Tuesday Motivation : బోగన్ విల్లా మెుక్క నేర్పించే జీవిత పాఠం.. తప్పకుండా చదవాలి-tuesday motivation bougainvillea tree teach us what is life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation Bougainvillea Tree Teach Us What Is Life

Tuesday Motivation : బోగన్ విల్లా మెుక్క నేర్పించే జీవిత పాఠం.. తప్పకుండా చదవాలి

Anand Sai HT Telugu
Mar 26, 2024 05:00 AM IST

Tuesday Motivation : ప్రకృతి మనకు ఎన్నో విషయాలను చెబుతుంది. కానీ దానిని మనం అర్థం చేసుకోం. బోగన్ విల్లా మెుక్క మనకు ఎన్నో విషయాలను చెబుతుంది. ఏంటో తెలుసుకుందాం..

బోగన్ విల్లా
బోగన్ విల్లా (Unsplash)

జీవితంలో బాధలు వస్తే అక్కడే ఉండిపోతాం. కానీ మనకు ప్రకృతి మాత్రం ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. బాధలతో అక్కడే ఉండిపోతే.. అక్కడే కుప్పకూలిపోతాం. అదే తెగించి ముందుకు వెళితే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఏం చేయాలో తెలుస్తుంది. ప్రకృతి మనకు నేర్పించే ఓ గొప్ప పాఠం గురించి తెలుసుకుందాం..

ఒక వ్యాపారి చాలా బాధలో ఉన్నాడు. అందుకని ఒక సన్యాసి దగ్గరికి వెళ్లి పరిష్కారం కోసం అడిగాడు. అప్పుడు సన్యాసితో నాకు ఒక సమస్య ఉందని చెప్పాడు. మీరు దాన్ని సరిచేయాలని అడిగాడు. ఏమిటి ఆ సమస్య అని సన్యాసి అడిగాడు. బాధల చెరలో బంధి అయిపోయాను అని చెప్పుకొచ్చాడు వ్యాపారి. ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఎటు వెళ్లాలో తెలియడం లేదని వివరించాడు. కారణం ఏమిటి అని సన్యాసి మళ్లీ ప్రశ్నించాడు. నేను అప్పుల్లోకి వెళ్లిన తర్వాత నా దగ్గరకు ఎవరూ రావడం లేదని తెలిపాడు. కొందరేమో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు.

అది విన్న సన్యాసి అతనితో నువ్వు తప్పు చేశావు. నిజానికి నీకు బాధ కలిగించేది నీ మనసే అన్నాడు. అలాంటప్పుడు బాధ నుండి బయటపడే మార్గం ఏమిటి అని వ్యాపారి అడిగాడు.

ముందు నీ మనసును అర్ధం చేసుకో, బాధ నీ దగ్గరికి రాదు అని అన్నాడు. అప్పుడు సన్యాసిని ఎలా అర్థం చేసుకోవాలని వ్యాపారి ప్రశ్నించాడు. బాధలు వచ్చినప్పుడు మనస్పూర్తిగా అంగీకరిస్తే, బాధలు ఉండిపోతాయి. ఏం కాదు.. మళ్లీ నేను లేచిన నిలబడతానని ఎదురిస్తే.. పైకి లేవొచ్చు అని వివరించాడు. బాధలు వచ్చినప్పుడు మనస్సు కష్టపడుతుందని, నిజాలను అంగీకరించాలని, నీ దగ్గర నుంచి వెళ్లిన వారందరూ నీ చుట్టు తిరిగేలా చేసుకోవాలని చెప్పాడు. ఈ సందర్భంగా సన్యాసి దగ్గరే ఉన్న బోగన్ విల్లా మెుక్కను చూపించాడు.

అక్కడే ఉన్న బోగన్ విల్లా చెట్టు బాగా విరగబూసింది. దాని పువ్వులు చూస్తే అందరికీ ముచ్చటేసేలా ఉన్నాయి. అయితే దానిని చూపిస్తూ ఓ కథ చెప్పాడు సన్యాసి. ఆ చెట్టుకు ఎవరైనా నీరు పోయకుంటే అది అలా బాగా పువ్వులు పూస్తుంది. ఒకవేళ మనం నీరు పోస్తే అది పచ్చగా ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. తన పువ్వుల అందం చూసి ఎవరైనా నీరు పోయాలనే ఆ చెట్టు అలా తయారవుతుందని చెప్పుకొచ్చాడు. మనం నీరు పొస్తే పువ్వులు తగ్గి.. పచ్చని ఆకులు వస్తాయని వివరించాడు.

వ్యాపారి ఆలోచనల్లో పడ్డాడు. ప్రకృతి మనకు ఎన్నో దారులను చూపిస్తుంది. ఆ బోగన్ విల్లా మెుక్క పూల అందాలను చూసి ఎవరైనా నీరు పోస్తారని అందంగా అవుతుంది. అది ప్రకృతి నేర్పిన పాఠం. ఆ చెట్టుకు తెలిసిన ధర్మం. నువ్వు కూడా జీవితంలో ముందుకు వెళ్లీ.. నీ బాధలు తగ్గాలంటే సరైనా దారి దొరుకుతుంది. కావాల్సిందల్లా నీ ఆలోచనలు మాత్రమేనని సన్యాసి చెప్పుకొచ్చాడు. సరైనా దారిలో ఆలోచించి ప్రయాణస్తే.. నిన్ను వెళ్లినవారంతా నీ దగ్గరకు తిరిగి వస్తారని చెప్పుకొచ్చాడు సన్యాసి.

WhatsApp channel