Tuesday Motivation : ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు.. ఎంత త్వరగా దీనిని అర్థం చేసుకుంటే అంత మంచిది..
Tuesday Motivation : జీవితంలో ఒక స్టేజ్‌కి చేరిపోయామని కొన్నిసార్లు అనిపిస్తుంది. అది ఎప్పుడంటే.. బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు.. అనుకున్న గోల్‌ని రీచ్ అయినప్పుడు.. మంచి ఉద్యోగాన్ని సాధించినప్పుడు.. లెక్కలేనన్ని డబ్బులు ఉన్నప్పుడు.. సంతోషం తప్పా బాధ కనిపించనప్పుడు. ఇవేకాకుండా మరొకటి ఉంది. అదేంటంటే.. మన ఎమోషన్స్‌ని, ఆలోచల్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు. కానీ...
Tuesday Motivation : పైవన్నీ కూడా మన ఆధీనంలో ఉండవు. డబ్బు, సక్సెస్, ఉద్యోగం, ఎమోషన్స్ అన్ని పరిమితమే. ఇవి కొన్నిసార్లే మనం రియలైజ్ అవ్వగలము. అవి మన దగ్గరనుంచి దూరమైపోతున్నప్పుడు.. వాటి అవసరం మనకి తెలిసినప్పుడు మాత్రమే.. వాటి విలువను మళ్లీ గుర్తిస్తాము. కొన్నిసార్లు.. ఎవరైనా చనిపోయినా.. నా కంటి నుంచి నీరు కూడా రాదేమో అని మీకు అనిపించి ఉండొచ్చు. దానికి కారణం మనం ఒంటరితనం.. మన జీవితం నేర్పించే పాఠాలే. ఒకప్పుడు మీరు చాలా సెన్సిటివ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏ మాత్రం ఆ జీవితానికి దరిదాపుల్లో కూడా లేమని మీకే అనిపించవచ్చు.
మనం కఠినంగా మారిపోయామని మీకు అనిపించినా.. ఏదొక మూమెంట్లో మీలో కూడా కొన్ని ఫీలింగ్స్ దాగి ఉన్నాయనే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎలా అంటే.. చాలా మంది పెంపుడు జంతువులను చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాటికి నిరంతరం సేవలు చేస్తూ ఉంటారు. వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఇంత సెన్సిటివ్‌గా ఉండే వీరు.. సోషలైజ్ అవ్వలేరు. ఇతరులు చనిపోయినా.. అవి ఏమాత్రం వారిని డిస్టర్బ్ చేయవు. కానీ.. వారు పెంచుకున్న పెంపుడు జంతువుకి ఏది అయినా.. వాళ్లు అల్లాలాడిపోతారు. ఎందుకంటే వారి ఎమోషన్స్‌ని పంచుకునే ఏకైక ప్రాణమున్న జీవం ఆ పెంపుడు జంతువే కాబట్టి.
ఎందుకు వీళ్లు ఈ మూగజీవాలను ఇంతగా ప్రేమిస్తున్నారు అని ఎదుటివాళ్లకి అనిపించవచ్చు. పక్కన ఉన్నవాళ్లని పట్టించుకోరు కానీ.. జంతువులను చూడు ఎలా ప్రేమిస్తున్నారో అనుకుంటారు. కనీసం వాటికిచ్చే వాల్యూ కూడా మనుషులకు ఇవ్వరు అనుకుంటారు. కానీ రియాలటీ ఏంటంటే.. ఆ మూగజీవాలే వారికి అన్ని వేళలా తోడు ఉంటాయి. ముఖ్యంగా వారికి ఎదురు చెప్పలేవు. అంతేకాదు వారి బాధలను, కష్టాలను, సుఖాలను అన్నింటిని ఓపికగా వింటాయి. ఎవరూ లేరు అని బాధపడుతున్నప్పుడు.. ప్రేమగా దగ్గరికి వస్తాయి. ఒకప్పుడు చుట్టూ ఉన్నవారు ఆశించిన ప్రేమను ఇవ్వనప్పుడే.. వాళ్లు మూగజీవాలకు దగ్గరవుతారు. ఈ విషయం చాలా మందికి తెలియక.. మనుషుల కంటే మూగజీవాలనే ఎక్కువ ప్రేమిస్తున్నారని సెటైరికల్‌గా మాట్లాడేస్తారు.
మీరు "CAST AWAY'' సినిమాను చూసి ఉంటే.. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం కచ్చితంగా అర్థమవుతుంది. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలో సమాజానికి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఓ ఫుట్‌బాల్‌పై ఎలా మమకారం పెంచుకున్నాడో అనే కోణాన్ని చాలా చక్కగా చూపించారు. ఒక శవాన్ని పూడ్చినప్పుడు కూడా కన్నీటి చుక్కను రాల్చని వ్యక్తి.. ఓ ఫుట్‌బాల్ పోయినప్పుడు.. గుండెలవిసేలా ఎందుకు రోధిస్తాడో అనే విషయాన్ని చాలా చక్కగా వివరించాడు దర్శకుడు. అలాగే మూగజీవాలపై కూడా అమితమైన ప్రేమను పెంచుకోవడానికి వెనుక ప్రతి వ్యక్తికి ఏదొక బలమైన కారణం ఉంటుంది. అవి తమ దగ్గరనుంచి దూరమైపోతాయనే ఆలోచన కూడా వారికి రాదు కాబట్టి.. వాటితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు. అవి చనిపోయినా.. దూరమైపోయినా.. వారిలోని ఎమోషన్స్ మరింత బయటకు వచ్చేస్తాయి.
ఎందుకంటే మళ్లీ ఒంటరి అయిపోయామనే బాధనో.. మళ్లీ అలాంటి ఎటాచ్మెంట్ మరోసారి దొరకదనే భయమో.. వారు ఎక్కువ బాధపడేలా చేస్తాయి. అవి ఎంతగా వారిని బాధిస్తాయంటే.. ఈ మధ్యకాలంలో వారిని ఏ పరిస్థితి కూడా.. ఇంతగా బాధించదు. అలాంటి వారు మీ చుట్టుపక్కల ఉంటే.. అర్థం చేసుకోండి. కుదిరితే ప్రేమను ఇవ్వండి. లేదంటే సైలంట్‌గా ఉండండి. ఎందుకంటే చావు అనేది ఒప్పుకోలేని నిజం. అది మనషి అయినా.. ప్రేమగా పెంచుకునే జంతువు అయినా.. అపురూపంగా చూసుకునే వస్తువు దూరమైనా.. ఆ వార్తను వారి మనసు తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఈ విషయాన్ని ఎంత త్వరగా రియలైజ్ అయితే.. అంత త్వరగా ఆ ట్రోమా నుంచి బయటపడవచ్చు.
సంబంధిత కథనం