Tuesday Motivation : గొప్ప యుద్ధం అంటే నీతో నీకే.. నిన్ను నువ్ గెలిస్తే.. ఎవరెస్ట్ అయినా ఎక్కగలవ్
Tuesday Motivation : జీవితంలో మనిషి వెనకపడేందుకు ముఖ్యమైన కారణం ఎమోషన్స్. పైకి ఎదుగుదామనుకుంటే.. ఏదో ఒక ఎమోషన్ ఆపేస్తుంది. వాటిని కంట్రోల్ చేయకపోతే.. జీవితంలో ఏదీ చేయలేవు. ఎమోషన్స్ కంట్రోల్ చేస్తేనే ఏదైనా సాధించగలరు.
మానసిక క్షీణత అంటే.. ఏదో అయిపోతుందనే ఆలోచనల్లో ఉండటం. ఇది నిజంగా ఒక సవాలు, బాధాకరమైన అనుభవం. ఇది ప్రస్తుతం నుంచి మిమ్మల్ని డిస్‌కనెక్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నారో అర్థం కాదు. భ్రమలు, ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఇది ఒత్తిడి, బాధాకరమైన సంఘటన వలన సంభవించవచ్చు. అందువల్ల వీటితో జాగ్రత్తగా ఉండాలి. వీటన్నింటికి కారణం మీ ఎమోషన్స్ అంతే.
మానసిక అనారోగ్యం అనేది ఒక వ్యక్తి వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోయే పరిస్థితి. ఒక వ్యక్తి మానసిక లక్షణాలను అనుభవించినప్పుడు, అతను ఫాంటసీ, వాస్తవికత మధ్య తేడాను గుర్తించలేడు. భ్రమలు, గందరగోళం వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. మానసిక రుగ్మతలకు కుటుంబ చరిత్ర, ముఖ్యంగా స్కిజోఫ్రెనియా లేదా బైపోలార్ డిజార్డర్ లాంటివి కారణం కావొచ్చు. అయితే వీటి నుంచి బయటపడొచ్చు. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
మరోవైపు మద్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం సైకోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రస్తుతం మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు, ప్రత్యేకించి, ఈ లక్షణాలను ప్రేరేపించవచ్చు లేదా తీవ్రతరం చేయవచ్చు. హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. ఇలా అన్నింటికి మూలం మీ ఎమోషన్స్ మాత్రమే. అంటే దెన్నైనా మీరు కంట్రోల్ చేస్తే.. మీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోతాయన్నమాట.
నాకు ఏదో అయిపోతుందనే ఆలోచనల్లో మీరు ఉంటే.. అక్కడే ఉండిపోతారు. జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ఏ మనిషి వందేళ్ల బతకడు. ఉన్న కొన్ని రోజులూ మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రేమ విఫలమైందని, దగ్గరి వాళ్లు చనిపోవడంలాంటి ఘటనలతో ఎమోషనల్ డిస్టబెన్స్ ఉంటుంది. కానీ ఆ బాధను మోసేది కొన్ని రోజులే ఉండాలి. ఏ బంధం అయినా వందేళ్లు ఉండదు.. ఏ బాధ అయినా.. అంతే. మోయాల్సినన్నీ రోజులే బాధను మోయాలి. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి.
మీ జీవితం నుంచి ఒక విలువైన వ్యక్తి వెళ్లిపోతే.. మరొ విలువైన వ్యక్తి వస్తున్నాడని అర్థం. అక్కడే ఆగిపోతే.. ముందుకు సాగిపోవుట కష్టం అవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే.. ఇక దేనిని కంట్రోల్ చేసుకోలేరు. మీ ఆలోచనలను మీరే అదుపులో పెట్టుకోవాలి. జీవితంలో గెలవడం అంటే.. ముందుగా మిమ్మల్ని మీరు గెలవాలి. తర్వాత విజయమే మీకు దారి చూపిస్తుంది. మనిషి ఎమోషనల్ వీక్ నెస్ నుంచి బయటకు వస్తే.. దాదాపు తనపై తాను గెలిచినట్టే. అందుకే ప్రపంచంలో ఎవరితోనైనా యుద్ధం చేయోచ్చు.. నా అనుకున్నవాళ్లతో.. నీతో నువ్ యుద్ధం చేయడమే కష్టం. అందులో విజయం సాధిస్తే.. ఇక నీకు తిరుగేలేదు.
గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నీతో నీకే.. అది గెలిస్తే.. ప్రపంచంలో దెన్నైనా గెలవచ్చు. అదే నీ ఎమోషన్స్ ను నువ్ కంట్రోల్ చేయలేకపోతే.. ఎవరెస్ట్ కాదు కదా.. మీ ఇంటి దగ్గర ఉన్న చిన్నబండరాయిని కూడా ఎక్కలేవు.