Tuesday Motivation : పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. సైలంట్​గా ఉండండి..-tuesday motivation on if you cannot be positive then at least be quiet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation On If You Cannot Be Positive, Then At Least Be Quiet.

Tuesday Motivation : పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. సైలంట్​గా ఉండండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 24, 2023 04:00 AM IST

Tuesday Motivation : అందరూ.. అన్నీ సందర్భాల్లో.. పాజిటివ్​గా ఉండలేరు. ఏదొక సమయంలో.. ఏదొక వ్యక్తి వల్ల మనలోని పాజిటివ్ లెవల్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి నెగిటివ్ ఫేజ్​లో మీరున్నప్పుడు.. మీరు రియాక్ట్ అవ్వడం కంటే సైలంట్​గా ఉండడమే మంచిది.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ఈ ప్రపంచంలో ప్రతికూల వ్యక్తులు, ప్రతికూల పరిస్థితులు పుష్కలంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో.. మీరు ఎక్కువగా నెగిటివ్ అయిపోతారు. ఒక్కసారి నెగిటివ్ ఆలోచనలు వచ్చాయంటే అవి తిరిగి పాజిటివ్​గా మారడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో మనం మాట్లాడే మాటలు, చేసే పనులు ఇలా ప్రతి వాటిని మన చుట్టూ ఉన్నవారు లెక్కిస్తారు. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన సమయం. ఈ సమయంలో మీరు చాలా కంట్రోల్​గా ఉండాలి. చేసే పనిలో.. మాట్లాడే మాటలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎదుటివారి వేలెత్తి ఇది తప్పు అని చెప్పకుండా బిహేవ్ చేయాలి.

ఇలా చేయడం మావల్ల కావట్లేదు.. లేదా ఇలా మేము చేయలేము.. కంట్రోల్ చేసుకోలేనంత కోపం నాలో ఉంది అని మీరు అనుకుంటే.. వెంటనే మీరు ఏమి మాట్లాడకుండా సైలంట్ అయిపోండి. అవును కోపంలో ఉన్నప్పుడు.. నెగిటివ్ ఆలోచనలతో సతమతమవుతున్నప్పుడు నోరుజారడం, చేయి చేసుకోవడం కన్నా సైలంట్​గా ఉండడం చాలా మంచిది. ఎలాగో మన ఆలోచనలతో మనం ఇబ్బంది పడుతున్నాం. మన చేతలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు. జస్ట్ సైలంట్​గా మన పని మనం చేసుకున్నామా.. ఎవరిని హర్ట్ చేయకుండా ఇంటికి వచ్చేశామ. తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్లు కొన్ని రోజులు బతకండి. ఎలాంటి సమస్య ఉండదు.

ఏమి పర్లేదు కొన్నిరోజులు మౌనంగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. సమస్యలు రాకూడదనుకుంటే మౌనంగా ఉండడమే మనం చేయగలిగే మంచిపని. ప్రస్తుత సమాజంలో పుకార్లు, గాసిప్స్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. మనం ఏమి మాట్లాడినా.. ఏమి చేసినా.. ఎవరో ఒకరు.. ఏదొక విధంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. లేదంటే జీవితాంతం మనం చేసినా ఒక్క తప్పునే చూపిస్తారు. అలాంటివారికి ఛాన్స్ ఇవ్వకూడదంటే.. మీరు కొన్నిసార్లు సైలంట్​గా మీ పని మీరు చేసుకోవాలి. అలాగే ప్రతికూలమైన వ్యక్తులకు దూరంగా ఉంటూ.. పాజిటివ్​గా ఉండేవారికి దగ్గరగా ఉండండి. మీలో పగని, లేదా ఎమోషన్స్​ని రెచ్చగొట్టవారికి కాకుండా.. మిమ్మల్ని శాంతంగా కంట్రోల్​ చేయగలిగే వారికి దగ్గరగా ఉండండి. అలాంటి పాజిటివ్ వ్యక్తులు మీకు ఎవరూ కనిపించకుంటే డోంట్ వర్రీ. మీతో మీరే సమయాన్ని గడపండి. అదే బెస్ట్ కూడా.

నిశ్శబ్దంగా ఉండడం అంటే నిస్సహాయంగా ఉండడమే అనుకుని చాలా మంది భావిస్తారు. కొంత మంది కావాలని మనల్ని రెచ్చగొడతారు. మనం పనులను మాటల్లో చెప్పనవసరం లేదు. చేతల్లో చూపిస్తే చాలు. మీ రిజల్ట్స్​ ప్రత్యర్థులకు గట్టి ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి పదం ఎదుటివారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు అది మంచా? చెడా? అని మనం గుర్తించలేకపోవచ్చు. కానీ అది వింటున్న వ్యక్తిపై ఆ మాట పెద్ద ముద్ర వేస్తుంది. కాబట్టి పరిస్థితులు మీ కంట్రోల్​లో లేనప్పుడు.. మీరు సానుకూలంగా ఉండలేకపోతే.. కనీసం సైలంట్​గా ఉండడం నేర్చోకోండి. ఇది మిమ్మల్ని కొన్ని పరిస్థితుల నుంచి.. కొన్ని బంధాల నుంచి మిమ్మల్ని కచ్చితంగా రక్షిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం