Tuesday Thoughts : ప్రేమ కావాలంటే ప్రేమించాల్సిందే..-tuesday motivation healthy relationship doesn t drag you down it inspires you to be better ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation Healthy Relationship Doesn't Drag You Down It Inspires You To Be Better

Tuesday Thoughts : ప్రేమ కావాలంటే ప్రేమించాల్సిందే..

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 04:30 AM IST

Tuesday Vibes : మనం ఎవరితోనైనా సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే, మన వంతు ప్రయత్నం చేయాలి. అలా చేయలేక, ఎదుటివారి ప్రయత్నాలను అర్థం చేసుకోకపోతే.. మీ సంబంధం ఎక్కువకాలం ఉండదు.

లవ్
లవ్

ఒక మనిషి దూరం కావడం అనేది.. మరణం ద్వారా మాత్రమే కారణం కాదు. కొన్ని బంధాలు బతికుండగానే.. తెలియకుండానే చంపేస్తాం. ప్రతి సంబంధం నమ్మకం, ప్రేమపై నిర్మించబడింది. అలాంటి బంధాలు బలంగా ఉంటాయి. కానీ వీటి మధ్య అహంకారం, అజ్ఞానం, స్వప్రయోజనం మొదలైనవి వస్తే ఆ బంధం కూలిపోతుంది. సంబంధాన్ని ఎంత కష్టపడి నిర్మించుకున్నామో అది ముఖ్యం కాదు.. ఆ సంబంధాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాం అన్నదే ముఖ్యం.

అపార్థం, అహం, చెడు ప్రవర్తన.. ఇలా ఎన్నో కారణాలు బంధాన్ని నాశనం చేస్తాయి. మనం ఎవరితోనైనా సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే, మన వంతు ప్రయత్నం చేయాలి. మీరు అలా చేయడానికి ప్రయత్నించకపోతే, మరొకరి ప్రయత్నాలను మీరు అర్థం చేసుకోకపోతే, మీ సంబంధం పనిచేయడం లేదని అర్థం. సానుకూల దృక్పథంతో బంధాలు పెరుగుతాయి. మన తప్పులను మనం గుర్తించాలి. అప్పుడు మీరు ఇతరులను అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటే, మీరు నిజంగా అదృష్టవంతులు. అలాంటి వారు మిమ్మల్ని వదులుకోరు.

మీరు నిజంగా సంబంధాన్ని కాపాడుకోవాలనుకుంటే, తప్పు మీ వైపు ఉంటే, వీలైనంత త్వరగా మీ మధ్య ఉన్న అపోహలను తొలగించండి. కొన్ని విషయాలు ఆలస్యంగా అయ్యే కొద్దీ క్లిష్టంగా మారతాయి. వారికి మీ ప్రేమను తెలిపిన తర్వాత, వారికి కొంత సమయం ఇవ్వండి. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి. ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండండి. ఇది మీ మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు అవతలి వ్యక్తిని సంతోషపెట్టడానికి కొన్ని రాజీ పడాల్సి వస్తుంది. అలానే చేయండి తప్పులేదు. లేకపోతే ఆ బంధాన్ని కోల్పోతారు. మీరు చెప్పేది చేయడానికి వారు ఇష్టపడకపోతే, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ‘నేను చెబితే ఎందుకు వినడం లేదు’ అనే వైఖరి కూడా తగదు.

వీలైనంత వరకు అనవసరమైన, వ్యర్థ సంభాషణలకు దూరంగా ఉండండి. కలిసి ఆనందంగా గడపడం నేర్చుకోండి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమ కావాలంటే ప్రేమించాలి. అపార్థాలకు బదులు, స్పష్టతతో దూరం చేసుకోవడం మంచిది. బంధాలు ఎల్లప్పుడూ అర్థవంతంగా, షరతులు లేకుండా ఉండాలి. అలాంటి బంధాలు కాలక్రమేణా బలపడతాయి. ఏ సంబంధంలోనైనా నిజాయితీ అవసరం. ఒకరి సంతోషాన్ని, దుఃఖాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఏ బంధమూ నిలబడదు. ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తే..అర్థం చేసుకుంటే..ముఖ్యంగా ప్రేమను అందిస్తే వారిని దూరం పెట్టకండి.

బంధం అంటే అన్నీ ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడం కాదు.. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా బాధ్యత తీసుకుంటే.. అది అసలైన బంధం.

WhatsApp channel