Tuesday Motivation : అవకాశాల కోసం చూడొద్దు.. సృష్టించుకోవాలి
Tuesday Motivation : ఏదో చేద్దామనుకుంటారు. కానీ అవకాశాలు రావు. దీంతో కుంగిపోతారు. కానీ అవకాశాల కోసం ఎదురుచూడటం కంటే.. అవకాశాలను సృష్టించుకుంటేనే విజయం మీ సొంతం అవుతుంది.
జీవితం మీద కంప్లైంట్స్ చాలా మందికి ఉంటాయి. అవకాశాలు రావడం లేదని.. చాలా మంది అంటుంటారు. మీ దగ్గర టాలెంట్ ఉండి కూడా.. మీ పనిని, టాలెంట్ ని చూపిద్దామనుకుంటే మాత్రం అవకాశం దొరకట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. ఇప్పుడు అవకాశాల కోసం చూడటం కాదు.. అవకాశాలను సృష్టించుకోవాలి. మీరే ఓ పదిమందికి ఉద్యోగం ఇచ్చేలా తయారుకావాలి.
ట్రెండింగ్ వార్తలు
అవకాశాలు సృష్టించేవాళ్లే.. పది మందికి దారి చూపిస్తారు. అలా మీరు కూడా తయారు కావాలి. ఇప్పుడు అంతా అవకాశాన్ని సృష్టించుకునే వాళ్లే టాలెంట్ ఉన్నవాళ్లు. అవకాశాల కోసం ఎదురుచూడొద్దు. ఎదురుచూపుల్లో ఏదో వెలితి ఉంటుంది. వెతకడంలో మాత్రం సంతృప్తి ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నం కదా అని తృప్తి దొరుకుతుంది.
అవకాశాలను సృష్టించుకునే టాలెంట్ ఉంటే.. బయటకొచ్చేది నిజమైన టాలెంట్. కాలం వేగంగా మారుతుంది. మీరు కూడా మారక తప్పదు. ఇప్పుడు మీకు ఎలాంటి టాలెంట్ ఉన్న బయట పెట్టేందుకు చాలా వేదికలు ఉన్నాయి. మీకు అవకాశం ఇచ్చేవాళ్లు మీ దగ్గరకు వచ్చేలా చేసుకునేందుకు చాలా దారులు ఉన్నాయి.
కష్టం కంటే.. సులభమైన దారుల్లోనే వెళ్లాలని చూస్తారు కొందరు. కానీ హార్డ్ వర్క్ తోనే గొప్ప విజయం వస్తుంది. కెరీర్‌లో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు ఎప్పుడైనా మొదట శ్రమించడం తర్వాతనే వస్తాయి. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలనుకుంటే మాత్రం అది మీ జీవితంలో చేసే పెద్ద తప్పు. కెరీర్‌లో ఎదగాలనుకుంటే.. అది మంచిది కాదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి, కార్యాచరణ ప్రారంభించాలి. అలాచేస్తే ఎప్పటికైనా కోరుకున్న విజయం సాధ్యమవుతుంది. మీరే అవకాశాలను సృష్టించొచ్చు.
హార్డ్‌వర్క్‌కు మరో ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదు. లక్ష్యాన్ని చేరుకుంటామో లేదో అనే కారణంతో పనిచేయడం ఆపేస్తే అంతకంటే ముర్ఖులు ఉండరు. మీకు ఏ అవకాశం కావాలో దానికోసం ప్రయత్నించండి. మీరు అవకాశం సృష్టించుకోవడమంటే.. మిమ్మల్ని మీరు జయించినట్టే. అంతా మంచే జరుగుతుందనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఇది పోటీ ప్రపంచం.. మీతో మీరు ముందుగా పోటీ పడాలి.
అనుకుంది.. జరగాలంటే కాస్త టైమ్ పడుతుంది. దానికి ఓపిక కావాలి. అత్యాశ, తొందరపాటు ఉండొద్దు. రా అనగానే గెలుపు వచ్చేయదు. సక్సెస్ కు స్పీడు తక్కువే.. కానీ బలంగా వస్తుంది. నెమ్మదిగా వస్తూనే.. చాలా లాభాలను తీసుకొస్తుంది. ఎప్పుడూ అవకాశాల కోసం.. ఎదురుచూడొద్దు. సృష్టించుకోవాలి. నీ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలంటే.. అవకాశాలను సృష్టించాలి. అవకాశం దొరికి.. ఎక్కడో ఓ దగ్గరకు వెళితే.. నువ్ పని చేసే కంపెనీలో ఉద్యోగులు నీ గురించి.. మాట్లాడుతారు. అందరిలానే నువ్ అయిపోతావ్.