చాలామంది చిన్న చిన్న విషయాలకే.. బంధాలను దూరం చేసుకుంటారు. నన్ను అంతటి మాట అంటారా.. ఇక అస్సలు మాట్లాడేదే లేదని చెప్పేస్తారు. బంధాన్ని దూరం చేసుకుంటే.. ఎంతో కొంత నీకు నువ్ దూరమైనట్టే.. ఏళ్ల నుంచి కొనసాగుతున్న రిలేషన్ షిప్ ఒక చిన్న మాటతో దూరమైతే.. మీరు అర్థం చేసుకున్నది ఏం ఉంది. మీరు ఎదుటి మనిషిలాంటి వారే అయిపోతారు. అందుకే ఓపిక ముఖ్యం.,చిన్న చిన్న విషయాలు వస్తూ.. పోతుంటాయి. కానీ మునుషులు మాత్రం అలానే ఉంటారు. ఉండే కొన్ని రోజులు వాళ్లతో హాయిగా గడపండి. ఏదైనా విషయం గురించి.. సమస్య ఉంటే నేరుగా మాట్లాడితే అయిపోతుంది. అంతేగానీ.. నేను అస్సలు తగ్గను అనుకుంటే.. ఆ బంధానికి మీరే దూరం అవుతారు. ఇది ఇద్దరినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఒకప్పుడు కలిసి తిరిగేవాళ్లం.. ఇప్పుడు చిన్న మాటకే విడిపోయాం అని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.,అందుకే ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే.. మీరు కాసేపు ఆగండి. ఆ తర్వాత ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. నువ్ అన్నమాట కారణంగా.. నేను ఇంతలా బాధపడ్డాను అని వివరించండి. నెమ్మదిగా చెబితే ఎవరైనా వింటారు. అలా కాకుండా మీరు కూడా ఎదుటి వ్యక్తిలాగే ఫైర్ అయితే.. రిలేషన్ షిప్ మిస్ ఫైర్ అవుతుంది. మాటలు అనే కాదు.. కొన్ని విషయాల్లోనూ వెనక్కు తగ్గి ఉండటం మంచిది. మీ బంధాన్ని మీరు కాపాడుకోవడంలో వెనక్కు తగ్గితే పోయేదేమీ లేదు.,కాస్త వెనక్కి తగ్గి చూడు.. నీ చుట్టూ ఉన్నవాళ్లకు నువంటే ఎంతో గౌరవం పెరుగుతుంది. అలా అని ప్రతీ విషయాన్ని భరించాలనీ కాదు.. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మానేస్తే చాలు. మీ మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. బంధాన్ని కాపాడుకోవడంతోపాటుగా మీ చట్టుపక్కల వాళ్లకి మీ మీద గౌరవం పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు అనుకోకుండా తప్పు చేసినా.. వాళ్లు సర్దుకుపోయేందుకు ఛాన్స్ ఉంటుంది.,కాస్త వెనక్కి తగ్గితే చాలు.. అందరితో హ్యాపీగా చాలా దూరం వెళ్ల గలవు.. ఏదో మనసులో పెట్టుకుంటే ఏం వస్తుంది.. నీ చుట్టూ ఉన్న వాళ్లు నీ వాళ్లే.. నీ వాళ్ల కోసం నువ్ తగ్గితే నువే గెలిచినట్టు.. కాస్త వెనక్కి తగ్గితే.. పోయేదేముందీ.. మహా అయితే చాలా కాలం వాళ్లు నీతో ప్రయాణిస్తారు అంతే..,