఎంత విన్నా.. వారు అర్థం చేసుకోకుండా.. వారి ఆలోచనల్లోనే మునిగిపోతూ ఉంటే.. ఆ పరిస్థితులకు దూరంగా ఉంచి.. కాస్త సానుకూల అంశాలు వారి చుట్టూ ఉండేలా క్రియేట్ చేయండి. ఇలా చేస్తే.. వారి ఆలోచనలు కాస్తైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకానీ వీళ్లకి ఎందుకు అర్థం కాదు అంటూ.. మీరు కూడా మొండిపట్టు పట్టకండి. అందరికీ అన్ని విషయాలు ఒకేలా అర్థం కావు. వాళ్లు అర్థం చేసుకున్నట్లు మీరు అర్థం చేసుకోలేరు. మీకు అర్థమైనట్లు వారు అర్థం చేసుకోరు. కాబట్టి.. మీతో ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా.. మీరే ఎవరికైనా చెప్పాలి అనుకున్నా.. కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. తద్వారా మీరు మ్యాటర్ బాగా, అర్థమయ్యేలా చెప్పే అవకాశముంది.
మీరు ఇలాగే సెన్సిటివ్ అని మీరు భావిస్తే.. ఏమి కంగారు పడకండి. మీరు అందరికీ కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంతే. దానిని ఆపగలిగే శక్తి మీకులేకపోవచ్చు. కానీ పరిస్థితులు మిమ్మల్ని దిగజారుస్తున్నాయి అనిపించినప్పుడు.. మీరు కనీసం మీ ఆలోచనలను వేరే వాటిపై డైవర్ట్ చేయండి. ఇది మీ ప్రెజర్ తగ్గిస్తుంది. మీ జీవితం అదుపు తప్పుతున్నా.. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని బాధపకండి. వాళ్లకి కూడా సమస్యలు ఉంటాయి.. వాళ్ల సమస్యలతో వాళ్లు బిజీగా ఉంటారని గుర్తించండి. అంతేకానీ వాళ్లపై చిరాకు పడి.. కోపంతో మరింత ఎక్కువ ఆలోచించకండి. సెన్సిటివ్‌గా ఉండటం చెడ్డ విషయమేమి కాదు. దీనిని మీరు సరైన దారిలో ఉపయోగిస్తే.. ఇది మీకు అనేక బలాన్ని ఇస్తుంది. ఏ విషయంలో సెన్సిటివ్‌గా ఉండాలో.. ఏ విషయంలో ఉండకూడదో మీరే తేల్చుకోండి.
సంబంధిత కథనం